- వికేంద్రీకరణపై చిత్తశుద్ధి ఉంటే వేలకోట్ల పంచాయితీ నిధులు దొంగిలిస్తారా?
- మీరు ఆడుతున్న మూడుముక్కలాటకు చట్టబద్ధత ఉందా?
- రాజకీయ కుట్రతో చేస్తున్న మీ విచ్ఛిన్నవాదానికి ప్రజామోదం ఉందా?
- కేంద్రీకృత దోపిడీ విధానాలను అవలంభిస్తున్న మీరు.. వికేంద్రీకరణ పేరుతో చేస్తున్నది కొంగజపం కాదా?
(చైతన్యరథం ప్రత్యేక ప్రతినిధి – అమరావతి)
తమ అడ్డగోలు దోపిడీ విధానాలు బయటకు వచ్చినపుడు, చేతగాని పాలన విధానాల్లో డొల్లతనం బట్టబయలైనపుడల్లా గత మూడున్నరేళ్లుగా ముఖ్య మంత్రి జగన్‌రెడ్డి ఆడుతున్న వింత నాటకం డైవర్షన్ పాలిటిక్స్. గత కొంతకాలంగా జగన్ అండ్ కో మూడురాజధానుల పేరుతో ఆడుతున్న డ్రామా వెనుక ఉన్న అసలు రహస్యం కూడా ఇదే. 40నెలల దోపిడీ, విధ్వంసక పాలన కారణంగా ప్రజల్లో నెలకొన్న తీవ్ర వ్యతిరేకత ఓవైపు..ఆర్థిక క్రమశిక్షణా లేమి కారణం గా పీకల్లోతు అప్పులు మరో వైపు.. మూడున్నరేళ్లలో దోచుకున్న రెండులక్షలకోట్ల దోపిడీ బండారం బట్ట బయటలవుతుందన్న భయం ఇంకోవైపు.. వెరసి సిఎం జగన్‌కు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఈ గడ్డుపరిస్థితుల నుంచి గట్టేందుకు తమ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ డైరక్షన్ లో జగన్ ఆడుతున్న డేంజరస్ గేమ్ మూడు ముక్కలాట. ఒక్క విశాఖ నగరంలోనే ఎ1, ఎ2లు కలిసి 40నెలల్లో 40వేల కోట్లు దోచుకున్న వ్యవహారాలను పత్రికలు రోజుకొక్క టిగా బయటపెడుతుండటంతో ఊపిరిసలపని ముఖ్య మంత్రి జగన్… మరోమారు ప్రజల దృష్టిమళ్లించే రాజకీయానికి తెరలేపారు. దేశంలో ప్రస్తుతం మూడంచెల పరిపాలనా విధానం నడుస్తోంది. ప్రజలకోసం కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు ఏమేం చేయాలో రాజ్యాంగంలో స్పష్టంగా నిర్వచించారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు ఉద్దేశించిన 73, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా పంచాయతీ లు, మున్సిపాలిటీలకు కేంద్రం ప్రత్యేకంగా నిధులను కూడా విడుదలచేస్తోంది. అటువంటి నిధులను కూడా జగన్‌రెడ్డి నేతృత్వంలోని వైసిపి ప్రభుత్వం దారిమళ్లించి స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తూ ఇప్పుడు రాజ కీయ అవసరాల కోసం మూడురాజధానుల పేరుతో కొంగజపం చేస్తోంది.
మూడేళ్ల పాలనలో స్థానిక సంస్థలు నిర్వీర్యం
జగన్‌రెడ్డి పంచాయితీలకు, పురపాలికులకు కేం ద్రం పంపిన రూ.12వేల కోట్ల నిధులు దారి మళ్ళించారు. సర్పంచ్‌లు భిక్షాటన చేసే స్థితి తెచ్చారు. ఈ రకంగా వికేంద్రీకరణపై గొడ్డలివేటు వేసింది. అలాగే స్థానికసంస్థలకు విధులు బదిలీచేయాలని రాజ్యాంగం సవరణలు స్పష్టంచేశాయి.విధులు బదిలీచేయక పోగా ఎన్నికైన సర్పంచులు, ఛైర్మన్‌లు,మేయర్‌లకు పోటీగా రాజ్యాంగేతర వ్యవస్థల్ని పెట్టి స్థానిక సంస్థల్లో ఉన్న కొద్దిపాటి విధుల్ని కూడా కబ్జా చేశారు. పట్టణా ల్లో, గ్రామాల్లో అభివృద్దికి గండికొట్టారు. వికేంద్రీకర ణకు పట్టుకొమ్మల్కెన స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేశారు.
