- సుమారుగా 1100 ఎకరాల భూములు కైవసం
- దాడులు, దౌర్జన్యాలు, దారుణాలే అతని పంథా
- దరిద్రుడి నుంచి దేవుడి వరకూ దోచుకున్న వైనం
- వైసీపీ సామంత నియంత ద్వారకానాథ్ రెడ్డి
- పుష్కరం క్రితం డొక్కు స్కూటర్.. ఇప్పుడు 3కోట్ల కారు
- తంబళ్లపల్లి ఎమ్మెల్యే అంతులేని అరాచకాలు
- ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కర్ణాటక బ్రాండ్లు
బెడ్ పెగ్గుతో మంచం దిగుతాడు. గోల్డెన్ డ్రాప్స్‌తో మంచమెక్కుతాడు. రోజంతా మైకంలోవున్నా.. మట్టే `అతనికి అసలైన మత్తు. దందాలే `అతనికి పిచ్చ కిక్కు. దాడులు, దౌర్జన్యాలు, దారుణాలే తప్ప అభివృద్ధి, సంక్షేమం, పాలనలాటివి పదాలకు అతనికి నిర్వచనం తెలీదు. నిండైన విగ్రహంతో గంభీరంగా కనిపించే అతని పేరు `ద్వారకానాథ్ రెడ్డి. ఇంటిపేరు`పెద్దిరెడ్డి. నియోజకవర్గం తంబళ్లపల్లి. ప్రజాప్రతినిధిని చేసిన పార్టీ వైసీపీ. అతని గురించి మంచిగా చెప్పుకోడానికి `వేసుకున్న వైట్ షర్ట్ తప్ప ఏమీ ఉండదు. కానీ, చీకటి కోణాన్ని చూస్తేనే `సమయం చాలనంత స్క్రిప్ట్ రాసుకో వచ్చు. 8వ తరగతిని మధ్యలో ఆపేసి `రాజకీయం చదవడం మొద లెట్టిన ద్వారకనాథ్‌్‌రెడ్డి.. తక్కువ టైంలోనే బాగా వంట బట్టించుకున్నాడు. నేరపూరిత ఆలోచనల నుంచి పుట్టు కొచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్‌లో రాజకీయాలు చదువుకున్న ద్వా.నా.రెడ్డికి అదే పంథా అల వడిరది. ‘కొట్టి బతకడమే’ `ప్రజాప్రతినిధి ప్రాథమిక హక్కని భావించాడు. అందుకే `ఐదేళ్ల ఎమ్మెల్యే పదవీ కాలంలో అతని అక్రమాల చిట్టా.. టాప్‌టెన్ క్రైం ఎమ్మె ల్యేల సరసన చేర్చేంతగా పెరిగింది.
బెడ్ పెగ్గుతో మంచం దిగుతాడు. గోల్డెన్ డ్రాప్స్‌తో మంచమెక్కుతాడు. రోజంతా మైకంలోవున్నా.. మట్టే `అతనికి అసలైన మత్తు. దందాలే `అతనికి పిచ్చ కిక్కు. దాడులు, దౌర్జన్యాలు, దారుణాలే తప్ప అభివృద్ధి, సంక్షేమం, పాలనలాటివి పదాలకు అతనికి నిర్వచనం తెలీదు. నిండైన విగ్రహంతో గంభీరంగా కనిపించే అతని పేరు `దారకానాథ్ రెడ్డి. ఇంటిపేరు `పెద్దిరెడ్డి. నియోజకవర్గం తంబళ్లపల్లి. ప్రజాప్రతినిధిని చేసిన పార్టీ వైసీపీ. అతని గురించి మంచిగా చెప్పుకోడానికి `వేసుకున్న వైట్ షర్ట్ తప్ప ఏమీ ఉండదు. కానీ, చీకటి కోణాన్ని చూస్తేనే `సమయం చాలనంత స్క్రిప్ట్ రాసుకో వచ్చు. 8వ తరగతిని మధ్యలో ఆపేసి `రాజకీయం చదవడం మొదలెట్టిన ద్వారకనాథ్‌్‌రెడ్డి.. తక్కువ టైం లోనే బాగా వంటబట్టించుకున్నాడు. నేరపూరిత ఆలో చనల నుంచి పుట్టుకొచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్‌లో రాజ కీయాలు చదువుకున్న ద్వా.నా.రెడ్డికి అదే పంథా అల వడిరది. ‘కొట్టి బతకడమే’ `ప్రజాప్రతినిధి ప్రాథమిక హక్కని భావించాడు. అందుకే `ఐదేళ్ల ఎమ్మెల్యే పదవీ కాలంలో అతని అక్రమాల చిట్టా.. టాప్‌టెన్ క్రైం ఎమ్మె ల్యేల సరసన చేర్చేంతగా పెరిగింది. పొద్దస్తమానం `అవినీతి కంపు. చీకటిపడే సమయానికి ` జల్సాల కోసం నియోజకవర్గ సరిహద్దులోని కర్నాటకకు జంపు. ఇదీ ఆయన`డైరీ పేజీ. దరిద్రుడి నుంచి దేవుడి వర కూ తొక్కి, మింగి పైకెదిగిన ద్వా.నా.రెడ్డి `3.2 వేల కోట్లు సంపాదించి ఉంటాడన్నది ఓ అంచనా. మార్కెట్ రేట్‌లో లేక్కేస్తే `మరికొంత ఎక్కువే ఉండొచ్చేమో.
