- దళిత ఉపముఖ్యమంత్రిని యూజ్‌లెస్‌ఫెలో అంటారా?
- దళితులే జగన్‌రెడ్డి ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తారు
- కరుణాకర్ కుటుంబానికి న్యాయం జరగకపోతే తాడేపల్లి ప్యాలెస్ ముట్టడి
- దళితులందరూ ఏకంకావాలని పిలుపు
- మాజీ మంత్రి కేఎస్ జవహర్
అమరావతి: రాష్ట్రంలో దళితుల మానప్రాణాలకు రక్షణలేకుండా పోయిందని మాజీ మంత్రి కేఎస్ జవహర్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రశ్నించే దళితులను ఒక వైపు పోలీసులు, మరోవైపు వైసీపీ నేతలు నానా రకాలుగా వేధించి, హింసిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా దళితుల పరిస్థితి దయనీయంగా ఉందని, దళితులను హత్య చేయడానికి కూడా వైసీపీ నేతలు వెన కాడటంలేదన్నారు.జడ్జి రామకృష్ణ, అతని సోదరుడి విష యంలో రామచంద్రారెడ్డి ఏ విధంగా వ్యవహరిస్తు న్నారో ప్రజలు గమనిస్తునే ఉన్నారని చెప్పారు. చివరికి ఉప ముఖ్యమంత్రులను కూడా అవమానిస్తున్నారని,ఉప ముఖ్యమంత్రిని యూజ్‌లెస్‌ఫెలో అంటారా అని మండి పడ్డారు. ఇంతటి ఘోరమైన పరిస్థితులు రాష్ట్రంలో ఎప్పుడూ లేవన్నారు. పాలన ఇలాగే కొనసాగితే దళితులే జగన్‌రెడ్డి ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తారని హెచ్చరిం చారు. తన చేపల చెరువులో చేపల్ని పట్టకోనివ్వకుండా కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి, సురేష్‌రెడ్డిలు అడ్డుకున్నారని, తన బ్రతుకుతెరువును వారు నాశనం చేశారని కావలికి చెం దిన కరుణాకర్ అనే వ్యక్తి సూసైడ్ నోట్ రాసి చనిపో యినట్లు తెలిపారు. వరప్రసాద్ అనే దళితుడు ఇసుక అక్రమాలపై ప్రశ్నించినందుకు వైసీపీ నేతలు శిరోముం డనం చేయించారని చెప్పారు. హెల్మెంట్ పెట్టుకోలేదని శ్రీకాంత్ అనే వ్యక్తిని చంపారన్నారు. ఎమ్మెల్సీ అనంత బాబు తన రహస్యాలను బయట పెడతాడని డ్రైవర్ సుబ్రమణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేశాడని వివరిం చారు. డాక్టర్ సుధాకర్, మహాసేన రాజేష్, హర్షకు మార్.. ఇలా అనేక మంది దళితులను ఇబ్బందులపాలు చేస్తున్నారని చెప్పారు. ఇలాంటి పరిపాలనలో తాము బతికేది ఎలా అని ప్రతి దళితుడు ప్రశ్నిస్తున్నట్లు పేర్కొ న్నారు. కారుణాకర్ ఆత్మహత్యకు కారణమైన కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డిని, సురేష్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కరుణాకర్ కుటుంబానికి న్యాయం జరుగకపోతే తాడేపల్లి ప్యాలెస్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆ కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఉద్దరిస్తాడనుకుంటే కొరివితో తలగోక్కున్నట్లయింది
తమను ఉద్ధరిస్తాడని దళితులు ఏరికోరి జగన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేశారని, ఇప్పుడు పరిస్థితి కొరివితో తలగోక్కున్నట్లు తయారైందని బాధపడుతున్నారని చెప్పారు. మేనమామనంటూ బైబిల్ పట్టుకొని ప్రజల్ని మోసం చేశాడని ధ్వజమెత్తారు. దళితులపై వేధింపులు, హత్యలు, ఆత్మహత్యలు పెరిగిపోతున్నా జగన్‌కు చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. పోలీసులు, వైసీపీ నాయకులు పెట్టే వేధింపులకు తట్టుకోలేక కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు.
రాష్ట్రంలో ఇంత దారుణాలు జరుగుతున్న నేపథ్యంలో దళితులు అందరూ ఏకమై ఎదుర్కోవాలని పిలుపు ఇచ్చారు. హత్యలు, అత్యాచారాలు చేయడమే వైసీపీ నాయకులకు క్వాలిఫికేషన్‌గా ఉందన్నారు. అన్యాయం ఎవరికో జరిగిందని దళితులు ఊరుకుంటే, రేపు వారికీ అదే పరిస్థితి వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దళితులు బయటికొచ్చి ప్రశ్నించాలని కోరారు. దళితులపై దాడులు సరైన పద్దతి కాదని, అణచివేత నుంచి విప్లవం పుట్టుకొస్తుందని హెచ్చరిం చారు. పెద్ద పెద్ద మాటలు చెప్పే హోం మంత్రి తానేటి వనిత, జూపూడి ప్రభాకర్ దళిత నాయకులైనా దళితులకు ఉపయోగంలేదన్నారు. ఆదిమూలపు సురేష్ బడుగు, బలహీన వర్గాలకు ప్రమాదకారిగా మారారని చెప్పారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని పదవులు వచ్చాక నేడు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని జవహర్ మండిపడ్డారు.