చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

రైతు కోసం..ముళ్ల కిరీటం మోస్తా

అట్టహాసంగా సాగిన బాధ్యతల స్వీకార కార్యక్రమం

by చైతన్యరధం
Dec 25, 2024 at 6:15am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
రైతు కోసం..ముళ్ల కిరీటం మోస్తా
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఎప్పటికీ రైతు గెలుపే నా గెలుపు
  • సీఎం సంకల్పం అర్థం చేసుకుని ముందుకెళ్తా
  • అగ్రి మిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ మర్రెడ్డి స్పష్టీకరణ
  • వ్యవసాయంపై సీఎం చంద్రబాబుది ప్రత్యేక శ్రద్ధ
  • అప్సంకు మర్రెడ్డి సేవలు అవసరం: మంత్రి నిమ్మల
  • రైతు కోసం మర్రెడ్డి పోరాటం వృధాకాలేదు: సవిత
  • మర్రెడ్డి సేవలు మరింత విస్తృతం: కొల్లు రవీంద్ర
  • సీఎం చంద్రబాబు విజనరీ నిర్ణయం: మనోహర్‌
  • అగ్రి మిషన్‌ వైస్‌ ఛైర్మన్‌గా మర్రెడ్డి బాధ్యతల స్వీకారం
  • అట్టహాసంగా సాగిన బాధ్యతల స్వీకార కార్యక్రమం

అమరావతి, డిసెంబర్‌ 24: అందరూ కిరీటంలా భావిస్తున్న అగ్రి మిషన్‌ చైర్మన్‌ పదవి ముళ్ల కిరీటంలాంటిదని, ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందో తనకు తెలుసునని మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి సత్సంకల్పాన్ని నెరవేర్చడానికి, రైతు శ్రేయస్సు సాధనకు ఎలాంటి సమస్యలను అధిగమించడానికైనా సిద్ధమేనని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్న వ్యవసాయ పురోగతిలో నావంతు బాధ్యత నిర్వర్తించి ప్రజామోదం పొందేందుకు ప్రయత్నిస్తానని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం మేరకు అగ్రి మిషన్‌ వైస్‌ ఛైర్మన్‌గా నియమితులైన మర్రెడి శ్రీనివాస రెడ్డి మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. తాడేపల్లి సీఎస్సార్‌ కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ, పార్టీ పెద్దలు, అధికార్లు, రాష్ట్రవ్యాప్తంగా తెలుగు రైతు ప్రతినిధులు, శ్రేణులు పెద్దఎత్తున హాజరయ్యారు. కార్యక్రమంలో తొలుత మర్రెడ్డి అప్సం వైస్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తూ.. ‘ముఖ్యమంత్రి అప్పగించిన బాధ్యతల నిర్వహణలో ప్రజల మన్ననలు పొందుతాననే విశ్వాసం ఉంది. రైతుల గెలుపే నా గెలుపు.

ఏ పరిస్థితుల్లోనైనా సరే రైతులను ఆదుకుంటాను. టీడీపీలో కష్టపడినవారికి ఫలితం దక్కుతుందని నా విషయంలో రూఢీ అయింది. పార్టీ కోసం కష్టపడ్డవాళ్లను చంద్రబాబు విస్మరించరన్న విషయం అనేకమంది విషయంలో రుజువైంది. ఏ సంకల్పాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ ఉద్దేశంతో నాకు ఈ బాధ్యతలు అప్పగించారో నాకు తెలుసు. ఆ సంకల్పాన్ని నెరవేర్చి రైతుకు మరింత సేవ చేస్తా. రాబోయే రోజుల్లో రైతులకు మరిన్ని సేవలందించేందుకు పదవిని వినియోగిస్తా. రైతును రాజును చేద్దాం. డ్రైవర్‌ ప్రయాణీకులను క్షేమంగా గమ్యస్థానాన్ని చేరిస్తే ఎంత ఆనందం కలుగుతుందో.. సేవలు చేసి వారిని ఉన్నత స్థానానికి తీసుకెళ్తే నాకు అంత ఆనందం కలుగుతుంది. మంచి పనులు చేస్తే మరిన్ని అవకాశాలొస్తాయి. డ్రైవర్‌ సురక్షితంగా ప్రయాణీకులను గమ్యస్థానానికి చేర్చనప్పడు.. నీ సేవలు చాలు, దిగిపో అంటారు. అలాంటి పరిస్థితులు తెచ్చుకోను, ఎవరూ తెచ్చుకోవద్దు’ అని మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి వ్యాఖ్యానించారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 21-03-2026