బడుగుల భూములు లాక్కోవడం నుంచీ.. మల్లయ్య కొండ గుళ్లోని పురాతన విగ్రహం మాయ మవడం వర కూ.. ఈయన లీలలు లెక్కలేనన్ని. ఐదేళ్ల అధికారాన్ని అనుభవించిన పెద్దిరెడ్డి`నియోజకవర్గంలో కొత్తగా వేసి న రోడ్డూ లేదు. నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమమూ లేదు. ప్రజాప్రతినిధిగా చేసిందేమీ లేదుగానీ, చీకటి సామ్రాజ్యంలో కోట్లు కూడబెట్టాడు. చిత్తూరుతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఆస్తులు జాగ్రత్తపెట్టాడు. రోడ్ల మర మ్మతులు, డ్రైనేజీ కాంట్రాక్టులు నిర్వహించే అతి సామాన్య కాంట్రాక్టరు స్థాయినుంచి వేల కోట్ల పనులు నిర్వహించే కంపెనీకి అధిపతిగా ఎదిగిన ద్వా.నా.రెడ్డి ప్రస్థానం వెనుక అనేక దారుణాలు, అఘాయిత్యాలు, అంతులేని అరాచకాలే ఉన్నాయి. బుల్లి స్కూటర్ మీద గల్లీగల్లీల్లో తిరిగిన పెద్దిరెడ్డి.. బడుగుల వీధుల్లోకి దూర నంత పడవల్లాంటి కార్లలో తిరుగుతున్నాడు. ఐదేళ్లలో అధికారాన్ని అడ్డంపెట్టుకుని, అరాచకాలు అక్రమాల దందాను నడిపి సంపాదించి నది `అక్షరాలా రూ.3,200 కోట్లు పైచిలుకు. తిరుపతి, బెంగళూరు, హైదరాబాద్‌ల లో రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాడు. బెంగుళూరులో 300 ఎకరాలకు పైగా భూమి కొనుగోలు చేశాడు. చిత్తూరు జిల్లాలో 200ఎకరాలకు పైగా విలువైన భూమి..ఇలాంటివెన్నో ఆస్తులకు అధిపతి `ద్వా.నా.రెడ్డి.
డొక్కు స్కూటర్ నుంచి…
సరిగ్గా 12 ఏళ్ల క్రితం వరకు డొక్కు స్కూటర్ మీద ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ బిల్లుల కోసం లాబీయింగ్ చేసుకునే ద్వారకానాథ్‌రెడ్డి ` ఇప్పు డు 4 వీలర్‌దాటి.. 6వీలర్స్ వరకు ఖరీదైన వాహనాలు కొనుగోలు చేశాడు. బెంగుళూరులో అతను ఉపయో గించే కారు రూ.3 కోట్లు. ఆంధ్రలో మాత్రం రూ.70 లక్షల కారులో తిరుగుతూ సరిహద్దు దాటగానే నిజ స్వరూపం చూపిస్తాడు. ఇతని కుటుంబీకుల ఆధ్వర్యం లో రూ.కోటికి పైగా విలువ చేసే ఆరు కార్లు ఉన్నాయి. కోటి లోపు విలువ చేసే కార్లు 10కి పైగా ఉన్నాయి.
అంతులేని భూకబ్జాలు..
