అమరావతి: లోన్ యాప్ల వేధిం పులు భరించలేక ప్రాణాలు తీసుకుం టున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగి పోతుండటం ఆందో ళన కలిగిస్తోందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునా యుడు అన్నారు. నిన్న రాజమండ్రిలో దంపతుల ఆత్మహత్య ఘటన మరు వకముందే ఈరోజు పల్నాడులో మరో యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ముఖ్యంగా మహిళల గౌరవాన్ని బజారుకీడుస్తూ వేధిస్తున్న ఇలాంటి లోన్ యాప్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అంతేకానీ చావు పరిష్కారం కాదు. ప్రభుత్వం, పోలీసులు కూడా ఇటువంటి యాప్ల గురించి ప్రజల్లో అవగాహన కలిగించే కార్యక్రమాలు చేపట్టాలి. బాధితులకు అండగా నిలిచి మనోధైర్యాన్ని ఇవ్వాలని అధినేత కోరారు.