- చంద్రబాబు అక్రమ అరెస్ట్‌తో గుండెపగిలిన మృతుల కుటుంబాలకు పరామర్శ
- ఒక్కో కుటుంబానికి రూ. 3 లక్షల ఆర్థిక సాయం అందజేత
- భవిష్యత్తులోనూ పార్టీ అండగా ఉంటుందని హామీ
- దారిపొడవునా నీరాజనాలు పట్టిన శ్రీకాకుళం జిల్లా ప్రజలు
శ్రీకాకుళం: టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర గురువారం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ముగిసింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు ఆక్రమ అరెస్ట్‌తో మనస్తాపానికి గురై మరణించిన వారి కుటుంబసభ్యులను భువనేశ్వరి పరామర్శించి, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల, పాలకొండ, ఆముదాలవలస నియోజకవర్గాల్లో ఆరు బాధిత కుటుంబాలను భువనేశ్వరి కలిశారు. ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ టీడీపీ ని అంటిపెట్టుకుని ఉన్న కార్యకర్తల కుటుంబాలను ఆదుకునే బాధ్యత పార్టీ తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. కుటుంబ పెద్దను, బాధ్యులను కోల్పోతే కలిగే బాధను తట్టుకోవటం కష్టమేనని, ఆ కుటుంబాలకు కలిగిన నష్టాన్ని పూర్తిస్థాయిలో తీర్చలేకపోయినప్పటికీ, ఆయా కుటుంబాలకు అన్ని విధాలా పార్టీ అండగా ఉంటుందని భువనేశ్వరి హామీ ఇచ్చారు.
రాజాంలోని జీఎంఆర్ విడిది కేంద్రం వద్ద బయలుదేరిన భువనేశ్వరి మొదటగా ఎచ్చెర్ల నియోజకవర్గం, జి.సిగడాం మండలం, దేవలపేట గ్రామం వెళ్లారు. గతేడాది అక్టోబర్ 4న గుండెపోటుతో మరణించిన పార్టీ కార్యకర్త కంచరన అసిరినాయుడు(55) కుటుంబాన్ని కలుసుకున్నారు. అసిరినాయుడు భార్య అరుణకుమారి, కుమారులు అఖిల్, అభిషేక్ లతో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రూ.3లక్షల చెక్కును అందించి ఆర్థికసాయం అందించారు. అనంతరం పాలకొండ నియోజకవర్గం భామిని మండలం, బిల్లుమడ గ్రామంలో బర్రి విశ్వనాథం(57) కుటుంబాన్ని పరామర్శించారు. విశ్వనాథం భార్య వనజాక్షి, కుమారుడు శివశశాంక్, కుమార్తె గౌతమితో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఏ అవసరమొచ్చినా పార్టీ అన్ని విధాల సహాయసహకారాలు అందిస్తుందని ధైర్యం చెప్పారు. రూ.3లక్షల చెక్కును అందించి ఆర్థికసాయం అందించారు.
అనంతరం ఆముదాలవలస నియోజకవర్గం, బూర్జ మండలం, తోటవాడ గ్రామంలో గేదెల సాంబమూర్తి (76) కుటుంబాన్ని కలిశారు. సాంబమూర్తి భార్య ఎర కమ్మ, కుమారులు తవిటినాయుడు, జగదీశ్వరరావు, కుమార్తె పద్మావతిని పరామర్శించి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. రూ.3లక్షల చెక్కును అందించి ఆర్థికసాయం అందించారు. అనంతరం ఆముదాల వలస మండలం,దన్నానపేట గ్రామంలో గొర్లె తిరుపతి రావు(72) కుటుంబాన్ని కలిశారు. తిరుపతిరావు భార్య రమణమ్మ, కుమారుడు శ్రీనివాసరావుతో మాట్లాడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. రూ.3లక్షల చెక్కును అందించి ఆర్థికసాయం అందించారు. అనంతరం ఆముదాలవలస మండలం, నిమ్మ తొర్లాడ పంచాయతీ, పాత నిమ్మ తొర్లాడ గ్రామంలో ఆకేటి పారయ్య(73) కుటుంబ సభ్యులను కలిశారు. పారయ్య కుమారుడు రమణ, కోడలు తవిటమ్మ, మనుమళ్లు సంతోష్ కుమార్, దుర్గా ప్రసాద్ లతో మాట్లాడి యోగక్షేమాలడిగి తెలుసుకున్నారు. రూ.3లక్షల చెక్కును అందించి ఆర్థికసాయం అందించారు. అదే గ్రామంలో గొండు ఎర్రయ్య(67) కుటుంబ సభ్యులను కలిశారు. ఎర్రయ్య భార్య గొండు తవిటమ్మ, కుమారులు శ్రీను, జయరామ్, రాజులతో భువనేశ్వరి మాట్లాడారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. రూ.3లక్షల చెక్కును అందించి ఆర్థికసాయం చేశారు. పార్టీ అండగా ఉంటుందని ఎర్రయ్య కుటుంబానికి ధైర్యం చెప్పారు. శ్రీకాకుళం జిల్లాల కార్యకర్తల కుటుంబాల పరామర్శ అనంతరం విశాఖపట్నంలోని నోవాటెల్ హోటల్ లో బస చేశారు. భువనేశ్వరికి శ్రీకాకుళం జిల్లా కార్యకర్తలు, ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలికారు. మహిళలు హారతులు పట్టి స్వాగతించారు. వివిధ సామాజికవర్గ ప్రజలు, అంగన్వాడీలు, వైసీపీ చేతిలో ఇబ్బందులకు గురైన పలువురు భువనేశ్వరిని కలిసి తమ సమస్యలు విన్నవించుకున్నారు. సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని భరోసానిచ్చారు. తన కార్యక్రమానికి సంఫీుభావం తెలిపేందుకు వచ్చిన కార్యకర్తలకు అభివాదం చేస్తూ..వారిని పలకరిస్తూ రెండో రోజు పర్యటనను భువనేశ్వరి విజయవంతంగా పూర్తిచేశారు. భువనేశ్వరి రెండో రోజు పర్యటనలో ఉత్తరాంధ్ర నాయకు లు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
నేటి పర్యటన వివరాలు
మూడోరోజు పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం 10 గంటలకు నోవాటెల్ హోటల్ నుండి బయలుదేరి, విశాఖపట్నం 33, 41, 45 వార్డుల్లో బాధిత కుటుంబాలను పరామర్శిస్తారు. మధ్యాహ్నం 12:10 గంటలకు విశాఖపట్నం 50వ వార్డు బిర్లా కన్వెన్షన్ దగ్గర్లో భోజన విరామం ఉంటుంది. అనంతరం 2.20 నిమిషాలకు బయలుదేరి విశాఖపట్నం 65వ వార్డులో బాధిత కుటుంబాలను పరామర్శిస్తారు. కార్యక్రమం అనంతరం విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుని హైదరాబాద్ వెళతారు.