- వారి ఉత్పత్తులకు అంతర్జాతీయ బ్రాండ్
- ‘స్వయం ఏపీ’పై సీఎం చంద్రబాబు ట్వీట్
అమరావతి(చైతన్యరథం డ్వాక్రా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడంతోపాటు వారిని విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్ద డమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధి వెలుపల తొలిసారిగా జాతీయ సరస్ మేళాను నిర్వహిస్తున్న కేంద్ర గ్రామీణాభి వృద్ధిశాఖ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తోందని తెలిపారు. ఈ మేళా ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 650కి పైగా స్వయం సహాయక సంఘాలు ఏపీకి తరలి వచ్చాయని వెల్ల డించారు. వివిధ ప్రాంతాలకు చెందిన మహిళా సంఘాలు తమ ఉత్పత్తులను ప్రదర్శించడంతో పాటు వాటికి విస్తృత మార్కెట్ అవకాశాలు కల్పించుకునేందుకు ఈమేళా వేదిక గా నిలుస్తుందని పేర్కొన్నారు. మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు స్థానిక మార్కె ట్లకే పరిమితం
కాకుండా దేశవ్యాప్తంగా.. అంతర్జాతీయ స్థాయి లోనూ గుర్తింపు లభించేలా చర్యలు తీసుకోవాల్సి న అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘స్వయం ఏపీ’ కార్యక్రమం ద్వారా ఈ-కామర్స్, గ్లోబల్ మార్కెట్ల తో అనుసంధానం చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు విస్తృత ప్రచారం, మార్కెట్ సదుపాయాలు అందుబాటులోకి వసే వారు ఆర్థికంగా మరింత ఎదిగేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి గ్రామం ఒక ఎంటర్ప్రైజ్ కేంద్రంగా, ప్రతి మహిళ సంపద సృష్టికర్తగా మారాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టంచేశారు. ఈ లక్ష్యసాధనతోనే స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేస్తూ వికసిత్ భారత్ నిర్మాణా నికి రాష్ట్రం తన వంతు సహకారం అందిస్తోందని ఎక్స్ వేదికగా వెల్లడించారు.