మూడేళ్లలో ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందిందా?
కేసుల మాఫీ కోసం ప్రత్యేక హోదాను, విభజన చట్టం హక్కుల్ని, 31 మంది వైకాపా ఎంపీలను దారా దత్తం చేసి అన్ని జిల్లాల అభివృద్ధికి వెన్నుపోటు వైసిపి పాలకులు పొడిచారు. ఉత్తరాంధ్ర, రాయలసీమల్లోని 7జిల్లాలకు కేంద్రం విడుదల చేసిన నిధులు రూ.700 కోట్లు దారి మళ్ళించి వెనుకబడ్డ జిల్లాలకు ద్రోహం చేశారు. రాయలసీమ లిఫ్ట్ పేరుతో ప్రాంతీయ చిచ్చు నాటకమాడి కృష్ణా`గోదావరి జలాల్లో బచావత్ ట్రిబ్యు నల్ దిగువ రాష్ట్రానికి(ఏపీ) కల్పించిన ప్రత్యేక హక్కు ల్ని కేంద్రానికి దారాదత్తం చేశారు. నీటి వనరులపై వికేంద్రీకరణకు గండికొట్టి కేంద్రీకృతం చేశారు. ఉత్త రాంధ్ర సుజల స్రవంతి, గాలేరు`నగరి, హంద్రీ నీవా లాంటి ప్రాజెక్టులకు, పోలవరానికి తగు మోతాదులో నిధులు కేటాయించకుండా రైతుల అభివృద్ధిని దెబ్బ తీశారు. విద్యుత్‌ఛార్జీలు భారీగా పెంచి, పరిశ్రమలపై దాడులు చేయడం వల్ల అవి పొరుగు రాష్ట్రాలకు తరలిపోవడం వల్ల జిల్లాల అభివృద్ధి కుంటుపడిరది. అనంతపురం జిల్లా నుండి కియా అనుబంధ పరి శ్రమలు కర్నాటకకు, విశాఖలోని టెంపుల్‌టన్ తెలం గాణాకు, లులూ కన్వెన్షన్ సెంటర్ కేరళకు, చిత్తూరు జిల్లాలోని అమర్‌రాజ తమిళనాడుకు వెళ్ళిపోయాయి. అమరావతి ప్రజారాజధానిని విధ్వంసం చేయడం వల్ల తెలంగాణా భూములకు విలువ పెరిగి 26 జిల్లాల భూముల విలువ దెబ్బతిన్నది. వ్యవసాయం తరువాత ఎక్కువ మందికి ఉపాధి, ఉద్యోగాలు కల్పించే రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది. అమరావతి విధ్వంసం వల్ల అక్కడకు వచ్చే సింగపూర్ అంకుర పరిశ్రమతో పాటు 139 సంస్థలు దెబ్బతిని 26 జిల్లాల యువతకు వచ్చే లక్షలాది ఉద్యోగాలు పోయాయి.
