చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఆడపిల్లల్ని చదువుల్లో ప్రోత్సహించాలి

మహిళా పాడిరైతులతో ముఖాముఖిలో నారా భువనేశ్వరి

by చైతన్యరధం
Feb 9, 2024 at 8:22am
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ఆడపిల్లల్ని చదువుల్లో ప్రోత్సహించాలి
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • మహిళలు తలుచుకుంటే దేన్నైనా సాధించగలరు
  • ఎన్టీఆర్‌, చంద్రబాబు మహిళా సాధికారత కోసం కృషి చేశారు
  • పాడిపరిశ్రమను గ్రామాల్లో మహిళలు జీవనోపాధిగా చేసుకోవాలి
  • అమరావతి రైతులపై ప్రభుత్వ వేధింపులు నన్ను ఎంతో బాధ పెట్టాయి
  • అమరావతే రాష్ట్ర రాజధానిగా నిలుస్తుంది.
  • మహిళా పాడిరైతులతో ముఖాముఖిలో నారా భువనేశ్వరి

వెంకటపాలెం: మహిళలు తలచుకుంటే ఏదైనా సాధించగలరని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. మహిళలు తమ శక్తిని ఎప్పుడూ తక్కువ అంచనా వేసుకోవద్దని సూచించారు. రాజధాని గ్రామం వెంకటపాలెంలో మహిళా పాడిరైతులతో భువనేశ్వరి గురువారం ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…మహిళలను వంటింటి నుండి సమాజంలోకి తీసుకొచ్చి ప్రోత్సహించిన నాయకులు దివంగత నందమూరి తారకరామారావు అన్నారు. మహిళలకు ఆస్తిలో సమానహక్కు ఇచ్చిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్‌. ఎన్టీఆర్‌ తర్వాత చంద్రబాబునాయుడు కూడా మహిళలను అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు అనేక చర్యలు చేపట్టారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చారు. డ్వాక్రా సంఘాలు పెట్టి మహిళలను ప్రోత్సహించి ముందుకు నడిపారు. 1994లో హెరిటేజ్‌ సంస్థ ఏర్పాటు చేసి ఆ బాధ్యతలను చంద్రబాబు నాకు అప్పగించారు. కంపెనీ నిర్వహణ బాధ్యతలు ఇస్తే నా వల్ల ఏమవుతుంది.. అని నేను అన్నప్పుడు, నువ్వు చేయగలవు….నువ్వు ముందుకు నడిపించగలవు అని ఆనాడు నాతో చంద్రబాబు అన్న మాటలను నేను ఎప్పుడూ మర్చిపోలేను. కేవలం డిగ్రీ చదివి గృహిణిగా ఉన్న నాపై చంద్రబాబు అంత నమ్మకం చూపారు. మహిళా శక్తిపై చంద్రబాబుకు అపారమైన నమ్మకం. 1994లో హెరిటేజ్‌ సంస్థలో కేవలం 400మంది పాడిరైతులు ఉండేవారు. నేడు 11రాష్ట్రాల్లో హెరిటేజ్‌ కంపెనీ ఉంది. 10చేతులు కలిస్తే ఏదైనా సాధ్యమే అని చెప్పడానికి హెరిటేజ్‌ కంపెనీ నిదర్శనం. 3 లక్షల మంది రైతులు, సిబ్బంది ఓ టీమ్‌ గా పనిచేయడం వల్ల కంపెనీ ముందుకు వెళుతోంది. పాడిపంటలు బాగుంటేనే గ్రామాలు బాగుంటాయి..రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. ఒకప్పుడు మహిళలు పాలు, నెయ్యి అమ్ముకుని కుటుంబాలను నడిపేవారు. నేడు కూడా మహిళలు భర్త సంపాదనపై ఆధారపడకుండా కుటుంబాన్ని పోషిస్తున్నారు. మా ఇంట్లో కూడా మేం వ్యాపారం చేస్తూ మగవాళ్లపై ఆధారపడకుండా ఉన్నాం. నేను, నా కోడలు వ్యాపారం చేస్తున్నాం. గతంలో ఆడపిల్లలను చిన్న చూపు చూసి చదువు చెప్పించేవారు కాదు..కేవలం ఇంటి పనులు నేర్పించి వంటింట్లో కూర్చోబెట్టేవారు. నేడు మహిళలు చదువుల్లో ముందున్నారు. ఆడపిల్లల్ని బాగా చదివించి భవిష్యత్తులో ముందుకు నడిపించాలని అందరినీ కోరుతున్నా. మహిళలు ఏ పనిలో అయినా, ఏ రంగం లో అయినా రాణించగలరు. నాన్న ఆశయాల సాధన కోసం స్థాపించిన ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్టు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్‌, వైజాగ్‌, తిరుపతిలో బ్లడ్‌ బ్యాంకులు నెలకొల్పాం. ఎన్టీఆర్‌ ట్రస్టు స్కూల్‌ 6 వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు విద్య ను అందిస్తోంది. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ నుండి బాలికలకు ప్రత్యేకంగా కాలేజీ నడిపిస్తున్నాం. కృష్ణాజిల్లాలోని చల్లపల్లి గ్రామంలో అనాధ పిల్లలకు ప్రతిఏటా 360 మందికి ఉచితంగా విద్యను అందిస్తున్నాం. మహిళలు తమను తాము తక్కువ అంచనా వేసుకోవద్దు… భవిష్య త్తులో మహిళలంతా ముందుకు వెళ్లాలి. భావితరాన్ని నిర్మించి, ముందుకు నడిపే శక్తిని దేవుడు మహిళలకే ఇచ్చారు… దీన్ని మహిళలు ఎవరూ మర్చిపోవద్దు అని భువనేశ్వరి అన్నారు.
మీరు చూపించే అభిమానాన్ని మరువలేను
మా కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజలు, మహిళలు మాపై చూపించిన అభిమానాన్ని ఎప్పటికీ మరువలేను. మాకు ధైర్యం చెప్పి,మా వెన్నంటి నిలిచిన టీడీపీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులకు నా కృతజ్ఞత లు, ధన్యవాదాలు అని భువనేశ్వరి చెప్పారు. అనంతరం మహిళా పాడిరైతులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు.
శేషకుమారి, వెంకటపాలెం గ్రామం: నేను గేదెల్ని మేపి పాల వ్యాపారం చేస్తూ బ్రతుకుతున్నాను. మీరు మాలాంటి వాళ్లను ఎలా ప్రోత్సహిస్తారు?
భువనమ్మ: నేను, నా కోడలు ఇద్దరం కలిసి మా వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. మా కంపెనీల్లో మహిళలకు అవకాశాలు ఇస్తున్నాం. హెరిటేజ్‌ కంపెనీ నుండి పశువుల కొనుగోలుకు ఆర్థిక సాయం చేస్తున్నాం.

