చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

మానవ, ఏనుగుల ఘర్షణ నివారణ..అటవీ జంతువుల సంరక్షణకు ‘హనుమాన్‌’

అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ఆదేశాలు

by చైతన్యరధం
Nov 10, 2025 at 7:00am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
మానవ, ఏనుగుల ఘర్షణ నివారణ..అటవీ జంతువుల సంరక్షణకు ‘హనుమాన్‌’
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఈ ప్రాజెక్టును పకడ్బందీగా అమలు చేయాలి
  • ప్రత్యేకమైన కాలపరిమితి, కార్యాచరణ అవసరం
  • రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించేలా చూడాలి
  • ఏనుగుల సంచారంపై ఎప్పటికప్పుడు సమాచారం ప్రజలకు చేరాలి
  • అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ఆదేశాలు

పలమనేరు (చైతన్యరథం): మానవులు, ఏనుగుల మధ్య సంఘర్షణను నివారించడంతో పాటు సరికొత్త సాంకేతికతతో అటవీ జంతువుల సంరక్షణ చేపట్టేందుకు రాష్ట్ర అటవీశాఖ రూపొందించిన ‘హనుమాన్‌’ (నవaశ్రీఱఅస్త్ర Aఅస చీబత్‌ీబతీఱఅస్త్ర ఖఅఱ్‌ం టశీతీ వీశీఅఱ్‌శీతీఱఅస్త్ర, Aఱస డ చీబతీంఱఅస్త్ర శీట ఔఱశ్రీసశ్రీఱటవ) ప్రాజెక్ట్‌ వివరాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్‌ కళ్యాణ్‌ తెలుసుకున్నారు. చిత్తూరు జిల్లా, పలమనేరు నియోజకవర్గం, ముసలమడుగు వద్ద ఉన్న కుంకీ ఏనుగుల శిక్షణ కేంద్రానికి విచ్చేసిన పవన్‌కు 11 అంశాలతో కూడిన హనుమాన్‌ ప్రాజెక్ట్‌ ను అటవీశాఖ అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. హనుమాన్‌ ప్రాజెక్ట్‌ లోని ప్రతి అంశాన్ని ఆసక్తిగా విన్న పవన్‌ కళ్యాణ్‌ ప్రాజెక్టుని ముందుకు తీసుకువెళ్లడానికి అంశాల వారీగా నిర్దిష్ట కాలపరిమితి అవసరం అన్నారు. జంతువుల సంచారానికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పడు ప్రజలకు చేరవేసేందుకు వీలుగా అధునాతన టెక్నాలజీతో కొత్త యాప్‌ను రూపొందించి మార్చి 3వ తేదీ లోపు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.

హనుమాన్‌ ప్రాజెక్టుని ముందుకు తీసుకువెళ్లే అంశంపై అటవీశాఖతో పాటు పంచాయతీరాజ్‌, వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులను సమన్వయం చేసుకోవాలని సూచించారు. దీనిపై చర్చించేందుకు నవంబర్‌ 3వ వారంలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ.. మానవులు, జంతువుల మధ్య సంఘర్షణను తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా రాష్ట్ర అటవీ శాఖ రూపొందించిన హనుమాన్‌ ప్రాజెక్టు బాగుందన్నారు. అయితే ప్రాజెక్టులోని ప్రతి అంశాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు కాల పరిమితి పెట్టుకోవాలి. ఏనుగులతో తీవ్రంగా దెబ్బ తింటున్న పంటల స్థానంలో ప్రత్యామ్నాయాలు ఎలా? దానికి రైతులు ఎలా ఒప్పించాలనే అంశాలపై దృష్టి సారించాలన్నారు. చిత్తూరు జిల్లాలో మామిడి తోటలు ఎక్కువ. అలాంటి వాటికి ఏనుగులు ఎక్కువగా ఆకర్షితమవుతున్నాయి. ఆ పంటల్లో మార్పులు తీసుకువస్తే రైతుల ఆదాయంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది అనే అంశాలపై సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలి. తేనెటీగల పెంపకం, ఎకో టూరిజం అభివృద్ధి వంటి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై దృష్టి సారించాలి. ఈ అంశంపై నవంబర్‌ మూడో వారంలో నిర్వహించే సమీక్షలో కూలంకషంగా చర్చిద్దామన్నారు.
ప్రత్యేక యాప్‌ సిద్ధం చేయండి
మానవ, వన్య ప్రాణి సంఘర్షణను తగ్గించేందుకు ఇప్పటికే అమల్లో ఉన్న గజ ప్రజా యాప్‌ స్థానంలో నూతన సాంకేతికతో ప్రత్యేక యాప్‌ ని సిద్ధం చేయండి. తమ పరిసర ప్రాంతాల్లో సంచరించే జంతువులు సమాచారం ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసేలా ఆ యాప్‌ ఉండాలి. ఏనుగులకి ప్రత్యేక రేడియో కాలర్‌ వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు కేంద్రం నుంచి అనుమతి వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఏనుగుల సంచారం ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉంది? గుంపులుగా తిరిగే ఏనుగులతో పాటు ఒంటరి ఏనుగులు సమాచారం కూడా తెలిసేలా చూడండి. సాంకేతికతను వినియోగించి ఏ ప్రాంతంలో ఏనుగులకి ఈ రేడియో కాలర్‌ ఏర్పాటు చేస్తే అత్యధిక ప్రయోజనం ఉంటుందనుకుంటే వాటికి ఏర్పాటు చేయాలన్నారు.
గ్రామ స్థాయిలో సర్పమిత్ర వాలంటీర్లు
హనుమాన్‌ ప్రాజెక్టులో భాగంగా పట్టణాల్లో మాదిరి గ్రామాల్లోనూ జనావాసాల్లోకి వచ్చిన పాముల నుంచి ప్రజలకు హాని కలగకుండా సర్ప మిత్రలను ఏర్పాటు చేసేందుకు ప్రతి పంచాయతీ పరిధిలో వాలంటీర్లను ఎంపిక చేసి శిక్షణ ఇవ్వనున్నట్టు అటవీ శాఖ అధికారులు ఉప ముఖ్యమంత్రికి వివరించారు. గ్రామ స్థాయిలో ముందుకు వచ్చే సర్పమిత్ర వాలంటీర్లకు అటవీ శాఖ నుంచి ప్రోత్సాహకాలు అందించాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 26-07-2026