మానవ వనరుల నిర్వీర్యం
రూ.37 వేల కోట్లకు పైగా సబ్‌ప్లాన్ నిధులు దారి మళ్ళించి బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనారిటీల అభివృద్ధిని దెబ్బ తీశారు. తాడేపల్లి ప్యాలెస్ ఏడాదికి రూ.5 వేల కోట్లు కమిషన్ కొట్టెయ్యడానికి మద్యం రేట్లు భారీగా పెంచి, జె`గ్యాంగ్ కంపెనీల్లో తయారయ్యే నాసిరకం మద్యం పోసి మందు రాయుళ్ళ ఇల్లు, వల్లు గుల్ల చేస్తున్నారు. ఇసుకలో రూ.10 వేల కోట్లు లూటీ చేయడానికి రేట్లు నాలుగు రెట్లు పెంచి 125 వృత్తులు, వ్యాపారాల్ని బల హీనపరిచారు. ఇలా జగన్‌రెడ్డి పాలనలో స్థానిక సంస్థ లు, ప్రాంతాలు, జిల్లాల అభివృద్ధి మంట కలిసిపో యింది. అలాగే సామాజిక న్యాయం, మానవాభివృద్ధి పతనమైంది.నవరత్నాలు నవమోసాలయ్యాయి. రూ.5 లక్షల కోట్లు అప్పు తెచ్చి రూ.2 లక్షల కోట్లు జగన్‌రెడ్డి ముఠా లూటీ చేసింది.ప్రశ్నించే పౌరులు, ప్రతిపక్షాలు, మీడియాపై అక్రమకేసులు,దాడులుచేస్తున్నారు. అయి నా ప్రజా తిరుగుబాటు రోజురోజుకు పెరుగుతున్నది. ఇంక చెప్పుకోవడానికి ఏమీ లేక, చెయ్యడానికి ఏమీ లేక, తన దోపిడీ పీడన నుండి ప్రజాదృష్టి మళ్ళించడా నికి కుల, మత, ప్రాంతీయ ద్వేషం రెచ్చగొట్టే కుట్రకు దిగారు.అందులో భాగమే మూడుముక్కలాట`మూడు రాజధానులు చేసే అధికారం శాసనసభకు లేదని తెలిసీ జగన్నాటకం ఆడుతున్నాడు.
మూడుముక్కలకు చట్టబద్ధత ఉందా?
రాజధానిని ఎక్కడికైనా మార్చే అధికారం శాసన సభకు లేదని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ ఎం.సత్యనారా యణమూర్తి మరియు జస్టిస్ డి.వి.యస్.యస్ సోమ యాజులు గార్ల ఉన్నత ధర్మాసనం 03.03.2022న 307 పేజీల చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. తీర్పులోని పేరా 17, 492, 493లలో రాజధానిని మార్చే అధికా రం శాసనసభకు లేదని స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు తీర్పు ‘‘మంగళసింగ్ వర్సెస్ యూని యన్ ఆఫ్ ఇండియా’’ కేసులోని పేరా 6ను ప్రస్తావి స్తూ రాజధానిలో భాగాల్కెన లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జుడీషియరీ విభాగాల ఏర్పాటు భారత రాజ్యాంగంలో ని ఆర్టికల్ 4ప్రకారం పార్లమెంటు పరిధిలోకే వస్తుం దని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
‘‘ఒక రాష్ట్ర పరిధిలో రాజధానులు ఏర్పాటుపై ఆ రాష్ట్ర శాసనసభకు విస్పష్టమైన అధికారం వుండేలా రాజ్యాంగ సవరణకోరుతూ రాజ్యసభలో ఎంపీ విజయ సాయిరెడ్డి ఒకప్రయివేటు మెంబర్ బిల్లును ప్రవేశపెట్టా రు. రాష్ట్ర ప్రభుత్వానికి చట్టబద్ధంగా తిరుగులేని అధికా రం కల్పించే ఉద్దేశంతో ఆర్టికల్ 3ఎ ని మార్పు చేస్తూ రాజ్యాంగ సవరణచేయాలని 05.08.2020న రాజ్యాం గ సవరణ బిల్లును విజయసాయిరెడ్డి ప్రవేశపెట్టడం అంటే అర్థంఏమిటి?మూడుముక్కల రాజధాని ఏర్పాటు అధికారం శాసనసభకు లేదని జగన్‌రెడ్డికి బాగా తెలు సు. అయినా ఎందుకు వికేంద్రీకరణ పేరుతో మూడు ముక్కలాట ఆడుతున్నారు? ప్రాంతీయ,కుల విద్వేషాలు రెచ్చగొట్టి తన దోపిడీ నుండి, సంక్షేమ పథకాల కోతల నుండి,పనులు`ధరల బాదుడు నుండి, తన ముఠా అచరాచకాల నుండి ప్రజల దృష్టి మళ్లించే కుట్రకు దిగారు. జగన్‌రెడ్డి గాలానికి తగులుకొని మరోమారు మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరని రైతుల మహాపాదయాత్ర రుజువు చేస్తున్నది.
