- రాష్ట్రాన్ని గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చేశారని ఆగ్రహం
- ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదమని స్పష్టీకరణ
- మంగళగిరిలో జోరుగా యువనేత ఎన్నికల ప్రచారం
మంగళగిరి (చైతన్యరథం): స్వార్థ రాజకీయాల కోసం సమాజాన్ని కుల, మతాల పేరుతో చీల్చి రాష్ట్రా న్ని విధ్వంసం చేయడమే జగన్మోహన్రెడ్డి అజెండా అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండి పడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి శ్రీచక్ర అపార్ట్ మెంట్ వాసులతో యువనేత లోకేష్ సమావేశమ య్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… ప్రజావేదిక కూల్చివేతతో జగన్ విధ్వంస పాలన మొద లైందన్నారు. కులముద్ర వేసి రాజధాని అమరావతిని నాశనం చేశారు. కోవిడ్ సమయంలో కోవ్యాక్సిన్ తయారుచేసి ప్రపంచానికి తెలుగోడి సత్తాచాటిన భారత్ బయోటెక్ పై కూడా కులముద్ర వేశారు. దీంతో ఏపీలో రూ. 1200 కోట్లతో యూనిట్ పెట్టాలనుకున్న ఆ సంస్థ ఒడిశాకు వెళ్లిపోయింది.
జగన్ వినాశాకర చర్యల కారణంగా రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ రాకపోగా, ఇక్కడి పరిశ్రమలు కూడా పొరుగు రాష్ట్రాలకు తరలి పోయాయి. మన బిడ్డలు ఉద్యోగాల కోసం తమిళ నాడు, బెంగళూరు, కర్నాటక వెళ్లాల్సిన దుస్థితి కల్పిం చారు. అభివృద్ధి చేయడం చేతగాని జగన్ ఏపీని గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చి యువత భవిష్యత్తును నాశనం చేశారు. మూడు రాజధానుల పేరుతో మూడుముక్కలాట ఆడిన జగన్ ఎక్కడా ఒక్క ఇటుక కూడా పెట్టలేదు. విశాఖలో రుషికొండను బోడి గుండుచేసి రూ.500కోట్లతో ప్యాలెస్ మాత్రం కట్టు కున్నాడు. అమరావతి రాజధానిని కొనసాగించి ఉంటే 5లక్షలమందికి ఉపాధి అవకాశాలు లభించేవి. జగన్ విధానాల కారణంగా రాష్ట్రం 30ఏళ్లు వెనక్కివెళ్లింది. అభివృద్ధి అంటే కూల్చివేతలు కాదని లోకేష్ దుయ్యబట్టారు.
రాష్ట్ర భవిష్యత్‌ను దెబ్బతీసిన జగన్
2014లో జరిగిన రాష్ట్ర విభజన ఆంధ్రులు కోరు కున్నది కాదు. కట్టుబట్టలతో బయటకు గెంటివేసిన పరిస్థితుల్లో ఆనాడు అందరినీ ఒప్పించి చంద్రబాబు అమరావతి రాజధానికి శ్రీకారం చుట్టారు. దీనికి జగన్ కూడా సంపూర్ణ మద్దతు తెలిపారు. 99శాతం మంది రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారు. రాజధాని డిజైన్, మాస్టర్ ప్లాన్ కోసం చంద్రబాబు రేయింబవళ్లు కష్టపడ్డారు. పనులు వేగంగా ముందుకు సాగుతున్న సమయంలో ఒక్కఛాన్స్ పేరుతో అధికారం చేపట్టిన జగన్ 5 కోట్లమంది ప్రజల భవిష్యత్తును దెబ్బతీశారు. ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం. ఎన్నికల తర్వాత రాజధాని అమరావతిని పూర్తిచేసి తీరుతాం. ఆ రోజుల్లో చంద్రబాబునాయుడు హైదరా బాద్‌లో సైబర్ టవర్స్ కడితే కంప్యూటర్ అన్నం పెడు తుందా అని ఎగతాళి చేశారు, నేడు హైదరాబాద్ ఐటీ పరిశ్రమ వల్ల 10లక్షల మంది యువత ఉపాధి పొందుతున్నారు.
విజనరీ నాయకుడికి, విధ్వంస పాల కుడికి తేడాను యావత్ రాష్ట్రప్రజలు గమనించాల్సి ఉంది. మారుతున్న కాలానికి అనుగుణంగా సిలబస్ లో మార్పులు చేయాల్సి ఉంది. తొలిఏడాదిలోనే కెేజీ టు పీజీ సిలబస్‌ను ప్రక్షాళన చేస్తాం. నైపుణ్యంతో కూడిన విద్యను అందించి యువతకు ఉపాధి అవకా శాలు మెరుగుపరుస్తాం. అభివృద్ధి, సంక్షేమాలను బ్యాలెన్స్ చేస్తూ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో ముందుకు తీసుకెళ్తాం. గతంలో జగన్మోహన్రెడ్డి అబద్ధాలు చెప్పి నమ్మించినంతగా మేం వాస్తవాలను ప్రజలకు చెప్పలేకపోయాం, ఇది కచ్చితంగా మా బలహీనతేనని యువనేత లోకేష్ చెప్పారు.