- కుల, మతాల చిచ్చుతో పబ్బం గడుపుకుంటావా?
- ఇది పులివెందుల కాదు.. తరిమితరిమి కొట్టిస్తా
- రాయలసీమకు ఎవరేం చేశారో తేల్చుకుందాం రా
- నీ పుట్టుకే అబద్దాలపుట్ట.. బతుకంతా నేరమయం
- పోలీసులూ.. మీ వల్లకాకపోతే మేమే చూసుకుంటాం
- వైసిపి పేటిఎం బ్యాచ్ నిరసనలపై నిప్పులు చెరిగిన చంద్రన్న
కర్నూలు : ఎవడ్రా రాయలసీమ ద్రోహి..రాయలసీమను రతనాల సీమను చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ.. రాయలసీమకు ద్రోహం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, రాష్ట్రంలో కుల, మతాల చిచ్చుపెట్టి చలికాచుకొనే నువ్వు రాజకీయం చేయాలనుకుంటున్నావా? ఇదేం పులివెందుల అనుకుంటున్నావా.. తరిమితరిమి కొట్టిస్తా.. వైసిపి గూండాల్లారా బట్టలిప్పి కొట్టిస్తా.. మర్యాదకు మర్యాద, దెబ్బకు దెబ్బ అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నిప్పులు చెరిగారు. కర్నూలులో టిడిపి నూతన కార్యాలయం ప్రారంభం, ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సమయంలో కొందరు వైసిపి పేటిఎం బ్యాచ్ కార్యాలయం వెలుపల నల్లజెండాలు చూపుతూ చంద్రబాబునాయుడుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆగ్రహోద్రు డైన చంద్రన్న ఉగ్రనర సింహుడయ్యారు. ప్రజా స్వామ్యాన్ని కాపాడుకోవడా నికి నా ప్రాణం పోయినా లెక్కపెక్కను, నేను కనుసైగ చేస్తే మీ బట్టలూడదీసి కొడతారంటూ తీవ్రస్వరంతో హెచ్చరించారు. పోలీసు వ్యవస్థ నాశనమైంది, ఇక్కడ ఎస్పీ ఏంచేస్తున్నారు? మీరు ఎవరికి కాపాలా కాస్తున్నారు? కబ్జాదారులకు, అవినీతిపరులకు కాపలా కాస్తున్నారు. మీకు ఐపిఎస్ ఇవ్వడం దండగ, ఎవడు రాయలసీమ ద్రోహో ఇక్కడే తేలుస్తా, రాయలసీమను దోచుకున్న దొంగ జగన్మోహన్ రెడ్డి. ఇక్కడి ఇసుక, మద్యం, భూములు వాళ్లకే కావాలి. పేరు రాయలసీ మది, దోపిడీ జగన్ రెడ్డిది. క్వార్టర్ బాటిల్, బిర్యానీ ప్యాకెట్ లకు అమ్ముడుపోయే పేటిఎం బ్యాచ్ జగన్మోహన్ రెడ్డి అమరా వతి రాజధానిని ఒప్పుకున్నపుడు ఎందు కు మాట్లాడలేదు? ఎవరు రాష్ట్రానికి మేలు చేస్తారు, ఎవరు ద్రోహం చేస్తు న్నారో మేథావులంతా ఆలోచించాలి. ఆదోని, ఎమ్మిగనూరులో నిన్న వేలమంది వచ్చారు, ఈరోజు మీటింగ్ లేకపోయినా పెద్దఎత్తున జనం వచ్చారు… అది తెలుగుదేశం పార్టీ పవరంటే అంటూ చంద్రబాబునాయుడు విరుచుకుపడ్డారు. 10శాతం టిడ్కో ఇళ్లు పూర్తిచేయలేని వాడు మూడురాజధానులు కడతాడా? ఏంమనిషవయ్యా నువ్వు? నీ పుట్టికే అబద్దాల పుట్ట, నీ చరిత్రే అబద్ధాల బతుకు. పోలీసులారా… మీకు యూనిఫాం ఎందుకు, మీ వల్ల కాకపోతే చెప్పండి, మేమే తేల్చుకుంటాం… నాటకాలాడొద్దు. ఎవడు రాయలసీమ ద్రోహో ఇక్కడే తేలుస్తానని కన్నెర్ర చేసే సరికి వైసిపి పేటిఎం బ్యాచ్ తోకముడిచి పారి పోయింది.
అసమర్థ ముఖ్యమంత్రి పాలనకు పాడుబెట్టిన టిడ్కో ఇళ్లే సాక్ష్యం
ఒక అసమర్థ, చేతగాని ముఖ్యమంత్రి అధికారంలోకి వస్తే పరిపాలన ఏ విధంగా ఉంటుందో మొండిగోడలతో మిగిలిన టిడ్కో ఇళ్లను చూస్తే తెలుస్తోంది. జగన్ రెడ్డి విధ్వంసపాలనకు ఇక్కడున్న టిడ్కో హౌసింగే ఒక ఉదాహరణ అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు దుయ్యబట్టారు. కర్నూలులోని టిడ్కోగృహాల సముదాయాన్ని చంద్రబాబు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు ఆయన ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ… టిడిపి ప్రభుత్వ హయాంలో కర్నూలులో పదివేల టిడ్కో ఇళ్ల నిర్మాణం ప్రారంభించాం. 90 శాతం పూర్తయ్యాయి. ఇది 580 కోట్ల రూపాయల ప్రాజెక్టు. అందరికీ ఇళ్లు కట్టించాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లక్షా 50 వేల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. దాన్ని ఆసరాగా తీసుకొని నేనూ లక్షా 50 వేలు వేసి మనకు ల్యాండ్ ఉంటే గవర్నమెంటు అక్విజేషన్ చేసి మంచి వాతావరణంలో ఇళ్లను ప్రారంభించాం. మధ్యతరగతి గేటెడ్ కమ్యునిటీ ఏర్పాటు చేయాలని ప్రారంభోత్సవం చేశాం. పేదవారికి సొంతింటి భావన ఉంటుంది. ఇక్కడ ఇళ్లకు రియల్ ఎస్టేట్ వ్యాల్యు ఉంటుంది. ఇంటీరియర్ కూడా బ్రహ్మాండంగా తయారు చేశాం. కమ్యూనిటీ హాల్, ప్రైమరీ సెంటర్, అంగన్వాడీ, స్కూల్క్ పెట్టాం. టిడిపి హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 3.10లక్షల టిడ్కో ఇళ్లు నిర్మించాం. పది శాతం పూర్తి చేసివుంటే లబ్దిదారులకు ఇవ్వడానికి అనుకూలంగా ఉండేవి. చాలా చోట్ల గృహ ప్రవేశాలు కూడా చేశారు. పేదవారికి ఇచ్చేసివుంటే మూడు, నాలుగు లక్షల ఆస్తి అయ్యేది. ఇప్పుడు మొత్తం పోయే పరిస్థితికి వచ్చింది. ఈ టిడ్కో ఇళ్ల లోపలికి వెళ్లి చూస్తే అంతా తుప్పు పట్టిపోయాయి. గదులన్నీ బూజు పట్టి ఉన్నాయి. ఎంతో డబ్బు పెట్టి కట్టిన ఇళ్లు పనికిరాకుండా చేశారు. దుర్మార్గంగా బాధ్యత లేకుండా ప్రవర్తించారు. ఆ స్కీమ్ కూడా నిలిచిపోయింది. గవర్నమెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా లక్ష్యానికి తూట్లు పొడిచారు. లేబర్ కాస్ట్ పెరిగింది. ఇప్పుడు నిర్మిస్తున్న ఇళ్లకు గతంకంటే తగ్గించి ఇస్తే ఎలా ఇళ్లు కట్టుకోగలరు? పక్కాగృహాల నిర్మాణాలకు రాష్ట్రప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు. ల్యాండ్ ఎక్విజేషన్ చేశానని చెప్పుకుం టున్నారే తప్ప ఉపయోగంలేదు. కొండలు, గుట్టలు, అడవులు, చెరువుల్లో స్థలాలు ఇచ్చారు. వాటి వల్ల ఉపయోగం లేదని చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.