జగన్‌రెడ్డి విచ్ఛిన్నవాదానికి ప్రజామోదం ఉందా?
కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ నివేదికలోని సర్వేలో విజయవాడ`గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటుకు రాష్ట్ర ప్రజలు 52% మంది అనుకూలంగా వున్నారని పేర్కొన్నారు.
శివరామకృష్ణ రిపోర్టు శాసనసభకు చంద్రబాబు ప్రభుత్వం పెట్టింది. దాని ప్రకారం రాష్ట్రానికి కేంద్ర బిందువులో రాజధాని ఏర్పాటుతోపాటు 3 మెగా సిటీ లు, 14స్మార్ట్ సిటీలతో రాష్ట్ర సమగ్రాభివృద్ధి విధానం తో శాసనసభలో 04.09.2014న తీర్మానం పెట్టడ మైంది. జగన్‌రెడ్డితోపాటు అన్ని పార్టీల శాసనసభ్యు లు, శాసనమండలి సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల నుండి, పుట్ట మట్టి తెచ్చి, పవిత్ర నదీజలాలు తెచ్చి, అన్ని మతాల ప్రార్థనా మందిరాలలో పూజలు చేసిన తరువాత ప్రధాని చేతుల మీదుగా అమరావతి ప్రజారాజ్యానికి శంకుస్థాపన చేయడమైంది.
శ్రీ తాజాగా హిందూ పత్రిక సర్వే ప్రకారం 26 జిల్లా లోని 83%ప్రజలు అమరావతి ఆమోదం తెలి పారు. అన్ని ప్రతిపక్షాలు
మద్దతు ప్రకటించాయి.
- ఊరంతా ఒకదారైతే ఉలిపికట్టెదొకదారి అన్నట్టుగా జగన్‌రెడ్డి మానసిక స్థితి తయారైంది.
- జగన్‌రెడ్డి విచ్ఛిన్నవాదానికి ప్రజల మద్దతులేదు. ప్రతి పక్షాల మద్దతులేదు. చట్టబద్ధత, ధర్మబద్ధత లేదు.
- శివరామకృష్ణన్ కమిటీ రిపోర్టును వక్రీకరించి జగన్‌రెడ్డి ముఠా అబద్ధపు ప్రచారం చేస్తున్నది.
- జగన్‌రెడ్డి పాలనంతా కేంద్రీకృతమే!
- మద్యం వ్యాపారాన్ని కేంద్రీకృతంచేసి ఏడాది రూ.5 వేల కోట్లు మొత్తం ఐదేళ్లలో రూ.25 వేల కోట్లు తాడేపల్లి ప్యాలెస్ దోచుకుంటున్నది.
- ఇసుక కేంద్రీకృతం చేసి ఏడాదికి రూ.10 వేల కోట్లు దోపిడీ చేస్తున్నది.
- స్థానిక సంస్థల నిధుల్ని కేంద్రీకృతం చేసింది.
- ప్రభుత్వ కొనుగోళ్లు, కాంట్రాక్టు వర్క్స్ కేంద్రీకృతం.
- గనులన్నీ కేంద్రీకృతం.
- ప్రభుత్వం యాడ్స్‌లో మంత్రుల బొమ్మలు తొలగిం చి జగన్‌రెడ్డి ఒక్కడి ఫోటోతోనే ఊరేగుతున్నాడు.
- ప్రభుత్వ కార్పొరేషన్ల నిధులు దారి మళ్ళించి ప్రభు త్వం వద్ద కేంద్రీకృతం చేశారు.
- బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సబ్‌ప్లాన్ నిధులు కేంద్రీకృతం.
- కేంద్రం పంపిన విపత్తు సహాయ నిధులు రూ.1100 కోట్లు దారి మళ్ళింపు.
- కేంద్రం పంపిన రేషన్ బియ్యం 5.65లక్షల టన్ను లు తెల్ల రేషన్ కార్డుదారులకు ఎగనామం.
- పన్నుల పెంపు, ధరల పెంపు, అప్పుల పెంపు ద్వారా ఒక్కో కుటుంబంపై రూ.2.50 లక్షల అదనపు భారం వేశారు.
- ఐఏయస్, ఐపీయస్ అధికారాలన్నీ బెదిరించి తన చేతిలో కేంద్రీకృతం.
- ప్రభుత్వ ఉద్యోగులు, పొదుపు మహిళ పొదుపు నిధులు కేంద్రీకృతం.
- చివరకు తల్లి,చెల్లిని గెంటేశారు.తండ్రి ఆస్తిలో చెల్లి కి సమానవాటా ఇవ్వకుండా కుటుంబ సంపద కేందీకృతం.
- జగన్‌రెడ్డి పచ్చి నియంత ` వికేంద్రీకరణ గురించి మాట్లాడడమంటే దెయ్యాలు వేదాలు వల్లించడమే.
చంద్రన్న పాలనలోనే నిజమైన వికేంద్రీకరణ
అనంతపురం ఎడారి అవుతుందన్నారు. ఆ జిల్లా కు చంద్రన్న హంద్రీ`నీవా ద్వారా నీరు పారించారు. దీనితో పెనుగొండలో దక్షిణకొరియాకు చెందిన కియా కార్ల పరిశ్రమను చంద్రన్న తెచ్చారు. రెండేళ్లలోనే 2 లక్షల కార్లు అమ్మారు.ఈకార్ల అమ్మకం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల ద్వారా రూ.12,000 కోట్లు సమకూరింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.6,400కోట్లు పన్నుల ద్వారా ఆదాయం వచ్చింది. కొన్నివేల మందికి ఉద్యోగాలు,ఉపాధి వచ్చింది.రూ.5 లక్షలు, రూ.10లక్షలున్న ఎకరా ధర చుట్టుపక్కల 50 కి.మీ. పరిధిలో నేడు రూ.50 లక్షల నుండి రూ.1.5 కోట్ల వరకు పెరిగింది. సంపద సృష్టి అంటే ఇది. అభి వృద్ధి అంటే ఇది. ఇదే విధంగా ఐదేళ్ళ చంద్రన్న పాల నలో రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించి అన్ని జిల్లాలలో 39వేల పరిశ్రమలు స్థాపించబడ్డాయి. అం దులో 5.13లక్షల ఉద్యోగాలు,ఉపాధివచ్చింది.కేంద్ర విద్యాసంస్థలు సాధించి అన్నిజిల్లాల్లో స్థాపించడమైం ది. నదుల అనుసంధానానికి రూ.64వేల కోట్లు ఖర్చు చేయడమైంది.12లక్షల గృహాలు నిర్మించారు. 10వేల మెగావాట్ల నూతన విద్యుత్ ప్లాంట్లు స్థాపించారు. 26 వేల కిలోమీటర్లు రోడ్లు నిర్మించారు. ప్రతి పంచాయి తీ,ప్రతి పట్టణంలో స్థానిక సంస్థలకు పుష్కలంగా నిధు లిచ్చారు.బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సబ్‌ప్లాన్ నిధులు దారి మళ్ళించకుండా స్వయం ఉపాధి కల్పించారు. రైతుల పంటలు కొని వారంలో డబ్బులు రైతులు జమ చేశారు. ఉద్యోగులకు 43%ఫిట్‌మెంట్ ఇచ్చారు. రెం డు డీయస్సీలు, ఏపీపీయస్సీ, పోలీస్ రిక్రూట్‌మెంట్ జరిపారు. ప్రభుత్వ, ప్రయివేట్ రంగాల్లో 10 లక్షల ఉద్యోగాలిచ్చారు.డ్వాక్రా రుణమాఫీ చేసి రుణాలు రెట్టి ంపు పెంచారు. కండిషన్లు లేకుండా విదేశీ విద్యకు నిధులు ఇచ్చారు. చంద్రబాబు పాలనలో ఇలా అన్ని గ్రామాలు, అన్ని పట్టణాలు, అన్ని నియోజకవర్గాలు, అన్ని జిల్లాలలో అభివృద్ధి జరిగింది.అన్ని ప్రాంతాలలో అభివృద్ధి జరగడమే కాక అన్నివర్గాల ప్రజల సాధికా రత పెంచడమైంది. నిజమైన వికేంద్రీకరణ జరిగింది చంద్రన్న పాలనలోనే.
