- అర్హులైన వారు డిసెంబర్ 11 లోపు పంపాలి
- రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి సురేష్‌కుమార్
అమరావతి(చైతన్యరథం): కర్నూలులోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు చైర్మన్, ఇద్దరు సభ్యులు(జుడీషియల్, నాన్ జుడీషియల్) నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి (పొలిటికల్) ఎస్.సురేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీ మానవ హక్కుల కమిషన్ చట్టం 1993లోని సెక్షన్ 21లోని సబ్ సెక్షన్ 2 ప్రకారం కమిషన్ చైర్మన్‌గా దరఖాస్తు చేసుకునే వారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా లేదా న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలని తెలిపారు. అలాగే మానవ హక్కుల కమిషన్ సభ్యులు(జుడీషియల్)గా దరఖాస్తు చేసే వారు హైకో ర్టు న్యాయమూర్తిగా లేదా జిల్లా న్యాయమూర్తిగా కనీసం ఏడేళ్ల అనుభవం కలిగి ఉండా ల్సి ఉంటుందని సూచించారు. నాన్ జుడీషియల్ సభ్యులుగా నియామకానికి మానవ హక్కులకు సంబంధించిన విషయాలలో పరిజ్ఞానం లేదా ఆచరణాత్మక అనుభవం కలిగి ఉండాల్సి ఉంటుందని తెలిపారు. మానవ హక్కుల పరిరక్షణ చట్టం, 1993లోని సెక్షన్ 24 ప్రకారం రాష్ట్ర కమిషన్ చైర్మన్, సభ్యుల పదవీకాలం మూడు సంవత్సరాలు లేదా 70 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఏది ముందుగా అయితే అంతవరకూ ఆ పదవి లో కొనసాగేందుకు అర్హులని తెలిపారు. పదవిని నిలిపివేసినప్పుడు, చైర్మన్ లేదా సభ్యు డు రాష్ట్ర ప్రభుత్వం లేదా భారత ప్రభుత్వ తదుపరి ఉద్యోగానికి అనర్హులని పేర్కొన్నారు.
చైర్మన్, సభ్యులకు జీతభత్యాలు
G.O.Ms.No.51, GA (HRC డిపార్టుమెంట్, 30.01.2008 నాటి ఉత్త ర్వుల ప్రకారం చైర్మన్, సభ్యులకు జీతభత్యాలు ఉంటాయన్నారు. ఎప్పటికప్పుడు సవరించబడిన హైకోర్టు న్యాయమూర్తుల (సేవా నిబంధనలు) చట్టం, 1954 ప్రకారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జీతం, అలవెన్సులకు సమానమైన జీతం, అలవెన్సులు చైర్మన్‌కు చెల్లించబడతాయన్నారు. ఇప్పటికే చైర్మన్ పొందుతున్న సర్వీసు పెన్షన్‌తో పాటు ఈ జీతం కూడా పొందేందుకు అర్హులన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి చెల్లిస్తున్న అలవెన్సులన్నింటిని పొందేందుకు చైర్మన్‌కు అర్హత ఉంటుందని వివరించారు. అదే విధంగా సభ్యులకు ఎప్పటికప్పుడు సవరించిన విధంగా హైకోర్టు న్యాయమూర్తుల (సేవా నిబంధనలు) చట్టం, 1954 ప్రకారం హైకోర్టు న్యాయమూర్తికి చెల్లించే జీతం చెల్లించ నున్నట్లు చెప్పారు. హైకోర్టు న్యాయమూర్తికి చెల్లించే అన్ని అలవెన్సులకు సభ్యులు అర్హు లుగా పేర్కొన్నారు.
డిసెంబరు 11లోపు దరఖాస్తులు పంపాలి
15.03.2024 నాటి మునుపటి నోటిఫికేషన్ ప్రకారం పైన పేర్కొన్న పోస్టులకు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు కూడా ప్రస్తుత ఈ నోటిఫికేషన్ కింద మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఆసక్తిగల వ్యక్తులు వారి పుట్టిన తేదీ, అర్హతలు, పరిజ్ఞానం, మానవ హక్కుల విషయాలలో ఆచరణాత్మక అనుభవం మొదలైన వివరాల ను తెల్ల కాగితంపై తెలియజేస్తూ వారి దరఖాస్తులను ప్రభుత్వ కార్యదర్శి (రాజకీ య)(FAC, సాధారణ పరిపాలన SC.II) విభాగం, 1వ బ్లాక్, A.P సెక్రటేరి యట్, వెలగపూడి, అమరావతి -522238 అనే చిరునామాకు డిసెంబర్ 11వ తేదీ లోపు అందేలా పంపించాల్సి ఉంటుందని తెలిపారు.