చైతన్యరధం ఈ పేపర్ 25-07-2026

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

ప్రజల నుంచి, పార్టీ శ్రేణుల నుంచి అర్జీల స్వీకరణ
పలమనేరు పర్యటనకి విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌కి చిత్తూరు జిల్లా అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు, జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రికి ప్రజల నుంచి, జనసేన శ్రేణుల నుంచి అర్జీలు వచ్చాయి. అర్జీదారులతో మాట్లాడిన పవన్‌ వారి సమస్యలు
ముసలమడుగు కుంకీ ఏనుగుల శిక్షణ కేంద్రం సందర్శన
మదపుటేనుగుల దాడుల నుంచి పంట పొలాలను, మనుషులను రక్షించేందుకు ప్రత్యేకంగా కర్ణాటక రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకువచ్చిన కుంకీ ఏనుగుల శిక్షణ కేంద్రాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ఆదివారం సందర్శించారు. ముసలమడుగు వద్ద ఉన్న శిక్షణ కేంద్రానికి విచ్చేసిన ఆయన ఏనుగుల శిక్షణ, సంరక్షణ, తదితర అంశాలను స్వయంగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. కర్ణాటక నుంచి తెచ్చిన నాలుగు కుంకీ ఏనుగులతోపాటు గతంలో ఇదే శిక్షణ కేంద్రంలో ఉన్న మూడు కుంకీలు ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాయి. శిక్షణలో కుంకీ ఏనుగులు చూపుతున్న మెళకువలు, ఇటీవల జరిగిన ఆపరేషన్ల తీరును అధికారులు వివరించారు. ఈ సందర్భంగా కుంకీ ఏనుగులు ప్రత్యేకంగా చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది.
క్రమబద్ధంగా కుంకీ ఏనుగులు వరుసగా వస్తూ ఫీుంకారం చేస్తూ పవన్‌ కళ్యాణ్‌కి సెల్యూట్‌ చేశాయి. అనంతరం అడవిలో లభ్యమయ్యే వివిధ రకాల కలపను ఏనుగుల సహాయంతో బయటకు తీసుకువచ్చే విధానాన్ని ప్రదర్శింప జేశారు. మానవ, ఏనుగుల మధ్య ఘర్షణ తలెత్తినప్పుడు మదపుటేనుగుల గుంపు, నివాసాలు, పంట పొలాల వైపు వస్తున్నప్పుడు వాటిని ఎలా నియంత్రించాలో ప్రత్యక్షంగా కుంకీ ఏనుగుల చేత చేయించిన ప్రదర్శన ఆకట్టుకుంది. మదపుటేనుగులు అదుపు తప్పినప్పుడు వాటికి ప్రత్యేకంగా మత్తు ఇచ్చి వాటి కోపాన్ని ఎలా అణిచి వేస్తారు అన్నది పవన్‌ కళ్యాణ్‌కి మావటీలు చూపించారు. మత్తు ఇచ్చే ఇంజెక్షన్‌ గన్‌ను ఆయన ఆసక్తిగా తిలకించారు. ఏనుగులకు ఆయన స్వయంగా బెల్లం ఆహారం అందించారు. అనంతరం గజరాజుల ఆశీర్వచనం తీసుకున్నారు.