నిరుద్యోగులకు ఇదే అసలు ఉగాది

వాత్సల్యమూర్తి భువనమ్మ

కార్యక్రమంలో జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. క్రమశిక్షణతో కష్టించి పనిచేసేవారికి తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని చెప్పడానికి మర్రెడ్డి శ్రీనివాస రెడ్డికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యవసాయ మిషన్‌ (అప్సమ్‌) వైస్‌ ఛైర్మన్‌ పదవి ఇవ్వడమే ఉదాహరణ అని రాష్ట్ర జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ‘ఐదేళ్లపాటు రైతులపై వైసీపీ నిరంకుశ, నియంతృత్వ పాలన సాగింది. ఆ సమయంలో అవిశ్రాంత పోరాటం చేసిన మర్రెడ్డి శ్రీనివాసరెడ్డికి అగ్రి మిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ పదవి రావడం రైతులందరికి సంతోషదాయకం. రాష్ట్ర విభజనకు ముందు ఐటీ, సైబరాబాద్‌ ద్వారా అత్యధిక ఆదాయం రాష్ట్రానికి వచ్చేది. రాష్ట్ర విభజన తరువాత కొత్తగా ఏర్పడిన నవ్యాంధ్రప్రదేశ్‌కు ఆర్థిక ఇబ్బందులు తప్పలేదు. నవ్యాంధ్ర అభివృద్ధి జరగాలంటే వ్యవసాయమే అత్యంత కీలకమని చంద్రబాబు గ్రహించారు. వ్యవసాయ సంరక్షణకు సాహసోపేత నిర్ణయాలే తీసుకున్నారు. చంద్రబాబు సారథ్యంలో ఐదేళ్లపాటు రాష్ట్రంలో రైతు పాలన సాగిన విషయం అందరికీ తెలిసిందే. ఆ ఐదేళ్లలోనే 72శాతం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసిన ఘనత చంద్రబాబుది. ఆ సమయంలో రైతులకు హెక్టారుకు 20 వేల చొప్పున ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చారు.

తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఇన్‌పుట్‌ సబ్సిడీని 15 వేలకు కుదించింది. రైతుకు ఇన్స్యూరెన్స్‌ ఆక్సిజన్‌ లాంటిది. వైసీపీ ప్రభుత్వం రైతులకు ఇన్స్యూరెన్స్‌ దగా చేసింది. ఆ సమయంలో చంద్రబాబు అసెంబ్లీలో కిందకూర్చొని నిరసన తెలిపితే.. ఆరోజు రాత్రి 11 గంటలకు వైసీపీ ప్రభుత్వం ఇన్స్యూరెన్స్‌ కట్టింది. అదీ వైసీపీ హయాంలో రైతులపట్ల సాగిన నిర్లక్ష్యం. వైసీపీ దౌర్భాగ్య పాలనను ఛీకొట్టిన ప్రజలు.. 2024లో కూటమి ప్రభుత్వానికి ఘనవిజయాన్నిచ్చారు. మంచి ప్రభుత్వంలో రైతుకు మంచి రోజులొచ్చాయి. రైతు శ్రేయస్సు, వ్యవసాయ సంక్షేమనికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక బడ్జెట్‌, ప్రత్యేక పాలసీలనే రూపొందిస్తుండటం చూస్తున్నాం.
చంద్రబాబు నాయకత్వంలో తెలుగు రైతు అధ్యక్షునిగా మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి.. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ ప్రతి జిల్లా, ప్రతి ప్రాంతం తిరుగుతూ రైతాంగానికి బాసటగా నిలిచారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇన్‌పుట్‌ సబ్సిడీని 16 వేల నుంచి హెక్టారుకు 25 వేల రూపాయలు చంద్రబాబు పెంచారు. పడకేసిన పోలవరాన్ని 2027 డిసెంబర్‌కల్లా పూర్తిచేసి గోదావరి వరద జలాలు అటు ఉత్తరాంధ్రకు, ఇటు రాయలసీమకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఉన్నారు. వ్యవసాయంపై బాగా అవగాహన ఉన్న మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యవసాయ మిషన్‌ వైస్‌ ఛైర్మన్‌గా నియమించడం రైతులకు పెద్దఎత్తున జరగబోయే మేలుకు సంకేతం. ఆయన అనుభవాన్ని ప్రభుత్వం వాడుకొని రైతులను రక్షించడంలో ముందుకెళ్తుంది. వ్యవసాయాన్ని కాపాడుకుంటాం. రాష్ట్రంలో రైతు పాలన సాగుతోందని నిరూపించుకుంటాం’ అన్నారు.

