- నాలుగు చోట్ల అధికార మార్పిడి
- అహంకారం, అసహనం, అవినీతిని తిరస్కరించిన ప్రజలు
- ముఖ్యమంత్రి రుజువర్తనకు మధ్యప్రదేశ్‌లో ఆదరణ
- సరిదిద్దుకోవటానికి సమయంలేని జగన్‌రెడ్డి
- ఒకే పాఠం.. ఓటమి తప్పదు!
అమరావతి : ఇటీవల జరిగిన 5 రాష్ట్ట్రాల శాసనసభల ఎన్నికల్లో 4 చోట్ల ప్రజలు అధికారంలో ఉన్న పార్టీలను తిరస్కరించారు. ఒక్క మధ్యప్రదేశ్ లోనే శివరాజ్ సింగ్ ప్రభుత్వం అధికారాన్ని నిలబెట్టుకోగలిగింది. ఈ తీర్పుతో ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి తెలుసుకోవాల్సిందేమిటి? ఆయా రాష్ట్రాల ప్రజలు ఏమాశించి తీర్పునిచ్చారు?
పక్క రాష్ట్రం తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరాంలలో అధికారంలో ఉన్న పార్టీలు ఓటమి పాలయ్యాయి. రాజకీయ పరిశీలకుల అభిప్రాయాల ప్రకారం.. ఈ నాలుగు రాష్ట్రాల్లోనూ ఏ విధంగా చూసినా మన రాష్ట్రంలోని జగన్‌రెడ్డి పాలన కంటే ఆయా ప్రభుత్వాలు బాగానే పనిచేశాయి. సంక్షేమం,అభివృద్ధి పనుల్లో ఆయాప్రభుత్వాల తీరు జగన్‌రెడ్డి ప్రభుత్వం కంటే ఏమాత్రం తీసికట్టుగా లేక పోయినా ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది.
ప్రజలు ఏమాశిస్తారు?
ప్రతి ఎన్నికలోనూ గతంలో తాము ఆశించిన మేర కు ప్రభుత్వాలు పనిచేశాయా,లేదా? తమ జీవన ప్రమా ణాల్లో ఎట్టి మార్పు వచ్చింది? తమ ఆకాంక్షలను ప్రస్తు త ప్రభుత్వాలు నెరవేర్చాయా అన్న అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత ఎన్నికల్లో తమ ఓట్ల ద్వారా తీర్పు నిస్తారు. కొద్ది దశాబ్దాలుగా ప్రతి ఎన్నికల తరువాత ప్రభుత్వాలు మారటం ఆనవాయిగా వస్తున్నా.. కొన్ని చోట్ల వరుసగా అధికారంలో ఉన్న పార్టీలు తిరిగి గెల వటం కూడా జరుగుతోంది.ఒడిస్సా, మధ్యప్రదేశ్, పశ్చి మ బెంగాల్ దీనికి కొన్ని ఉదాహరణలు.
ప్రజలు కేవలం తమకు లభించిన వ్యక్తిగత ప్రయో జనాలు, అమలు చేయబడ్డ పథకాలను దృష్టిలో పెట్టు కుని మాత్రమే ఓట్లేస్తారా? ఈ రెండు అంశాలు ప్రధాన మైనప్పటికీ కేవలం అవి మాత్రమే నిర్ణయాత్మక అంశా లు కాదనేది రాజకీయ శాస్త్రవేత్తలు, పరిశీలకుల అభి ప్రాయం. రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కుల పరిరక్షణ, ముఖ్యమంత్రులు, శాసనసభ్యుల ప్రవర్తనలు కూడా ఓటర్ల నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయని వారి అభిప్రాయం. ఎన్నికల్లో అవినీతి అంశం అంత ప్రాధా న్యత సంతరించుకోకపోయినా..ఓట్లు వేసే సమయం లో ఒక నిర్ణయం తీసుకునటప్పుడు ఇతర కారణాలతో పాటు అంతర్లీనంగా అధికార పార్టీ అవినీతి ప్రముఖ పాత్ర పోషిస్తుందని
పరిశీలకుల అభిప్రాయం.
