- యువతకు ఉద్యోగాల కల్పనకు చర్యలు చేపట్టాలి
- పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్‌ను వినియోగించుకోవాలి
- సీడాప్ ద్వారా ఏడాదికి లక్షమందికి ఉపాధి లక్ష్యం
- నైపుణ్యాభివృద్ధిపై సమీక్షలో మంత్రి లోకేష్ ఆదేశం
అమరావతి(చైతన్యరథం): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున చేపడుతున్న నైపుణ్య శిక్షణ కార్యక్రమాల సమర్థ అమలు ద్వారా యువతకు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి కల్పనకు చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో నైపుణ్యాభివృద్ధి విభాగం ఉన్నతాధికారులతో గురువారం ఆయన సమీక్షించారు. యువతకు ఏపీఎసఎస్ డీసీ ద్వారా చేపడుతున్న వివిధ నైపుణ్య శిక్షణ కార్యక్రమాల అమలు తీరు, ప్రగతిని అధికారులు వివరించారు. పీఎం కౌశల్ వికాస్ యోజన పథకం వినియోగంలో ఉత్తరప్రదేశ్ తర్వాత ఏపీ రెండో స్థానంలో నిలిచిందని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 192 పీఎంకేవీవై సెంటర్స్ అప్‌గ్రేడ్‌కు సమావేశంలో నిర్ణయిం చారు. నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగాల కల్పన విషయంలో స్వల్ప కాలిక, దీర్ఘకాలిక లక్ష్యాల సాధనకు ప్రణాళికలు రూపొందించా లని మంత్రి నిర్దేశించారు. పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ సమర్థ వినియోగంపైనా సమీక్షించారు. నిరుద్యోగులకు పెద్దఎత్తున ప్రయోజనం కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ప్లేస్‌మెంట్ రేట్‌లో ఏపీ మొదటిస్థానం
నైపుణ్యాభివృద్ధి విభాగం కింద ఇప్పటివరకు 5.43 లక్షల మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించినట్లు అధికారులు వివరించారు. ప్లేస్‌మెంట్ రేట్‌లో నేషనల్ యావరేజ్ 64 శాతం ఉండగా.. స్టేట్ యావరేజ్ 76 శాతంతో ప్రధాన రాష్ట్రాల్లో ప్లేస్‌మెంట్ ఫెర్ఫార్మెన్స్‌లో ఏపీ మొదటిస్థానంలో నిలిచిం దని తెలిపారు. యువతకు పెద్దఎత్తున నైపుణ్య శిక్షణ అందించిన ప్రధాన రాష్ట్రాల్లో ఏపీ రెండోస్థానంలో నిలిచిందని చెప్పారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన జాబ్‌మేళాల ద్వారా 1.02 లక్షల మంది యువతకు ఉద్యోగాలు లభించాయని తెలిపా రు. సీడాప్ ద్వారా 2024 ఏడాదిలో 41,288 మందికి శిక్షణ అందించినట్లు అధికారులు వివరించారు. సీడాప్ ద్వారా ఏడాదికి లక్ష మంది యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకోవాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. ఓంక్యాప్, సీడాప్ అనుసంధానం ద్వారా పెద్దఎత్తున యువతకు విదేశాల్లో ఉద్యోగాల కల్పనకు చర్యలు తీసుకోవాలని సూచించారు. పీఎం సేతు కార్యక్ర మంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఐటీఐలను 18 క్లస్టర్లుగా విభజించి.. విశాఖ క్లస్టర్‌కు ఏఎంఎనఎస్(ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్) పారిశ్రామిక భాగస్వామిగా వ్యవహరిస్తుంది. మిగతా క్లస్టర్లకు కూడా పారిశ్రామిక భాగస్వాములను త్వరితగతిన ఎంపిక చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏపీ విద్య, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ విభాగం ముఖ్య కార్యదర్శి జే.శ్యామలరావు, ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఎండీ, సీఈవో జీ.గణేష్‌కుమార్, ఏపీ ఉన్నత విద్యామండలి ఇన్‌చార్జ్ చైర్మన్ ఎస్.విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.













