హైదరాబాద్: ఏపీ మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీబీఐ ప్రత్యేక కోర్టులో ఉన్న జగన్ అక్రమాస్తుల కేసులపై రోజువారీ విచారణ చేపట్టాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు బుధవారం జారీ చేసింది. గత విచారణకు, ఇప్పటికీ ఎలాంటి పురోగతి కనిపించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. మాజీ సీఎం జగన్పై ఉన్న సీబీఐ కేసుల్లో ఇంకా విచారణే మొదలు కాలేదని, త్వరితగతిన విచారణ పూర్తి చేసేలా ఆదేశాలు ఇవ్వాలని మాజీ ఎంపీ హరిరామ జోగయ్య గతేడాది దాఖలు చేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. విచారణలో ఎలాంటి పురోగతి లేదని పిటిషనర్ తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా… రోజు వారీ విచారణ చేపట్టాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.