చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

వాక్ స్వాతంత్య్రం..అపరిమితమైన హక్కు కాదు!

సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉప ముఖ్యమంత్రి పవన్ సందేశం

by చైతన్యరధం
Jul 2, 2026 at 6:15am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
వాక్ స్వాతంత్య్రం..అపరిమితమైన హక్కు కాదు!
Share on FacebookShare on TwitterShare on Whatsapp

దానికి కొన్ని పరిమితులున్నాయి
భావ ప్రకటన స్వేచ్ఛ పేరిట ఇతరుల హక్కులకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవు
సద్విమర్శలను స్వాగతిస్తాం… హత్యా బెదిరింపులను సహించబోము
సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉప ముఖ్యమంత్రి పవన్ సందేశం

అమరావతి (చైతన్య రథం): ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును మనస్ఫూర్తిగా స్వాగతిస్తామని, అయితే సరైన ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే మాత్రం ఎంతమాత్రం ఉపేక్షించబోమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. వాక్ స్వాతంత్య్రం అనేది అపరిమితమైన హక్కు కాదని, దానికీ కొన్ని పరిమితులు ఉన్నాయన్నారు. ఇతరుల హక్కులను కాలరాసే హక్కు దానికి లేదన్నారు. సోషల్ మీడియాలో మత విశ్వాసాలను గాయపరచడం, వ్యక్తిగత దూషణలకు దిగడం, హత్యా బెదిరింపులకు పాల్పడడం, దేవుళ్లు, దేవతలపై ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేయడం సమంజసం కాదని స్పష్టం చేశారు. ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఇందుకోసం అవసరమైతే కొత్త చట్టాలు, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని హెచ్చరించారు. వాక్ స్వాతంత్య్రం… సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం సాయంత్రం సోషల్ మీడియాలో సందేశమిచ్చారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ… “సోషల్ మీడియా ఇప్పుడు మన రోజువారీ జీవితంలో భాగమైపోయింది. మన అభిప్రాయాలను చెప్పడానికి, ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి, ఒకరితో ఒకరు అనుసంధానమవ్వడానికి, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఇది ఒక శక్తివంతమైన వేదిక. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది మన రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. ఆ హక్కును నేను గౌరవిస్తాను… మా ప్రభుత్వం గౌరవిస్తుంది. కానీ వాక్ స్వాతంత్య్రం ముసుగులో ఇతరుల హక్కులకు భంగం వాటిల్లితే చట్టపరమైన పరిణామాలు తప్పవు అని హెచ్చరించారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 25-07-2026

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

మీకోసం.. నేనున్నా!

ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఫ్రీడమ్ టు అబ్యూజ్ కాదు
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(2) ప్రకారం దేశ సమగ్రత, జాతీయ భద్రత, ప్రజా శాంతి, మర్యాద, నైతిక విలువలు, పరువు నష్టం, నేరాలకు ప్రేరేపించడం వంటి అంశాల్లో చట్టపరమైన పరిమితులు ఉన్నాయి. సింపుల్‌గా చెప్పాలంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఫ్రీడమ్ టు అబ్యూజ్ కాదు. ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు మీకుంది. మమ్మల్ని ప్రశ్నించే హక్కు మీకుంది. మా నిర్ణయాలతో విభేదించే హక్కు మీకుంది. అదే ప్రజాస్వామ్యం… దాన్ని మేము స్వాగతిస్తాము. కానీ ఒకరిని తిట్టడం, హత్యా బెదిరింపులకు పాల్పడడం, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, మహిళలను టార్గెట్ చేయడం, మత విశ్వాసాలను అవమానించడం, ఒక వ్యక్తి గౌరవాన్ని దెబ్బతీయడం, హింసకు ప్రేరేపించడం… ఇవన్నీ రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛలోకి రావు. ఇవి చట్టపరంగా నేరాలు” అన్నారు.

ఫేక్ అకౌంట్ల వెనుక దాక్కుని అరాచకాలా?
గత కొన్ని ఏళ్లుగా సోషల్ మీడియాను కొందరు తప్పుడు పనులకు వాడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఫేక్ అకౌంట్ల వెనుక దాక్కుని అసభ్యంగా మాట్లాడడం, వ్యక్తిగతంగా తిట్టడం, పరువు తీయడం, ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం ఎక్కువైపోయింది. అబద్ధపు ప్రచారాలు చేయడం, ఫోటోలను అసభ్యంగా మార్చడం, భయపెట్టడం వంటి పనులకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా మహిళలను టార్గెట్ చేస్తూ చండాలమైన పోస్టులు పెడుతున్నారు. దేవుళ్లు, దేవతలపై కావాలనే అవమానకరమైన కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి పనులను భావ ప్రకటన స్వేచ్ఛ అనరు. ఇది మంచి విమర్శ కాదు, ప్రజాస్వామ్యం అసలే కాదు. తప్పులను ఎత్తిచూపడం, సరదాగా సెటైర్లు వేయడం, సొంత అభిప్రాయాలను చెప్పే హక్కును మేము పూర్తిగా గౌరవిస్తాము. కానీ కావాలనే అబద్ధాలు ప్రచారం చేయడం, విద్వేషాలు రెచ్చగొట్టడం, ప్రాణాలతో చెలగాటం ఆడుతామని బెదిరించడం, ఆన్‌లైన్ వేధింపులకు పాల్పడడం, ఒకరి పరువు తీయాలని చూడడం… ఇవన్నీ భావ ప్రకటన స్వేచ్ఛ కిందకు రావు. వీటిని ఏమాత్రం సమర్థించలేము అని డిప్యూటీ సీఎం హెచ్చరించారు.

