- ప్రభుత్వం నుంచి సాధ్యమైనంత సాయం చేస్తాం
- రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు మంత్రి కేశవ్ పరామర్శ
- రూ. 5లక్షల చొప్పున పరిహారం అందజేత
అనంతపురం (చైతన్యరథం): అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం తలగాసిపల్లి సమీపంలో జాతీయ రహదారిపై బస్సు – ఆటో ఢీకొన్న ప్రమాద ఘటనలో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులను ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ పరామర్శించి, ధైర్యం చెప్పారు. పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామంలో ఆదివారం రాత్రి బాధిత కుటుంబాల ఇళ్ల వద్దకే వెళ్లి ఓదార్చి వారికి భరోసా కల్పించారు. ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి..ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు 5 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని చెక్కుల రూపంలో అందజేశారు. బాధిత కుటుంబాలు అధైర్యపడొద్దని, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి అవుట్ సోర్సింగ్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. మీకు జరిగిన నష్టాన్ని తీర్చలేము కానీ, ఏ కష్టమొచ్చినా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ పి.జగదీష్, ఆర్డీఓ కేశవనాయుడు, డిఎస్పీ వెంకటేశ్వర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, తహసీల్దార్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.