- ఆత్మపరిశీలన మాని శవరాజకీయాలా?
- టీడీపీ దాడులు చేస్తోందంటూ తప్పుడు ప్రచారం
- శవరాజకీయాలకు పేటెంట్ జగన్రెడ్డిదే
- ధ్వజమెత్తిన ఎమ్మెల్సీ పంచుమర్తి
అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగా లేవంటూ వైసీపీ నేతలు రాష్ట్రపతిని కలవటం సిగ్గుచేటని, వైసీపీ అంటేనే ఏడుపుగొట్టు, శవ రాజకీయాల పార్టీ అని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ధ్వజమెత్తారు. గురువారం నాడు మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ…..5 ఏళ్ల పాటు వైసీపీ నేతలు చేసిన అరాచకాలు, దౌర్జన్యాలు, మారణకాండకు తగిన మూల్యం చెల్లించుకున్నారని విమర్శించారు. ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చిత్తు చిత్తుగా ఎందుకు ఓడిరచారో ఆత్మ పరిశీలన చేసుకోకుండా మరుసటి రోజు నుంచే సిగ్గు లేకుండా శవ రాజకీయాలు మొదలు పెట్టారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగా లేవంటూ వైసీపీ నేతలు రాష్ట్రపతిని కలవటం సిగ్గుచేటు. సీఎం పదవి కోసం తండ్రి శవం పక్కన పెట్టుకుని సంతకాలు సేకరించింది జగన్ మోహన్ రెడ్డి.
ఎవరూ చనిపోకపోయినా ఓదార్పు యాత్ర పేరుతో శవరాజకీయాలు చేసింది జగన్ రెడ్డి. 2019 లో బాబాయి శవాన్ని అడ్డుపెట్టుకుని శవ రాజకీయం చేసింది జగన్ రెడ్డి. వైసీపీ పాలనలోనే ప్రత్యర్థులపై దాడులు, హత్యలు జరిగాయి. జగన్ ప్రభుత్వంలో పల్నాడులో తోట చంద్రయ్యను గొంతు కోసి చంపారు. కంచర్ల జల్లయ్య యాదవ్ని హత్య చేశారు. దాచేపల్లిలో కాపు సామాజికవర్గానికి చెందిన పురంశెట్టి అంకులుని కిరాతకంగా హత్య చేశారు. అలాగే రేపల్లెలో బీసీ బాలుడు అమర్నాథ్ గౌడ్ ను పెట్రోసి పోసి తగుల పెట్టి చంపారు. జడ్ ప్లస్ కేటగిరి ఉన్న చంద్రబాబు నాయుడు ఇంటిపై జోగి రమేష్ దాడి చేశాడు. మా పార్టీ కార్యాలయంపై దాడి చేసి సిబ్బందిని విచక్షణా రహితంగా కొట్టి గాయపరిచారు. వైసీపీ ఎమ్మెల్సీ..దళిత డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేసినా చర్యలు లేవు. మాస్క్ అడిగిన పాపానికి దళిత డాక్టర్ సుధాకర్ ను వేధించి చంపారు. ఇసుక మాఫియాని ప్రశ్నించిన చేనేత వర్గానికి చెందిన నందం సుబ్బయ్యను హత్య చేశారు. దాడులు, హత్యలు అంటే ఇవి. ఎన్నికల రోజు కూడా తాడిపత్రి, చంద్రగిరి, మాచర్లలో వైసీపీ మూకలు దాడులు చేశారు. టీడీపీ దాడులు చేస్తోందని తప్పుడు ప్రచారం చేస్తే ఖబడ్డార్, సహించేది లేదు. వైసీపీ నేతలు ఇకనైనా శవ రాజకీయాలు ఇకనైనా మానుకోవాలని అనురాధ హెచ్చరించారు.