అమరావతి: తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ (టిడి ఎల్‌పి) సమావేశం టిడిపి కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అధ్యక్షతన బుధవారం జరిగింది. సమావేశంలో పాల్గొన్న టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. సమావేశంలో పలుకీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 18 అంశాలను అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టాలని నిర్ణయించారు. రాజధాని విషయంలో సీఎం జగన్ మాట తప్పారని సమావేశం పేర్కొంది. మూడు రాజ ధానుల అంశం రెఫరెండంగా భావిస్తే జగన్? అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికలకు వెళ్లాలని సమావేశం సవాల్ చేసింది. అసెంబ్లీ సమావేశాల వేదికగా ఇదే అంశంపై ప్రభుత్వానికి సవాల్ విసరాలని సమావేశం నిర్ణయించింది.
జగన్ పాలనలో ప్రజలను పన్నులతో బాదేస్తున్నారని టిడిపిసీనియర్ ఎమ్మల్యేలు పేర్కొన్నారు. అమరావతి రాజధాని, పోలవరం, లిక్కర్ స్కామ్, నిరుద్యో గం, ప్రజా సమస్యలపై చట్టసభల్లో లేవనెత్తాలని టీడీ ఎల్పీ నిర్ణయించింది. ఏపీలో ల్యాండ్, శాండ్, వైన్, మైన్ మాఫియాలు పెరిగిపోయాయి, వైసీపీ నేతల ఇసుక, మద్యం దోపిడీకి అడ్డే లేకుండా పోయిందని సమావేశం అభిప్రాయపడిరది. ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీ సమావేశాల్లో ఎండగట్టాలని టిడిఎల్పీ సమా వేశం నిర్ణయించింది.