ముసలమడుగు ఏనుగుల క్యాంపు ప్రారంభోత్సవం
అటవీ శాఖ ఆధ్వర్యంలో ముసలమడుగులో ఏర్పాటు చేసిన నూతన ఏనుగుల క్యాంపును పవన్‌ కళ్యాణ్‌ ప్రారంభించారు. అందుకు సంబంధించిన శిలా ఫలకాన్ని ప్రారంభించారు. ఏనుగుల క్యాంపులో ఏర్పాటు చేయనున్న గజారామం నగర వనానికి పునాదిరాయి వేశారు. సౌర శక్తితో పని చేసే వేలాడే అటవీ ఏనుగుల నిరోధక కంచె నిర్మాణానికి పవన్‌ కళ్యాణ్‌ పునాది రాయి వేశారు.

మియావకీ తరహా ప్లాంటేషన్‌ కి శ్రీకారం
తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు పెంచడం ద్వారా అడవిని పెంపొందించే మియావకీ తరహా ప్లాంటేషన్‌కు ముసలమడుగు కుంకీ ఏనుగుల శిక్షణ కేంద్రం వద్ద పవన్‌ కళ్యాణ్‌ శ్రీకారం చుట్టారు. 250 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ ప్లాంటేషన్‌ ను ఏర్పాటు చేశారు. ఉసిరి మొక్కను నాటి పవన్‌ కళ్యాణ్‌ ఈ దట్టమైన అడవుల పెంపకం కార్యక్రమాన్ని ప్రారంభించారు. మీటరకు ఒక్కటి చొప్పున నాటిన మియావకీ ప్లాంటేషన్‌ను స్వయంగా మొబైల్‌ లో వీడియో తీసుకున్నారు. మధ్యన పొదలు ఎప్పుడు ఏర్పాటు చేస్తారని అటవీ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

మావటీలకి రూ.50 వేలు బహుమానం
కర్ణాటక ప్రభుత్వం నుంచి కుంకీ ఏనుగులను స్వీకరించేటప్పుడు వీటిని జాగ్రత్తగా చూసుకుంటామని పవన్‌ కళ్యాణ్‌ చెప్పారు. ఆ విధంగానే పలమనేరు ఎలిఫెంట్‌ క్యాంపులో మావటీలు.. కుంకీల సంరక్షణ బాధ్యతలు చూసుకుంటున్నారు. వారి పని తీరు మెచ్చుకుంటూ పవన్‌ కళ్యాణ్‌ తన సొంత డబ్బులు రూ.50 వేలు బహుమానంగా అందించారు.
ఈ కార్యక్రమంలో అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్‌ దండే, పీసీసీఎఫ్‌ పి.వి. చలపతిరావు, అటవీ శాఖ సలహాదారు మల్లికార్జునరావు, చిత్తూరు జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌, జిల్లా ఎస్పీ తుషార్‌ డూడీ, అనంతపురం, తిరుపతి ఫారెస్ట్‌ కన్జర్వేటర్లు యశోద బాయి, చిత్తూరు డీఎఫ్‌ఓ స్రుబ్బురాజు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Previous Post

11 న మైనారిటీ సంక్షేమ, జాతీయ విద్యా దినోత్సవం

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 10-11-2025

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 26-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 26-07-2026

కార్యకర్త
@ July 26, 2026
చైతన్యరధం ఈ పేపర్ 25-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 25-07-2026

కార్యకర్త
@ July 25, 2026
అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి
ఆంధ్రప్రదేశ్

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

చైతన్యరధం
@ July 25, 2026
ఆంధ్రప్రదేశ్

మీకోసం.. నేనున్నా!

చైతన్యరధం
@ July 25, 2026
మహిళలను అవమానిస్తే సహించను
ఆంధ్రప్రదేశ్

మహిళలను అవమానిస్తే సహించను

చైతన్యరధం
@ July 25, 2026
ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు
ఆంధ్రప్రదేశ్

ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

చైతన్యరధం
@ July 25, 2026
మీ సంకల్పం నెరవేరుతుంది
ఆంధ్రప్రదేశ్

మీ సంకల్పం నెరవేరుతుంది

చైతన్యరధం
@ July 25, 2026
చదువే పిల్లలకు శాశ్వత ఆస్తి
ఆంధ్రప్రదేశ్

చదువే పిల్లలకు శాశ్వత ఆస్తి

చైతన్యరధం
@ July 25, 2026
Load More

ముఖ్య వార్తలు

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

చైతన్యరధం
@ July 24, 2026
భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

చైతన్యరధం
@ July 24, 2026
50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

చైతన్యరధం
@ July 24, 2026
ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

చైతన్యరధం
@ July 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

చైతన్యరధం
@ July 25, 2026

మీకోసం.. నేనున్నా!

చైతన్యరధం
@ July 25, 2026
మహిళలను అవమానిస్తే సహించను

మహిళలను అవమానిస్తే సహించను

చైతన్యరధం
@ July 25, 2026
ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

చైతన్యరధం
@ July 25, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist