- డయాలసిస్ కోసం ఆర్థికసాయం చేసి ఆదుకోండి
- 35వ రోజు మంత్రి నారా లోకేష్ ‘‘ప్రజాదర్బార్’’కు విన్నపాల వెల్లువ
- అండగా ఉంటామని బాధితులకు భరోసా ఇచ్చిన మంత్రి
అమరావతి(చైతన్యరథం): ఉండవల్లిలోని నివాసంలో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ 35వ రోజు ‘‘ప్రజాదర్బార్’’కు ప్రజల నుంచి విన్నపాలు వెల్లువెత్తాయి. మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ సమస్యలతో బాధపడుతున్న ప్రజలు సోమవారం మంత్రి నారా లోకేష్ ను స్వయంగా కలిసి తమ సమస్యలను విన్నవించారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి… అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
మంగళగిరి నియోజకవర్గం నుంచి వచ్చిన విజ్ఞప్తులు
దివ్యాంగురాలినైన తనకు పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని తాడేపల్లికి చెందిన కె.విజయలక్ష్మి విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.
రెండు కిడ్నీలు పాడైపోయిన తనకు డయాలసిస్ కోసం ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన సంగ నాగేంద్రబాబు కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
డిప్లమో చదివిన తన కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించాలని మంగళగిరి రత్నాలచెరువుకు చెందిన శీరం సూర్యనారాయణ విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిలిపివేసిన పెన్షన్ ను తిరిగి పునరుద్ధరించాలని మంగళగిరికి చెందిన దాసరి మేజేస్ కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
ఎలాంటి ఆధారం లేని తనకు ఎయిమ్స్ ఆసుపత్రిలో స్వీపర్ ఉద్యోగం ఇప్పించి ఆదుకోవాలని తాడేపల్లి మండలం నులకపేటకు చెందిన కే.అఖిల విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన విజ్ఞప్తులు
గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం గుండాలపాడుకు చెందిన ముస్లిం మైనార్టీలు మంత్రి నారా లోకేష్ ను కలిశారు. తమ గ్రామంలో ఉన్న 15 సెంట్ల మసీదు మాన్యంలో షాదీఖానా నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గ్రామంలో వివాహాది శుభకార్యాలకు కల్యాణమండపం కానీ, షాదీ ఖానా కానీ లేవని, గ్రామంలో ముస్లిం మైనార్టీల జనాభా ఎక్కువ ఉన్నందున షాదీఖానా నిర్మాణానికి సహకరించాలని కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.
ఏపీ జెన్‌కో లో ఫైర్, సెక్యూరిటీ విభాగాల్లో పనిచేస్తున్న మాజీ సైనికులకు రెగ్యులర్ సిబ్బందితో పాటు సమాన వేతనం కల్పించాలని, ఏడాదికి ఉన్న సెలవులను 12 నుంచి 30కి పెంచాలని సిబ్బంది విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలో చెరుకుపల్లి మండలం గూడవల్లిలో తనకు కేటాయించిన 2.84 ఎకరాల భూమికి డీకే పట్టా మంజూరు చేయాలని గుంటూరు జిల్లా వట్టిచెరుకూరుకు చెందిన చందోలు ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
గత 33 ఏళ్లుగా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న తాను ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నానని, ఏపీజీఎల్‌ఐ(ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్) సొమ్ము ఇప్పించి ఆదుకోవాలని కాకినాడ జిల్లా గొల్లప్రోలుకు చెందిన ఎమ్‌ఎస్ సీహెచ్ సాయిబాబా కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
1998 డీఎస్సీ ఎంటీఎస్ ఉపాధ్యాయులకు 62 సంవత్సరాల సర్వీసు పొడిగింపుతో పాటు 12 నెలల వేతనం కల్పించాలని, పదవీ విరమణ తర్వాత కనీస పింఛన్ కల్పించాలని డీఎస్సీ-98 ఎంటీఎస్ టీచర్స్ ఫెడరేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
పల్నాడు జిల్లా క్రోసూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్య కమిటీ ఛైర్మన్ బి.రాధాకృష్ణ.. మంత్రి లోకేష్ ను కలిశారు. శిథిలావస్థలో ఉన్న ప్రాథమిక పాఠశాలకు నూతన భవనం నిర్మించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పాతభవనం ఎప్పుడు కూలిపోతుందోనని అని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
అనారోగ్యంతో బాధపడుతున్న తాను ఆసుపత్రిలో చికిత్స పొందానని, సీఎంఆర్‌ఎఫ్ కింద సాయం అందించి ఆదుకోవాలని మైలవరం నియోజకవర్గం కొత్తూరు తాడేపల్లికి చెందిన ధనేకుల ఉషాకుమారి విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
మైలవరంలో తన తల్లి పేరుపై ఉన్న ఎకరం భూమిని తప్పుడు రిజిస్ట్రేషన్ తో అన్యాక్రాంతం చేశారని కొత్తూరు తాడేపల్లికి చెందిన కొమ్మినేని కనకయ్య ఫిర్యాదు చేశారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని వాపోయారు. విచారించి తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.