దీంతోపాటు.. ముఖ్యమంత్రి ప్రజలకు ఏ విధంగా అర్థమయ్యారు అన్న విషయం కూడా ప్రధానమే. ముఖ్యమంత్రి,శాసనసభ్యులు మాట్లాడే తీరు,వాడే భాష, పాలనా ధోరణి ఓటర్ల మనసులను ప్రభావితం చేస్తా యి. అహంకార ధోరణి, ఏక వ్యక్తి పాలన, అసహనం, రాష్ట్ర ప్రజలకు తానే దిక్కు అన్న ధోరణి, ప్రతిపక్షాల పట్ల వ్యవహరించే తీరు, రాజ్యాంగం మరియు చట్టాల పట్లచూపే గౌరవం ఓటర్ల నిర్ణయాన్ని ప్రభావితం చేస్తా యని రాజకీయ నిపుణుల అభిప్రాయం.
తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం సం క్షేమ,అభివృద్ధి కార్యక్రమాలను వీలైనంత మేరకు బాగా నే చేసినా ప్రజల తిరస్కారానికి గురికాక తప్పలేదు. ఆయన వ్యక్తిగత వ్యవహార తీరు, కుటుంబ సభ్యులు, బంధువుల చేతుల్లో కేంద్రీకృతమైన అధికారం, అధి కార పరిధిని విస్తృతం చేసుకోవాలనే కాంక్ష, రాజకీయ పిల్లిగంతులు,ప్రతిపక్షాలతో వ్యవహరించిన తీరు, కొన్ని సంక్షేమ పథకాల రూపకల్పన, అమలులో లోపాలు, ఫామ్ హౌస్ నుంచి ఎక్కువగా సాగిన పాలన భారాస ఓటమికి ప్రధాన కారణాలని ఎన్నికల ఫలితాల అనం తర విశ్లేషణలో వెల్లడైనాయి. ఆయన వ్యవహరించిన విధానం చాలావరకు అహంకార పూరితంగా ఉందని ప్రజలు భావించటం జరిగింది.ప్రభుత్వం ఏర్పాటు ప్రజ లు ఇచ్చిన అవకాశంగా కాక అది తమ,తమ కుటుంబ హక్కుగా భావించి సొంత ప్రయోజనాల కోసం అధికా రాన్ని దుర్వినియోగం చేసినట్లు ప్రజలు అర్థం చేసు కున్నారు.
ఛత్తీస్ గఢ్‌లో కాంగ్రెస్ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని దాదాపుఅన్ని ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు సూచిం చినా ఓటర్ల తీర్పు అందుకు వ్యతిరేకంగా వచ్చింది. మహదేవ్ యాప్ అంశంలో అవినీతి, అంతర్గత కుమ్ము లాటలు, సహచర మంత్రులను కలుపుకొని పోకుండా వ్యవహరించిన ముఖ్యమంత్రి భఘేల్ తీరు కాంగ్రెస్ పార్టీని దెబ్బతీశాయి.
రాజస్థాన్‌లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సహచరపార్టీ నేత సచిన్ పైలెట్‌తో నిరంతరం కొనసా గించిన అధికార పోరాటం,ఆ మేరకు జరిపిన రాజకీ యాలు, పరీక్షా పేపర్ల లీకులు, అవినీతి ఆరోపణలు కాంగ్రెస్ పరాజయానికి బాటలు వేశాయి. దీర్ఘకాలంగా మిజోరాంలో అధికారంలోఉన్న మిజో నేషనల్ ఫ్రంట్ నేత, ముఖ్యమంత్రి జోరం థాంగ్ తీరు, ఆయన పార్టీ శాసనసభ్యుల వ్యవహారం, పరిపాలనా వైఫల్యాలు ఓటమికి దారితీశాయి.