మనీషా, వెంకటపాలెం: గతంలో మీరు ఎన్నడూ రాజకీయాల్లోకి, బయటకు రాలేదు..నేడు ఎందుకు వచ్చారు? మీరు ఎలా భావిస్తున్నారు?
భువనమ్మ: కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనం బయటకు రావాల్సిన పరిస్థితి వస్తుంది. నాకు రాజకీయాలు అంటే ఇష్టం లేదు. కానీ అనివార్య పరిస్థితుల్లో నేను ప్రజాక్షేత్రంలోకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. చంద్రబాబుపై అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టారు. ఆ సమయంలో చంద్రబాబు నన్ను పిలిచి పార్టీ బిడ్డలు చనిపోయారు. వారి ఇంటికి స్వయంగా వెళ్లి వారిని ఓదార్చి ఆర్థికసాయం చేసి రావాలని ఆదేశించారు. అందుకే నేను నిజం గెలవాలి అనే కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి, కార్యకర్తల మధ్యలోకి వచ్చాను.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 28-04-2026

చైతన్యరధం ఈ పేపర్ 27-04-2026

జగన్‌రెడ్డి పాలనలో విద్యుత్ సంక్షోభం

శైలజ, వెంకటపాలెం గ్రామం: అమరావతి ఉద్యమానికి మీరు మీ చేతి గాజులను విరాళంగా ఇచ్చారు. మాకు సంఫీుభావం తెలిపి, ధైర్యం చెప్పారు. రానున్న కాలంలో అమరావతి రాజధానిగా ఉంటుందా?
భువనమ్మ: అమరావతే రాజధానిగా ఉంటుంది… రెండో ఆలోచన అవసరం లేదు.
అమరావతే రాజధాని… చంద్రబాబే అమరావతిని నిర్మిస్తారు
1500 రోజులకుపైగా అమరావతి రైతులు, మహిళలు నిర్విరామంగా చేస్తున్న పోరాటాలు వృథా కావు. అమరావతి రైతుల పోరాటానికి, ఉద్యమ స్ఫూర్తికి నా పాదాభివందనం. అమరావతే ఏపీ రాజ ధానిగా ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో గెలిచేది తెలుగు దేశమే…అమరావతిలో రాజధానిని నిర్మించేది చంద్ర బాబే. చంద్రబాబు ఒక్కడిని నమ్మి అమరావతి రైతు లు 33వేల ఎకరాలను ఇచ్చారు. చంద్రబాబుపై అమరావతి రైతులు పెట్టుకున్న నమ్మకం వమ్ము కాదు. చంద్రబాబు చెప్పారంటే…చేసి తీరుతారంతే… చంద్రబాబు కుటుంబం గురించి ఆలోచించరు. ఆయన ప్రజల మనిషి… నిరంతరం రాష్ట్ర ప్రగతి గురించే ఆలోచిస్తారు. అమరావతి రైతులు చేస్తున్న పోరాటాలను వైసీపీ ప్రభుత్వం అత్యంత కర్కశంగా అణిచివేయాలని చూసింది. పోలీసులను ఉద్యమ కారులపైకి ఉసిగొల్పి.. మహిళలు అని కూడా చూడ కుండా కిరాతకంగా వ్యవహరించారు. మహిళలను హింసించి, అరెస్టు చేసి, కేసులు పెట్టి, రాత్రిపూట కూడా స్టేషన్లలో పెట్టారు. వైసీపీ ప్రభుత్వానికి మహిళలంటే ఎంత గౌరవమో అమరావతి ఉద్యమ కారుల పట్ల వ్యవహరించిన తీరు అద్దం పడుతుంది. రాష్ట్ర ప్రజలకు రెండో ఆలోచన అవసరం లేదు. అమరావతే మన రాజధాని అని భువనేశ్వరి స్పష్టం చేశారు.