బీసీ సంక్షేమ మంత్రి సవిత మాట్లాడుతూ.. `రైతుల కోసం శ్రీనివాసరెడ్డి సాగించిన పోరాటాలు చిన్నవేం కాదు. పోలీసులు కేసులు పెడుతున్నా అదరం, బెదరం, చెదరం అంటూ తెలుగుదేశం జెండా ఎత్తిన రైతులు ఎన్ని కష్టాలొచ్చినా దించరని ముందుకు వెళ్లారు. అహర్నిశలు వైసీపీ నిరంకుశ పాలనపై పోరాడారు. అన్న నందమూరి తారక రామారావు రైతాంగానికి ఒక గుర్తింపును తీసుకొచ్చారు. ఆయన స్ఫూర్తితో చంద్రబాబునాయుడు ముందుకు సాగారు. రాష్ట్రం విడిపోయినప్పుడు కూర్చోవడానికి కుర్చీ లేకున్నా రైతాంగానికి పెద్దపీట వేసిన ప్రభుత్వం తెలుగుదేశం. తాగునీరు, సాగునీరు అందించారు. రైతు బిడ్డలు బాగుండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక సంక్షేమ పథకాలు రైతులకు అందించారు. రైతులకు పెట్టుబడి సాయం అందజేయడం జరిగింది. అలాగే రుణమాఫీ చేశారు. డ్రిప్‌ ఇరిగేషన్‌ ఇచ్చారు. నాణ్యమైన ఎరువులిచ్చారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించారు. వాన మబ్బుల కోసం ఎదురుచూస్తూ తట్టా బుట్టా నెత్తిన పెట్టుకొని ఇతర రాష్ట్రాలకు తరలిపోయే సమయంలో చంద్రబాబు 2014-19లో ఇరిగేషన్‌ ప్రాజెక్టులు పూర్తిచేసి అపర భగీరధుడయ్యారు. రాష్ట్రానికి అనేక పరిశ్రమలు తెచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. జగన్‌ ‘ఒక్క ఛాన్స్‌’ తీసుకుని అన్ని రంగాలను భూస్థాపితం చేశాడు.

నా రైతన్నలు అని ప్రేమ నటిస్తూనే.. 63 శాతం వ్యవసాయంపై ఆధారపడిన రాష్ట్ర రైతాంగాన్ని పాతాళంలోకి తొక్కాడు. కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పి 8సార్లు పెంచాడు. మోటార్లకు మీటర్లు బిగించి రైతులకు దగా చేశాడు. అవినీతితో రాష్ట్రాన్ని దోచుకొని దాచుకున్న ఘనుడు జగన్‌. జగన్‌ పాలనలో డ్రిప్‌ ఇరిగేషన్‌ లేదు. స్పికర్లు లేవు. నాణ్యమైన విత్తనాలు లేవు. వైసీపీ హయాంలో అనేకమంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. చంద్రబాబు వస్తేగాని రాష్ట్రం బాగుపడదని గ్రహించి మూకుమ్మడిగా బడుగు, బలహీన వర్గాలు, విద్యావంతులు అందరూ ఏకమై ఎన్డీయే ప్రభుత్వానికి సంపూర్ణ మెజార్టీనిచ్చాయి. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రం పరుగులు పెడుతోంది. ఇలాంటి సమయంలో వ్యవసాయంపై సంపూర్ణమైన అవగాహనవున్న మర్రెడ్డిని అగ్రి మిషన్‌ వైస్‌గా నియమించడం గొప్ప విషయం. మర్రెడ్డికి చంద్రబాబు మరింత బాధ్యతలు పెంచారు. అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం మొత్తం పనిచేస్తుంది. రాష్ట్రానికి, రైతుకు మంచి రోజులు వచ్చినట్టే’ అన్నారు.

గనులు, ఎక్సైజ్‌ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. ఐదేళ్లపాటు రైతుల పక్షాన పోరాటాలు చేసిన గొప్ప నాయకుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి అని అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో మర్రెడ్డిని అగ్రి మిషన్‌ వైస్‌ ఛైర్మన్‌గా నియమించటంతోనే అర్థం చేసుకోవచ్చన్నారు. అగ్రి మిషన్‌తో వ్యవసాయ, ఇరిగేషన్‌, రెవెన్యూ, విద్యుత్‌లాంటి కీలక శాఖలు అనుసంధానమై ఉంటాయని, ఆయా శాఖల సహకారంతో అగ్రి మిషన్‌ అద్భుత ఫలితాలు సాధిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం పోలవరాన్ని నాశనం చేస్తే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పోలవరం పనులు శరవేగమయ్యాయన్నారు. గ్రామాల్లోని కాలువల మరమ్మతులకై గ్రామ కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. ఏకగ్రీవంగా 100 శాతం కమిటీలు ఏర్పాటు చేసుకున్న ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు. ప్రజలు ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతామన్నారు. మర్రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర రైతాంగానికి తప్పక న్యాయం జరుగుతుందని, ఆయన పోరాటాలను గుర్తించి సీఎం చంద్రబాబు సముచిత స్థానం కల్పించారని అభినందించారు. పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతూ..