చౌహాన్ ప్రత్యేకత
శివరాజ్ సింగ్ చౌహాన్ 5 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి ఇటీవల ముగిసిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని మరలా విజయపథంపై నడిపించారు.దీర్ఘకాలం గా ముఖ్యమంత్రిగా ఉన్నందున ప్రజా వ్యతరేకత నెల కొనివుంటుందన్న అనుమానంతో ఇటీవల ఎన్నికలకు ముందు కొత్త అభ్యర్థి ముఖ్యమంత్రి కావచ్చని భాజపా అధిష్టానం సంకేతాలిచ్చింది. కేంద్ర నాయకత్వం అను మానాలను పటాపంచలు చేసి బీజేపీని చౌహాన్ తిరిగి గెలిపించారు. వివాద రాహిత్యంగా రాజకీయాలు, పాల న చేయటం, సౌమ్యుడిగా పేరుగాంచటం, ప్రజలతో నిత్యం మమేకమవటం,పౌరుల హక్కులకు భంగం కలి గిన సంఘటనల్లో ఆయన వ్యవహరించిన తీరు,కుటుం బ సభ్యుల్ని, బంధువులను అధికారానికి దూరంగా ఉంచటం, ప్రతిపక్షాలను దూషణలాడకపోవటం చౌహా న్‌కి దీర్ఘకాలం అండగా నిలిచాయి. ప్రజలకు ఆయన ‘మామ’గా పేరుగాంచారు. ఒక దళితుడిపై అగ్ర కుల వ్యక్తి మూత్రవిసర్జన చేస్తే.. చౌహాన్ ఆ బాధితుడి ఇంటి కి పోయి ఆయన కాళ్లు శుభ్రంచేసి, సహభోజనం చేశా రు. అంతటి విశిష్ట వ్యక్తి కనుకనే 4సార్లు భాజపాను విజయమార్గంలో నడిపించగలిగారు.
జగన్ రెడ్డి తీరు
గత 54 నెలలుగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తీరు.. అహంకారం, అవినీతి, అరాచకాలు, ఆశ్రిత పక్షపాతం, అసహనం, అప్రజాస్వామిక ధోరణి, అసమర్థ పాలనకు ప్రతీకగా నిలిచింది.
అడుగడుగునా విధ్వంసం, విద్వేషాలకు ఆలవాల మైంది. ప్రతిపక్షాలపై దమనకాండ, అక్రమ కేసుల బనా యింపు, చట్టాన్ని చుట్టంగా మార్చుకోవటం నిత్యకృత్య మైంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రిగా కాక నియంతగా ముఖ్యమంత్రి వ్యవహరించారు. ఎంతో ఆశించి గత ఎన్నికల్లో భారీ మెజార్టీ ఇచ్చిన ప్రజలను నయవంచనకు గురిచేశారు. రాష్ట్రానికి మరో నలుగురు అస్మదీయులను సామంతులుగా నియమించి నిత్యం కబ్జాలు, దోపిడీలకు దోహదం చేశారు. మంత్రు లకు, సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కూడా కలిసేం దుకు సమయం ఇవ్వకుండా సర్వం తానై వ్యవహరించారు. అన్ని వ్యవస్థలను తన అరాచకాలు, స్వప్రయోజనాల కోసం దుర్వినియోగం చేశారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టే దుర్నీతితో ప్రజల ప్రాథమిక హక్కులను కబళించి వారి వ్యక్తిగత గౌరవాన్ని అవహేళన చేసి ప్రజాగ్రహాన్ని మూటగట్టుకున్నారు.
ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి తీరు పట్ల ప్రజల్లో పెల్లుబుకుతున్న వ్యతిరేకతకు ఇటీవల కొన్ని స్పష్టమైన సంకేతాలు వెల్లడయ్యాయి. గడప గడపకు కార్యక్రమంలో వెల్లడైన ప్రజాగ్రహం, సామాజిక న్యాయ బస్సు యాత్రకు ఎదురైన నిరాదరణ, నాలుగు ఎమ్మెల్సీ సీట్లకు జరిగిన ఎన్నికల్లో ఓటమి జగన్ రెడ్డి పట్ల వ్యతిరేకతకు సాక్ష్యంగా నిలిచాయి.
ఇటీవల ముగిసిన 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాల నుంచి ముఖ్యమంత్రి నేర్చుకోవాల్సిన గుణపాఠాలు చాలా ఉన్నాయి. అహంకారపూరితుడైన జగన్ రెడ్డి ఒకవేళ మనసు మారి తన లోపాలను సరిదిద్దుకోవాలనుకున్నా ఎన్నికలు సమీపించినందున అందుకు సమయం లేదు. ఆయన తెలుసుకోవాల్సిన ఏకైక నిజం.. వచ్చే ఎన్నికల్లో ఓటమి ఏమాత్రం తప్పదు.