ఇతని కన్నుపడితే`గూడు నిర్మించుకుందామని పైసాపైసా కూడబెట్టి కొనుక్కున్న స్థలాలకూ రక్షణ ఉండదు. తక్కువ మొత్తానికి రైతుల నుంచి బలవంతపు అంగీకార పత్రాలు రాయించుకుని పేదల భూములను దిగమింగిన అవినీతి అనకొండ. అతను తలచుకుంటే `దశాబ్దాల నుంచి అనుభవిస్తున్న ఆస్తుల పత్రాలు సైతం రాత్రికి రాత్రి మారిపోతాయి. తాత ముత్తాతల కాలం నుంచీ అనుభవిస్తున్న ఆస్తులకు సైతం కొత్తవార సులు పుట్టుకొస్తారు. జాతీయ రహదారికి ఆనుకుని సామాన్యుడి భూములుంటే కబ్జాఖాయం.ఇలాంటి అరా చకాలకు తంబళ్లపల్లి కేంద్రమైంది. ద్వార కనాథ్‌రెడ్డి ఆగడాలకు తాళలేక ఆస్తులు అమ్ముకుని వెళ్లిపోయిన వారు కొంతమంది అయితే, భూములు కోల్పోయి గుండెలు బాదుకుంటున్నవారు ఇంకొందరు.
అరాచకానికి అంతే లేదు..
ప్రభుత్వం ఏదైనా భూమిని అభివృద్ధి కార్యక్రమాల కోసం కానీ, ప్రభుత్వ అవసరాల కోసం కానీ రైతుల నుంచి తీసుకున్నప్పుడు పరిహారం చెల్లించడం లేదా మరో ప్రాంతంలో ప్రత్యామ్నాయ భూమి చూపడం సర్వసాధారణం. కానీ తంబళ్లపల్లి నియోజకవర్గం మాత్రం అందుకు భిన్నం. కురుబలకోట మండలం సీతివారిపల్లిలో ద్వారకానాథ్‌రెడ్డి అన్న పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డికి చెందిన కంపెనీ పీయల్‌ఆర్ ప్రాజెక్ట్స్ ఒక రిజర్వాయర్ నిర్మిస్తుంది. దీనికి టెండర్లు లేవు, అను మతులు లేవు, భూమి తీసుకున్నందుకు రైతులకు పరి హారమూ లేదు. రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు రూపాయి కూడా ఇవ్వకుండా పనులు మొదలెట్టారు. ప్రశ్నించిన రైతులపై దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులతో వేధింపుల పర్వానికి తెర లేపాడు. రిజర్వాయర్ పనులకు ఎన్‌జీటీ అనుమతి కూడా లేదు. దీనిని న్యాయస్థానాలు తప్పుపట్టినా ఏ మాత్రం పట్టించుకోకుండా యధేచ్ఛగా పనులు చేసు కుంటూ బిల్లులు తెచ్చుకుంటున్నారు.
కర్నాటక మద్యం తంబళ్లపల్లిలో..
ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా రాష్ట్రం మొత్తానికి మద్యం సరఫరా అవుతోంది. కానీ తంబళ్ల పల్లి నియోజకవర్గంలో ద్వారకనాథ్‌రెడ్డి కర్నాటక నుం చి తెచ్చిన మద్యం మాత్రమే ఇక్కడి ప్రభుత్వ దుకాణాల్లో అమ్మబడుతుంది. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో సగానికి పైగా కర్నాటక మద్యమే. ఈ దందాలో నెలకు రూ.25 కోట్ల మేర సొమ్ము చేసుకుంటున్నాడు. బార్లకు టెండర్లు పిలుస్తారంతే. వేరే వ్యక్తులు టెండర్లు వేయరు. ఎందుకంటే `అప్పటికే భయభ్రాంతులకు గురి చేస్తాడు ద్వా.నా.రెడ్డి. ఇవన్నీ మంత్రి కుటుంబీకులు, అనుచరుల ఆధ్వర్యంలోనే నడుస్తుంటాయి.
డీజిల్ అమ్మకాలపైనా..
ప్రభుత్వ అవసరాల కోసం ఉపయోగించే డీజిల్ కాంట్రాక్టు కూడా పెద్దిరెడ్డి కుటుంబీకులే నిర్వహిస్తుం టారు. కర్నాటక నుంచి పెద్ద ఎత్తున డీజిల్ దిగుమతి చేసి వాటిని ఆర్టీసీ బస్సులకు, ప్రభుత్వ వాహనాలకు సరఫరా చేసి నెలకు రూ.5కోట్ల మేర బిల్లులు పెడుతుంటారు.