Previous Post

సైకిల్‌ జోరుకు ఫ్యాను ముక్కలే!

Next Post

ఆశాలపై కర్కశత్వం

మరిన్ని వార్తలు

జగన్‌రెడ్డి పాలనలో విద్యుత్ సంక్షోభం
ఆంధ్రప్రదేశ్

జగన్‌రెడ్డి పాలనలో విద్యుత్ సంక్షోభం

చైతన్యరధం
@ April 27, 2026
నో స్టాక్.. కనిపించకూడదు!
ఆంధ్రప్రదేశ్

నో స్టాక్.. కనిపించకూడదు!

చైతన్యరధం
@ April 27, 2026
టెక్‌మ్యాప్‌లో విశాఖకు చోటు
ఆంధ్రప్రదేశ్

టెక్‌మ్యాప్‌లో విశాఖకు చోటు

చైతన్యరధం
@ April 27, 2026
గ్లోబల్ ఏఐ హబ్‌గా విశాఖపట్నం
ఆంధ్రప్రదేశ్

గ్లోబల్ ఏఐ హబ్‌గా విశాఖపట్నం

చైతన్యరధం
@ April 27, 2026
వైసీపీ పాలన వ్యవసాయానికి చీకటి యుగం
ఆంధ్రప్రదేశ్

వైసీపీ పాలన వ్యవసాయానికి చీకటి యుగం

చైతన్యరధం
@ April 27, 2026
జగన్ రూల్స్ బుక్ అమలు చేస్తున్న శాసనమండలి చైర్మన్
ఆంధ్రప్రదేశ్

జగన్ రూల్స్ బుక్ అమలు చేస్తున్న శాసనమండలి చైర్మన్

చైతన్యరధం
@ April 26, 2026
‘యూజ్ అండ్ కిల్’ఇదే జగన్ పొలిటికల్ పిక్చర్
ఆంధ్రప్రదేశ్

‘యూజ్ అండ్ కిల్’ఇదే జగన్ పొలిటికల్ పిక్చర్

చైతన్యరధం
@ April 26, 2026
సింగపూర్‌లో ఐదోరోజూ మంత్రుల బృందం పర్యటన
ఆంధ్రప్రదేశ్

సింగపూర్‌లో ఐదోరోజూ మంత్రుల బృందం పర్యటన

చైతన్యరధం
@ April 26, 2026
Load More

ముఖ్య వార్తలు

నో స్టాక్.. కనిపించకూడదు!

నో స్టాక్.. కనిపించకూడదు!

చైతన్యరధం
@ April 27, 2026
సాగుకు భద్రత..అధిక ఆదాయమే లక్ష్యం

సాగుకు భద్రత..అధిక ఆదాయమే లక్ష్యం

చైతన్యరధం
@ April 25, 2026
ఉత్తరాంధ్రకు పెట్టుబడుల పండుగ

ఉత్తరాంధ్రకు పెట్టుబడుల పండుగ

చైతన్యరధం
@ April 24, 2026
ఎన్డీయేతోనే తమిళనాడుకు పూర్వవైభవం

ఎన్డీయేతోనే తమిళనాడుకు పూర్వవైభవం

చైతన్యరధం
@ April 22, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

జగన్‌రెడ్డి పాలనలో విద్యుత్ సంక్షోభం

జగన్‌రెడ్డి పాలనలో విద్యుత్ సంక్షోభం

చైతన్యరధం
@ April 27, 2026
నో స్టాక్.. కనిపించకూడదు!

నో స్టాక్.. కనిపించకూడదు!

చైతన్యరధం
@ April 27, 2026
టెక్‌మ్యాప్‌లో విశాఖకు చోటు

టెక్‌మ్యాప్‌లో విశాఖకు చోటు

చైతన్యరధం
@ April 27, 2026
గ్లోబల్ ఏఐ హబ్‌గా విశాఖపట్నం

గ్లోబల్ ఏఐ హబ్‌గా విశాఖపట్నం

చైతన్యరధం
@ April 27, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist