అమరావతి: బాపట్ల మండలం భర్తిపూడిలో ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసాన్ని టీడీపీ నాయకుడు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీవ్రంగా ఖండిరచారు. అర్ధరాత్రి సమయంలో ఇలాంటి చర్యలకు పాల్పడటం పిరికిపందచర్య. తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన ఎన్టీఆర్ విగ్రహంపై ఈ అమానుష ఘటన తీవ్రంగా బాధించింది. అన్నగారిని అవమానించడమంటే తెలుగువారిని అవమానించడమే. రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా మహనీయులను అవమానించే చర్యలు పరిపాటిగా మారాయి. విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలో భాగంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. మరోసారి విధ్వంసక ఘటనలు పునరావృతం కాకుండా నిందితులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని బాలకృష్ణ డిమాండ్ చేశారు.