‘రైతులు ఎదుర్కొన్న సమస్యలు, మిల్లర్స్‌తో ధాన్యం కొనుగోలు విషయంలో కొత్త సంస్కరణలు తీసుకొద్దామనే ఆలోచనతో మర్రెడ్డి శ్రీనివాసులును కలవగా ఆయన అనేక సూచనలు, సలహాలిచ్చారు. ఆయనకు రైతులపట్ల అభిమానం అధికం. చేసే ప్రతి కార్యక్రమం రైతులకు ఉపయోగపడాలనేది చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ల ఉద్దేశం. అలాగే మర్రెడ్డి ఆలోచన. భవిష్యత్తులో చేపట్టే ప్రతి కార్యక్రమం రైతులకు ఉపయోగపడేలా ఉంటుంది. గత వైసీపీ ప్రభుత్వం రూ.16,074 వేల కోట్ల బకాయిలు రైతులకు ఎగ్గొట్టింది. రాష్ట్రం కష్టాల్లో ఉన్నా, చంద్రబాబు వారికి సహాయాన్ని అందించారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఎప్పుడూలేని విధంగా 48 గంటల్లో డబ్బు జమ చేస్తున్నారు. రూ.5,300 కోట్ల ధాన్యం కొనుగోలు అద్భుతం. ప్రభుత్వ విజయాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలి. కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కూటమి ప్రభుత్వం ప్రజల మన్ననలు పొందాలి. ఇది మంచి ప్రభుత్వమనే నమ్మకాన్ని కలిగించాలి. ప్రభుత్వ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మర్రెడ్డి విజయం సాధించాలని మనోహర్‌ ఆకాంక్షించారు.

Previous Post

జీఐజీజీకి సహకరించండి 

Next Post

వాళ్ల నైపుణ్యాన్ని వృధాకానివొద్దు!

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 21-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 21-03-2026

కార్యకర్త
@ March 21, 2026
నిరుద్యోగులకు ఇదే అసలు ఉగాది
ఆంధ్రప్రదేశ్

నిరుద్యోగులకు ఇదే అసలు ఉగాది

చైతన్యరధం
@ March 21, 2026
వాత్సల్యమూర్తి భువనమ్మ
ఆంధ్రప్రదేశ్

వాత్సల్యమూర్తి భువనమ్మ

చైతన్యరధం
@ March 21, 2026
తిరుపతి చేరుకున్న ముఖ్యమంత్రి కుటుంబం
ఆంధ్రప్రదేశ్

తిరుపతి చేరుకున్న ముఖ్యమంత్రి కుటుంబం

చైతన్యరధం
@ March 21, 2026
రోజా.. నోరు అదుపులో పెట్టుకో!
ఆంధ్రప్రదేశ్

రోజా.. నోరు అదుపులో పెట్టుకో!

చైతన్యరధం
@ March 21, 2026
పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక
ఆంధ్రప్రదేశ్

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

చైతన్యరధం
@ March 21, 2026
చైతన్యరధం ఈ పేపర్ 20-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 20-03-2026

కార్యకర్త
@ March 20, 2026
సం’క్షేమమే ధ్యేయంగా.. కొత్త ఏడాదిలో తొలి రోజున సీఎం తొలి సంతకం
ఆంధ్రప్రదేశ్

సం’క్షేమమే ధ్యేయంగా.. కొత్త ఏడాదిలో తొలి రోజున సీఎం తొలి సంతకం

చైతన్యరధం
@ March 20, 2026
Load More

ముఖ్య వార్తలు

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

చైతన్యరధం
@ March 21, 2026
మాట ఇచ్చాం… అమలు చేశాం!

మాట ఇచ్చాం… అమలు చేశాం!

చైతన్యరధం
@ March 20, 2026
అగ్రస్థానం.. నా సంకల్పం

అగ్రస్థానం.. నా సంకల్పం

చైతన్యరధం
@ March 20, 2026
పోలవరం నిర్వాసితులను గుండెల్లో పెట్టుకుంటాం

పోలవరం నిర్వాసితులను గుండెల్లో పెట్టుకుంటాం

చైతన్యరధం
@ March 19, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

నిరుద్యోగులకు ఇదే అసలు ఉగాది

నిరుద్యోగులకు ఇదే అసలు ఉగాది

చైతన్యరధం
@ March 21, 2026
వాత్సల్యమూర్తి భువనమ్మ

వాత్సల్యమూర్తి భువనమ్మ

చైతన్యరధం
@ March 21, 2026
తిరుపతి చేరుకున్న ముఖ్యమంత్రి కుటుంబం

తిరుపతి చేరుకున్న ముఖ్యమంత్రి కుటుంబం

చైతన్యరధం
@ March 21, 2026
రోజా.. నోరు అదుపులో పెట్టుకో!

రోజా.. నోరు అదుపులో పెట్టుకో!

చైతన్యరధం
@ March 21, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist