- సునీతకు న్యాయం జరగాలి
- దర్యాప్తును ఎవరూ అడ్డుకోవడానికి వీల్లేదు
- వివేకా హత్య మా కుటుంబంలో జరిగిన ఘోరం
- బాబాయ్ హంతకుల పేర్లు బయటకురావాలి
- నిందితులకు కఠిన శిక్ష పడాలి
- వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
న్యూడిల్లీ: కడప ఎంపీ సీటు కోసమే మా బాబాయ్ హత్య జరిగిందన్నది వాస్తవమే. సీబీఐ కౌంటర్ అఫిడ విట్‌లో పేర్కొన్న విషయాలు అన్నీ నిజాలే’’ అంటూ వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షులు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. డిల్లీలో ఆమె ఎబిఎన్‌తో మాట్లాడు తూ.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై ఆమె స్పందించారు. వివేకానందరెడ్డి హత్య మా కుటుంబం లో జరిగినఘోరం.వివేకా కుమార్తె సునీతకు న్యాయం జరగాలి. మా చిన్నాన్నను అంత ఘోరంగా ఎవరు హత్య చేశారో పేర్లు బయటకి రావాలి.. వాళ్లకి శిక్ష పడాలి. వివేకా హత్య కేసు దర్యాప్తును ఎవరు అడ్డు కోవడానికి వీల్లేదని షర్మిల పేర్కొన్నారు. ఇదిలా ఉండ గా వివేకానందరెడ్డి హత్య కేసుని వేరే రాష్ట్రంలో విచా రించాలన్న పిటిషన్‌పై బుధవారం సుమారు రెండు గంటలపాటు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ నిర్వ హించింది. అక్టోబర్ 31న తీర్పును వెల్లడిరచ నున్న ట్లు కోర్టు తెలిపింది. వివేకా హత్య కేసును వేరే రాష్ట్రం లో విచారించేందుకు ఆదేశాలు ఇవ్వాలని ఆగస్టు 12న వైఎస్ సునీతా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరగా లని ఆమె కోరారు. ఏపీలో కాకుండా తమిళ నాడు, కర్నాటక రాష్ట్రాల్లో విచారణ నిర్వహించాలని ఆమె ఆ పిటిషన్లో కోరారు. తాజాగా విచారణ సంద ర్భంగా హైదరాబాద్ లో అయినా తమకు అభ్యంతరం లేదని సునీత తరపున న్యాయవాది కోర్టుకు వివరిం చారు. కేసును పొరుగు రాష్ట్రానికి బదిలీచేసేందుకు ప్రాథమి కంగా అంగీకరించిన సుప్రీం కోర్టు… పూర్తి స్థాయి తీర్పును ఈ నెల 31వ తేదీ వెల్లడిస్తామని తెలిపింది.