కనిపించని పనులు.. మంజూరయ్యే బిల్లులు
నియోజకవర్గంలో 40 శాతానికి పైగా గ్రామాలకు సరైన రహదారి సదుపాయం లేదు.. 30 శాతం పైగా గ్రామాల్లోని ప్రజలకు గుక్కెడు మంచినీరు లభించని పరిస్థితి. కానీ ప్రభుత్వ రికార్డుల్లో 90 శాతంపైగా గ్రామాల్లో రహదారులు, తాగునీటి పథకాలు నిర్మిం చినట్లు ఉంటాయి. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్ట కుండానే, చేపట్టినట్లు బిల్లులు సృష్టించడంలో పెద్దిరెడ్డిది పెద్ద చేయి. అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఉపాధి హామీ పనులూ చేయకుండానే, చేసినట్లు రికార్డు సృష్టించి రూ.100 కోట్ల అవినీతికి పాల్పడ్డారు. తంబళ్లపల్లి మండలంలో ఉపాధిహామీ పనుల తనిఖీ బృందాలు పరిశీలించినప్పుడు కేవలం ఒక్క గ్రామంలో రూ.13 కోట్ల మేర నిర్వహించినట్లు బిల్లులుపెట్టిన పనిలో 20 శాతం కూడా పూర్తికాలేదన్న విషయం బట్టబయలైంది. ఈ వ్యవహారంలో ఒక క్షేత్ర సహా యకుడు, ఒక సాంకేతిక సహాయకుడు, ఐకేపీసీసీ ఉద్యోగి సస్పెండయ్యారు. ఇలా ఎంతోమంది అధికారు లు ద్వారకనాథ్‌్‌రెడ్డి ఆగడాలకు బలయ్యారు.
మట్టి మాఫియా..
పెద్దిరెడ్డి కుటుంబసభ్యుల అక్రమాలకు కాదేదీ అనర్హం అన్నట్లుగా ఇసుక, మట్టి, గ్రావెల్.. ఇలా ఏది కనిపించినా అందినకాడికి దోచుకుంటూ కోట్లు వెనకేశారు. తంబళ్లపల్లి, ములకలచెరువు, మల్లయ్య కొండతోపాటు మొత్తం 15చోట్ల అక్రమ క్వారీలు నిర్వహిస్తూ కొండల్ని చెరువులుగా మారుస్తున్నాడు. జేసీబీలు, భారీ క్రేన్లను పొరుగు రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి మరీ కొండల్ని పిండి చేస్తున్నాడు. ఈ అక్రమ మైనింగ్‌పై సాక్ష్యాధారాలతో అధికారులకు ఫిర్యాదు చేసినా.. అధికారబలంతో చర్యలు లేకుండా బయటపడుతున్నాడు.
అంతులేని అరాచకపర్వం..
పెద్దిరెడ్డి కుటుంబసభ్యులు ఎవరూ సీన్‌లోకి రాకుండా తమ అనుచరులతో పక్కా ప్రణాళికతో దాడులు, దౌర్జన్యాలను అతి కిరాతకంగా చేయడం పరిపాటి. నాటుసారా బట్టీలు, సివిల్ పంచాయతీలు, భూకబ్జాలు నిర్వహించడానికి 70 మందితో ప్రత్యేక సైన్యం నడుస్తుంటుంది. అక్రమాలను సాక్ష్యాధారాలతో సహా బట్టబయలు చేసినందుకు దళిత జడ్జి రామకృష్ణ పై దేశద్రోహం కేసు పెట్టారు. అక్రమ రిజర్వాయర్‌ను ప్రశ్నించినందుకు రైతులపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారు. కురుబలకోట మండలంలో ఒక సామాజిక వర్గం ఉండకూడదనే ఉద్దేశంతో ప్రతి ఇంటి మీద కేసు ఉండేలా అరాచకపర్వానికి తెరలేపారు.
ప్రతి పనికీ పైసా వసూల్..
అక్రమాలకు, అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన ద్వా.నా.రెడ్డి తంబళ్లపల్లి నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రైతుల పాస్ పుస్తకాల్లో మార్పులు, చేర్పులు దగ్గరనుంచి టీచర్ల బదిలీల వరకూ ప్రతి పనిలోను పైసలు వసూలు చేస్తున్నాడు. ఎమ్మార్వో, రిజిస్ట్రార్, ఎస్‌ఐ, సీఐల పోస్టింగ్‌లకు ప్రతిదానికీ రేటు పెట్టారు. ఈ మొత్తాన్ని వసూలు చేసే బాధ్యత ఎమ్మెల్యే బావమరిది చూస్తుంటాడు. ఏ అధికారికి పోస్టింగ్ ఇవ్వాలన్నా కప్పం కట్టాల్సిందే. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు. అంగన్‌వాడీ కార్యకర్తల పోస్టులు, రేషన్ వాహనాల మంజూరులోనూ పెద్దఎత్తున పైసలు వసూలు చేశారన్నది నియోజకవర్గం మాట.