అధికార మదంతో 2019-2024 మధ్య ప్రజలను గాలికొదిలేసి పరదాల మాటున నియంత పాలన సాగించిన జగన్‌రెడ్డి..నేడు అధికారం పోయిన తరువాత పరదాలు లేకుం డానే ప్రజల మధ్యకు వస్తూ కొత్త నాటకానికి తెర తీశాడు. నాటకాలకు తెరతీయడంలో ఆయనకు మించిన ఆస్కార్ నటులు కనిపించరు. బుడమేరు వరద ముంపు నుంచి బెజవాడ క్రమంగా తేరుకుని ముంపు నుంచి బయటపడిరది. దాని నుంచి తేరుకున్నామన్న క్రమం లోనే ఏలేరు రిజర్వాయరుకు వరద పోటెత్తి ఉమ్మడి గోదావరి జిల్లాల్లోని ప్రాంతాలు ముంపు నకు గురయ్యాయి. ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా కూడా ఇచ్చారు. వరద సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్న చంద్రబాబు, అటు ప్రభుత్వంపై బురద జల్లడమే లక్ష్యంగా జగన్ రెడ్డి, వైసీపీ నేతలు, నీలి మీడియా అలవాటుగానే విషప్రచారానికి తెరలేపారు. బాధితులను పరామర్శించేందుకు వచ్చి వెకిలి నవ్వులతో మరోసారి చంద్రబాబు, ప్రభుత్వంపై విష ప్రచారానికి తెరలేపాడు. చుట్టూ పెయిడ్ అర్టిస్టులతో హడావిడి చేయాలని చూశారు. అధి కారం ఉన్నప్పుడు కనీసం ప్రజల వైపు కన్నెత్తి చూడలేదు..అధికారం పోయాక జగనేతగా ప్రచారం చేసుకుంటున్న జగన్‌ను చూసి జనాలు జగనేత కాదు.. జనద్రోహి అంటూ ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు.
బుడమేరు, ఏలేరు వరద ముంపు పాపం జగన్‌రెడ్డిదే
బుడమేరు, ఏలేరు వరదలు జగన్ మేడ్ డిజాస్టర్లే. చంద్రబాబు 2014`19 హయాం లో బుడమేరు, ఏలేరు అధునికీకరణ పనులకు నిధులు కేటాయించారు. కానీ జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక రివర్స్ టెండరింగ్ పేరుతో ఆ పనులను అటకెక్కించాడు. బుడమేరు పనులను నిలిపివేయించింది గాక దానిని కబ్జా చేసి ప్లాట్లు వేసి వ్యాపారం చేయడమే కాకుండా అందులో ఇసుకను దోచేసి తరలించడం కారణంగా వాగు కుచించుకుపోయి గండ్లు పడటానికి కారణమైంది. సీఎం హోదాలో గొల్లప్రోలు నిండు సభ సాక్షిగా ఏలేరు అధునికీకరణ పనులకు నిధులు ఇస్తానని జగన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఒక్క పైసా కూడా ఇవ్వకుండా ప్రజలను, రైతులను మోసం చేసిన ఆయన నేడు వరద ప్రాంతాల్లో షో చేస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండటాన్ని ప్రజలే ఛీకొడుతున్నారు. ఆ పార్టీ నేతలను తరిమి కొడుతున్నారు.
ప్రకాశం బ్యారేజీని కూల్చేందుకు కుట్రలు
164 సీట్లతో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమిపై అనునిత్యం జగన్‌రెడ్డి అండ్ కో విషం వెళ్లగక్కుతూనే ఉన్నాడు. వరదల సమయంలో బోట్ల సాయంతో ప్రకాశం బ్యారేజీ ని కూల్చివేసి లక్షల మంది ప్రాణాలను బలితీసుకునే ప్రయత్నం చేశారు. అయితే బోట్లు వెళ్లి కౌంటర్ వెయిట్లను ఢీకొని అగిపోయాయి. అదే బ్యారేజీ పిల్లర్‌ను ఢీకొని ఉంటే నష్టం ఊహించని విధంగా ఉండేది. బ్యారేజ్ కొట్టుకుపోయి ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లి భారీ విపత్తు సంభవించి ఉండేది. ఇది అంత ఉన్న ఫలంగా సీఎం కూర్చిలో కూర్చోవాలని కలలు కంటూ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు.
