- ప్రజలు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు అండగా నిలుద్దాం
- ముందస్తు ఎన్నికలకు కేడర్ సిద్ధంగా ఉండండి
- గెలుస్తారన్న నమ్మకం కలిగించిన వారికే టిక్కెట్లు
- తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు
అమరావతి: విశాఖను మింగేసి.. ఉత్తరాంధ్రను కబళిస్తున్న వైసీపీ మూకపై పోరాడాలని తెలుగుదేశంపార్టీ శ్రేణులకు అధినేత చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. విశాఖను కొల్ల గొట్టి.. కంపెనీలను వెళ్లగొట్టిన వారు అక్కడి ప్రజల గురించి ఇప్పుడు మాట్లాడటం హాస్యా స్పదంగా ఉంద న్నారు. సేవ్ ఉత్తరాంధ్ర పేరుతో ప్రజల, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు మనం నిలబడాల్సి ఉందని అన్నా రు. మూడు రాజధానులంటూ జగన్ మోసపూరిత ప్రకటనలతో ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలుగు దేశం పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్‌లు, ముఖ్యనేతలతో జూమ్ కాన్ఫ రెన్స్ ద్వారా చంద్రబాబు మాట్లాడారు. ఉత్తరాంధ్ర పరి ణామాలు, పార్టీ సభ్యత్వ నమోదు, బాదుడే బాదుడు కార్యక్రమాలు, ఓటర్ వెరిఫికేషన్ వంటి అంశాలపై నివేదికల ఆధారంగా రివ్యూ చేశారు. ఈ అంశాల్లో వెనుకబడి ఉన్న నేతలను స్పీడు పెంచాలని గట్టిగా సూచించారు. సేవ్ ఉత్తరాంధ్ర పేరుతో ప్రజల, ప్రభు త్వ ఆస్తుల పరిరక్షణకు మనం నిలబడాలని చంద్ర బాబు అన్నారు. విశాఖలో వేల ఎకరాలను, వేల కోట్ల ఆస్తులను వైసిపి గద్దలు చెరబడుతున్న వైనాన్ని విస్తృ తంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. మూడు రాజధానులు సాధ్యం కాదని కోర్టులు స్పష్టంగా చెపుతున్నా.. ఉత్తరాంధ్ర, రాయలసీమలలో రాజధా నులు అంటూ జగన్ జనాన్ని మోసం చేస్తున్నారని అన్నారు. సాగునీటి రంగంలో ఎవరిహయాంలో ఎక్కు వ మేలు జరిగిందో ఈఎన్సి నారాయణరెడ్డి మీడియా సమావేశం ద్వారానే స్పష్టంగా తెలిసిపోయిందని.. దీనికి వైసిపి మంత్రులు ఏం సమాధానం చెపుతారని చంద్రబాబు ప్రశ్నించారు.
గెలుస్తామన్న నమ్మకం కలిగిస్తేనే..!
మేముగెలుస్తామనే నమ్మకాన్ని నేతలుతనకు కల్పిం చాలని చంద్రబాబు అన్నారు. తమ పనితీరు ద్వారా తాము గెలిచే అభ్యర్థులు అనివారు ప్రూవ్ చేసుకోవా లని..లేకపోతే భిన్నమైననిర్ణయాలు ఉంటాయని చెప్పా రు. నేతలు,కార్యకర్తలంతా ముందస్తు ఎన్నికలకు నేతలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గాల్లో గెలుస్తామనే నమ్మకం కల్పించిన వారికే టిక్కెట్లు కేటాయిస్తామని స్పష్టంచేశారు. ఇందుకు నేతలు క్షేత్రస్థాయి లో చేసే పోరాటం, కార్యక్రమాలే ప్రాతిపదికగా ఉం టాయని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి సామాన్యుల వరకు జగన్ పాలనతో విసిగిపోయారని చంద్ర బాబు అన్నారు. ఏపీలో వైసీపీ పాలనతో నష్టపోని వర్గమంటూ లేదు. ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకతను పార్టీకి అనుకూలంగా మార్చుకోవాలని అన్నారు. ఉపాధి, ఉ ద్యోగ అవకాశాలు లేక యువత తీవ్రంగా నష్టపోయా రని..వారంతా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థు లకు ఓటు వేసేలా చూడాలని నేతలకు సూచించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు ఇంచార్జ్‌లు గట్టిగా పనిచెయ్యాలని చంద్రబాబుసూచించారు. బోల్డ్‌గా ఉండే బాలకృష్ణ శైలితో ఆహా షో అంత హిట్ అయ్యింది. నాటి అధికార మార్పిడి విషయంలో వాస్తవంగా జరిగిందేంట నేది ఆ షోలో చర్చకు వచ్చిందని అన్నారు. దశాబ్దాలుగా తనపై బురద జల్లుతున్న అంశంపై ఓపెన్‌గా మాట్లాడానని చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.