- ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే..
- టీడీపీకి 17ఎంపీ సీట్లు, 45శాతం ఓట్లు
- వైసీపీకి 8 ఎంపీ సీట్లు, 41 శాతం ఓట్లు
- ఇండియా టు డే సర్వేలో వెల్లడి
అమరావతి: రాష్ట్రంలో టీడీపీ గాలి వీస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఇటీవలికాలంలో తనసభలకు హాజరవుతున్న లక్షలాదిమంది జనాన్ని ఉద్దేశించి ఇదే విష యం చెబుతున్నారు. ఐదేళ్లుగా విధ్వంసానికి నిలువెత్తు నిదర్శనంగా సాగుతున్న జగన్‌రెడ్డి ప్రజాకంటక పాలనను ఇక భరించలేని స్థితి కి రాష్ట్ర ప్రజానీకం చేరుకున్నారు.గత ఏడాది జరిగిన పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే ఈవిష యం ప్రస్ఫుటమయింది.ఉత్తరాంధ్ర, తూర్పు రాయల సీమ,పశ్చిమ రాయలసీమ పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలుజరగగా మూడు చోట్లా టీడీపీ బలపరిచిన అభ్యర్థులు ఘన విజయం సాధించారు. జగన్‌రెడ్డి తన కంచు కోటగా చెప్పుకునే రాయలసీమలోని రెండు స్థానాలనూ టీడీపీ గెలుచుకున్నప్పుడే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి తప్పదనే విషయం నిర్ధారణ అయింది. ఎమ్మెల్సీ ఎన్ని కల్లోనే రాష్ట్రవ్యాప్తంగా జగన్‌రెడ్డిపై ఎంతవ్యతి రేకత ఉందో వెల్లడైనప్ప టికీ అధికారపార్టీ నేతలుదానిని అంగీకరించేందుకు ఇష్టపడ లేదు. మాఓటర్లు వేరే ఉన్నారంటూ సర్దిచెప్పు కొచ్చారు. అయితే ప్రజావ్యతిరేకత తీవ్రంగా ఉన్నదనే విషయాన్ని గ్రహించే జగన్‌రెడ్డి ఇటీ వల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులను ఎడాపెడా మార్చేస్తున్నారు. ఓటమి తప్పదనే భయం జగన్‌లో మొదలైనందునే ఈమార్పులని స్పష్ట మవుతోంది. తాజాగా మూడ్ ఆఫ్‌ది నేషన్ పేరుతో ఇండియా టుడే నిర్వహించిన సర్వే లోనూ రాష్ట్రంలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వైకాపాకు గట్టి షాక్ తగలనున్నట్లు వెల్లడ యింది. ఆంధ్రప్రదేశ్‌లోని 25లోక్‌సభ స్థానా ల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలు గుదేశం పార్టీ 17లోక్‌సభ స్థానాలు గెలుచు కోబోతోంది. వైకాపా 8స్థానాలకు పరిమితం కానుంది.‘మూడ్ ఆఫ్ ది నేషన్’ పేరిట ఇం డియాటుడే సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన సర్వే ఫలితాలను ఆ సంస్థ గురువారం వెల్లడిరచింది. 2023 డిసెంబర్ 15నుంచి ఈఏడాది జనవరి 28వరకు సర్వే నిర్వహించినట్లు తెలిపింది.
2019 ఎన్నికల్లో మొత్తం 175కి గాను 151అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించిన వైకాపా…22 లోక్‌సభ స్థానాలనూ గెలుచు కుంది. తెదేపా 3 స్థానాలకే పరిమి తమైంది. ఈసారి ఎన్నికల్లో ఫలితాలు తారుమారు కానున్నాయని ఇండియా టుడే సర్వే అంచ నా మేసింది. 45శాతం ఓటింగ్‌తో తెలుగు దేశంపార్టీ 17లోక్‌సభ స్థానాలను గెలుచుకో బోతోందని పేర్కొంది.వైకాపా 41శాతం ఓటి ంగ్‌తో 8స్థానాలకు పరిమితం కానుందని తెలిపింది.ఇక తెలంగాణలో అధికారకాంగ్రెస్ ఈసారి 10స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని ఇండియా టుడే సర్వే పేర్కొంది. మొత్తం 17లోక్‌సభ స్థానాలకుగానూ భాజపా 3,భారాసకు 3,మజ్లిస్ 1సీటు గెలు చుకునే అవకాశం ఉందని తెలిపింది. గత ఎన్నికల్లో భారాసకు 9,భాజపాకు4, కాంగ్రెస్ కు 3, మజ్లిస్‌కు ఒక సీటు వచ్చిన సంగతి
తెలిసిందే. ఇటీవలజరిగిన అసెంబ్లీ ఎన్ని కల్లో గెలుపొందిన కాంగ్రెస్‌పార్టీ. లోక్‌సభ లోనూ అదే ఒరవడిని కొనసాగిస్తూ ఏడు స్థానాలు పెంచుకోనుందని సర్వే అంచనా మేసింది. భారాసకు భారీగా సీట్లు తగ్గనున్న ట్లు తెలిపింది. భాజపా ఒక ఎంపీ సీటు కోల్పోనుందని తెలిపింది.