ప్రభుత్వం అప్రమత్తతతో ప్రాణనష్టం నివారణ
ఏలేరు రిజర్వాయర్‌లోనూ కనీవిని ఎరుగని స్థాయిలో వరద ప్రవాహం వచ్చింది. ప్రభు త్వం అప్రమత్తం చేసి సహాయక చర్యలు ముమ్మరం చేయడంతో ప్రాణనష్టం జరగలేదు. ఏలేరును మరో అన్నమయ్య డ్యామ్ కాకుండా కాపాడారు. 2003లో 42 వేల క్యూసెక్కుల ప్రవాహనికి ఏలేరు రిజర్వాయర్ కింద పొలాలు మొత్తం మునిగిపోయాయి. 2020లో జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో 17 వేల క్యూసెక్కుల ప్రవాహానికే కాకినాడ వరకు మునిగి పోయింది. ఇప్పుడు 47 వేల క్యూసెక్కుల ప్రవాహం వచ్చినా నష్టపరిధిని తగ్గించడంలో ప్రభుత్వం చాలావరకు సఫలమైందనే చెప్పాలి. గత ఐదేళ్ల విధ్వంసకర పాలన నుంచి రాష్ట్రాన్ని గాడిన పెడుతున్న తరుణంలో రాష్ట్రంలో అనుకున్న దానికంటే అత్యధిక వర్షపా తం నమోదైంది. కేవలం రెండురోజుల్లోనే 50 సె.మీ వర్షపాతం నమోదు అయింది. కృష్ణా నదికి 15 ఏళ్ల క్రితం 2009లో నమోదైన వరద (సుమారుగా 10-11 లక్షల క్యూసె క్యులు) కంటే ఇప్పుడు అత్యధికంగా 11.42 క్యూసెక్యుల వరద రావటంతో విజయవాడ అతలాకుతలం అయింది. అయితే పది రోజులు రేయింబవళ్లు చంద్రబాబు నిరంతరం పర్యవేక్షిస్తూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ పనిచేశారు. రెండు వరదలకు కారణమైన జగన్‌రెడ్డి వరద బాధితులకు సాయమందించకపోగా శవ రాజకీయాలకు తెరలేపడం ఆయన పైశాచికత్వానికి నిదర్శనం.
అన్నమయ్య డ్యామ్ బాధితులకు చేసింది శూన్యం
జగన్‌రెడ్డి హయాంలో ఆయన సొంత జిల్లాలో అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. గ్రామాలకు గ్రామాలే కొట్టుకుపోయా యి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. నాడు బాధితులకు చేసింది ఏంటో అందరికీ తెలిసిందే. వారికి ఎటువంటి సాయం చేయలేదు. సొంత జిల్లాలోనే ప్రజలను పట్టించుకోని జగన్‌రెడ్డి నేడు కొత్త నాటకాలతో ప్రజలను మభ్యపెట్టేందుకు జనం ముందుకు వచ్చి తన దైన శైలిలో హావభావాలు ప్రదర్శిస్తున్నాడు. నాడు మృతుల కుటుంబాలకు రూపాయి విదల్చ కపోగా వరదలతో నిరాశ్రయులైన బాధితులకు ఇళ్లు కట్టిస్తామని చెప్పి చేయలేదు.
ఏలేరు ఆధునికీకరణ చేపట్టలేదని జగనే ఒప్పేసుకున్నారు
మా ప్రభుత్వ హయాంలో ఏలేరు అధునికీకరణ పనులు చేపట్టలేదు.. అంటూ పిఠాపు రం పర్యటనలో స్వయంగా జగనే ఒప్పుకున్నారు. ఆధునికీకరణ చేపడితే క్రాప్ హాలిడే ఇవ్వాలంటూ కారణం చెప్పుకోవటం కొసమెరుపు. జగన్ హయాంలో వర్షాలతో రిజర్వాయ ర్లు నిండుగా ఉండటం వల్ల ఐదేళ్లూ పనులు చేయలేకపోయారట మరి.. అయితే వరదలకు ప్రభుత్వమే కారణమంటూ జగన్‌రెడ్డి పదేపదే కూటమి ప్రభుత్వం, చంద్రబాబుపై పిచ్చి పిచ్చి ఆరోపణలు చేయడం, బురద జల్లడం ఆయన అసమర్థతకు నిదర్శనం.