గతంలో సైబరాబాద్ నిర్మించి ఉమ్మడి ఏపీలోని 294నియోజకవర్గాలలోని 13లక్షల మందికి ఉద్యోగా లు,ఉపాధి కల్పించారు. సైబరాబాద్ అభివృద్ధితోపాటు ఆనాడు అన్ని జిల్లాల్లో అభివృద్ధి చేశారు. హైదరాబాద్ అభివృద్ధివల్ల ఇతర జిల్లాలు వెనుకబడ్డాయనేది అబ ద్ధం. రాష్ట్రం విడిపోవడానికి మొదటి కారణం వైయస్ రాజశేఖర్‌రెడ్డి తనఅనుచరుడు చిన్నారెడ్డి ద్వారా ప్రాం తీయ చిచ్చు పెట్టారు. ముక్కల్కెన తెలుగు రాష్ట్రాలకు ఈరోజు ఢల్లీలోి విలువ లేకుండా పోయింది. మిగిలిన ఈ చిన్న రాష్ట్రంలో జగన్‌రెడ్డి రాజకీయ స్వార్థ ప్రయో జనం కోసం మూడుముక్కలాట ఆడుతున్నారు. వికేం ద్రీకరణ పేరుతో విచ్ఛిన్నవాదం చేస్తున్నారు.
ఆస్తుల కబ్జాకే విశాఖపై కపటప్రేమ
- తాజా మూడు వేలకోట్ల విలువైన దస్‌పల్లా భూము ల్ని విజయసాయిరెడ్డి కొట్టేసే ప్రయత్నం ముమ్మ రంగా చేస్తున్నారు.
- ఉత్తరాంధ్రలోని బమిడికలొద్దిలో లాటరైట్ ముసు గులో బాక్సైట్‌ను వై.వి.సుబ్బారెడ్డి రూ.15వేలకోట్ల విలువైన దోపిడీ చేస్తూ కొంత భారతీ సిమెంట్‌కు తరలిస్తున్నారు.
- బీచ్‌శాండ్, మోనోజ్కెట్ ద్వారా రూ.6వేల కోట్ల దోపిడీకి కుట్ర.
- మూడేళ్లలో 72వేల ఎకరాలకు రిజిస్ట్రేషన్లు జరిగా యంటే జగన్‌రెడ్డి భూమాఫియా తీవ్రత ఎంతగా వుందో తెలుస్తున్నది.
- విశాఖలో 6వేల ఎకరాలు అసైన్‌మెంట్ భూములు బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు.
- కాకినాడ సెజ్ కొట్టేశారు.
- విశాఖలో జె`గ్యాంగ్ 40 నెలల్లో రూ.40 వేల కోట్లు భూములు కబ్జా చేశారు.
విజ్జులు, చైతన్యవంతులైన ఉత్తరాంధ్ర ప్రజలు జగ న్ అండ్ కో ఆడుతున్న మూడుముక్కలాట వెనుక అస లు ఉద్దేశాలను గమనించి విచ్చిన్నపాలకుల కుట్రలను తిప్పికొట్టాల్సిందిగా చైతన్యరథం విజ్జప్తిచేస్తోంది.