ఇరిగేషన్, వ్యవసాయ రంగాలపై నిర్లక్ష్యం
జగన్‌రెడ్డి పాలనలో కీలక శాఖలైన ఇరిగేషన్, వ్యవసాయాన్ని మూతేశారు. 2014-19 మధ్య టీడీపీ రాష్ట్ర విభజన కారణంగా ఆర్థిక కష్టాలున్నప్పటికీ ఇరిగేషన్ ప్రాజెక్టులకు రూ.63 కోట్లు కేటాయించారు. 2019-2024 మధ్య అదేస్థాయిలో పనులు జరగాలంటే పెరిగిన ఎస్‌ఎస్‌ఆర్ ధరల ప్రకారం రూ.80 కోట్లు ఖర్చు చేయాలి. కానీ, వైసీపీ ప్రభుత్వం ఖర్చు చేసింది కేవలం రూ.20 కోట్లు మాత్రమే. వైసీపీ హయాంలో ఇరిగేషన్ మంత్రి రికార్డింగ్ డాన్సులు, స్టెప్పులకు పరిమితమయ్యారు.
రాష్ట్రంలో ఏమి జరిగినా చంద్రబాబే టార్గెట్
ఏలేరు రిజర్వాయర్‌పై నిరంతరం పర్యవేక్షణ జరిపి నష్ట నివారణ చేసిన ఇంజనీరింగ్ అధికారులను అభినందించాల్సింది పోయి విమర్శించడం జగన్ సైకోతత్వానికి నిదర్శనం. దుర్మార్గాలు అన్నీ ఆయనే చేయించి చంద్రబాబు, ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూ రంగా ఉంది. విజయవాడలో చూసినా…ఏలేరులో చూసిన బాధితులకు సాయం చేయడం కాకుండా ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారంటే ఎటువంటి విష ప్రచారా లకు తెరలేపుతున్నారో అర్థమవుతోంది.
పరామర్శలోనూ ప్రచార అర్భాటం
ఏలేరు వరద బాధితులను పర్శామర్శించేందుకు వెళ్లిన జగన్ రెడ్డి ప్రచార అర్భాటాలకు తెరలేపారు. వైసీపీ నాయకుల నినాదాలు.. పూల జల్లులు.. టపాసులు కాల్చుకుంటూ వాహనం పైనుంచే వింత నవ్వులతో అభివాదం చేస్తూ రోడ్డు షో సాగించిన తీరు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. అగిన చోటల్లా సెల్ఫీలు, పిల్లలకు ముద్దులు, పెద్దలకు అశీర్వా దాలతో పరామర్శ కార్యక్రమం ఎన్నికల ప్రచారంలా నిర్వహించడాన్ని చూసి జనమే ఛీకొడుతున్నారు. జగన్‌రెడ్డి వింత ప్రవర్తన చూసి అశ్చరపోవాల్సిన పరిస్థితి ఏర్పడిరది. రహదారి పక్కనే ఉన్న రైతుల ఆవేదనను జగన్ వాహనం పైనుంచే వినడంతో వారు కూడా ఆగ్రహించాల్సిన పరిస్థితి. వరద వచ్చిన 10 రోజుల తరువాత వచ్చిన ఆయన నష్టం తీవ్రంగా ఉన్న ప్రాంతాలను వదిలేసి అనుకూల గ్రామాల్లో పర్యటించారని ప్రజలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ప్రజలను పరామర్శించి జరిగిన నష్టం గురించి తెలుసు కోవాల్సింది పోయి తన ప్రభుత్వ హయాంలో జరిగిన సంక్షేమ పథకాలను వివరించడం చూసి తిట్టిపోస్తున్నారు. ఏదేమైనా అటు విజయవాడ వరదలు, ఇటు ఏలేరు వరదలు జగన్‌రెడ్డి మేడ్ మేస్టేక్స్ అన్న నిజం ఒప్పుకోకతప్పదు.
జగన్‌రెడ్డి వింత ప్రవర్తన…మానసిక రోగి
ఈ ప్రచార ఆర్భాటంలో బెంగళూరు నుంచి వచ్చిన జగన్‌రెడ్డికి శవాలు కనిపించలేదనే నిరాశ ఆయన మొహంలో స్పష్టంగా కనిపించింది. జగన్ ప్రవర్తన చూస్తే మానసిక రోగిలా కనిపించారు. లండన్ మందులు అయిపోవటం వల్లే పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆయనకు పిచ్చిపట్టిందని, మానసిక రోగానికి వైద్యం చేయించు కోవాలని సూచిస్తున్నారు.
– సాయికల్యాణ్, అనలిస్ట్