నేరానికి కులం, మతం, ప్రాంతం, పార్టీ లేదు
నేరానికి కులం, మతం, లేదా రాజకీయ పార్టీ అనే తేడాలు ఉండవు. తప్పు చేసిన తర్వాత కులం వెనుకో, మతం వెనుకో, ప్రాంతం లేదా రాజకీయ పార్టీల వెనుకో దాక్కోవాలని ఎవరూ ప్రయత్నించవద్దు. చట్టం ముందు ప్రతి ఒక్కరూ సమానమే. తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవు. సోషల్ మీడియాలో వేధింపులు, దూషణల వల్ల ఇబ్బందులు పడుతున్న బాధితులందరికీ నేను ఒకే మాట చెబుతున్నాను… మీరు అస్సలు ఒంటరివారు కాదు. ఈ ప్రభుత్వం మీకు పూర్తి అండగా ఉంటుంది. మీ సమస్యలపై ఫిర్యాదులు తీసుకోవడానికి ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాము. వేధింపులకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌లు, లింక్‌లు, వీడియోలు వంటి డిజిటల్ ఆధారాలతో మీరు ఫిర్యాదు చేయవచ్చు. ప్రతి నిజమైన ఫిర్యాదును మేమే స్వయంగా పరిశీలించి, అధికారుల ద్వారా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకునేలా చూస్తాము. అలాగే, పదేపదే ఫేక్ అకౌంట్ల ద్వారా సోషల్ మీడియాను పాడుచేస్తున్న వారిని గుర్తించి, వారి వివరాలను ప్రభుత్వానికి అందించాలని బాధ్యతగల పౌరులందరినీ కోరుతున్నాను. సమాజాన్ని పాడుచేసే ఇలాంటి వారిని అడ్డుకోవడం కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు… మనందరి ఉమ్మడి బాధ్యత అని పవన్ పేర్కొన్నారు.

అవసరమైతే కొత్త చట్టాలు తీసుకొస్తాం
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలకు పాల్పడ్డవారిపై భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, సమాచార సాంకేతిక చట్టం – 2000తోపాటు ఇతర సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాము. అవసరమైతే సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి కొత్త చట్టాన్ని తీసుకురావడానికీ మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తాము. సైబర్ క్రైమ్ పోలీసులు, న్యాయ రక్షణ సంస్థలతో కలిసి పనిచేస్తూ.. సోషల్ మీడియా నేరాలపై చాలా వేగంగా యాక్షన్ తీసుకుంటామని పవన్ పేర్కొన్నారు.

తప్పుడు పోస్టులను ఫార్వార్డ్ చేయకండి
ప్రతి పౌరుడికి నేను ఒకే ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఫేక్ అకౌంట్లు, చంపేస్తామనే బెదిరింపులు, మహిళలపై అసభ్యకరమైన పోస్టులు, మతాలను అవమానించే తప్పుడు సమాచారం లాంటి చట్టవిరుద్ధమైన కంటెంట్ మీకు కనిపిస్తే.. వాటిని ఇతరులకు ఫార్వార్డ్ చేయకండి, లైకులు-షేర్లతో ప్రమోట్ చేయకండి. అదే సమయంలో, రాజ్యాంగం మనకు కల్పించిన భావప్రకటన స్వేచ్ఛను మేము పూర్తిగా కాపాడతాము. అయితే మన మాటల్లో బాధ్యత, మన భాషలో గౌరవం, మన స్వేచ్ఛకు జవాబుదారీతనం ఉండాలి. సోషల్ మీడియా అనేది మనుషులను కలిపే వేదిక కావాలి కానీ, విడదీసేది కాకూడదు. మమ్మల్ని నిరభ్యంతరంగా ప్రశ్నించండి, విమర్శించండి, మీ అభిప్రాయాలను చెప్పండి. కానీ ఎదుటివారికి గౌరవం ఇస్తూ, బాధ్యతతో, చట్టాన్ని గౌరవిస్తూ చెప్పండి. అప్పుడే మన ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది” అని పవన్ కళ్యాణ్ హితవు పలికారు.

Previous Post

అభివృద్ధి వికేంద్రీకరణే కూటమి లక్ష్యం

Next Post

మావిగన్ దెబ్బకు..ఉన్న సీట్లూ హుళక్కే!

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 25-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 25-07-2026

కార్యకర్త
@ July 25, 2026
అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి
ఆంధ్రప్రదేశ్

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

చైతన్యరధం
@ July 25, 2026
ఆంధ్రప్రదేశ్

మీకోసం.. నేనున్నా!

చైతన్యరధం
@ July 25, 2026
మహిళలను అవమానిస్తే సహించను
ఆంధ్రప్రదేశ్

మహిళలను అవమానిస్తే సహించను

చైతన్యరధం
@ July 25, 2026
ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు
ఆంధ్రప్రదేశ్

ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

చైతన్యరధం
@ July 25, 2026
మీ సంకల్పం నెరవేరుతుంది
ఆంధ్రప్రదేశ్

మీ సంకల్పం నెరవేరుతుంది

చైతన్యరధం
@ July 25, 2026
చదువే పిల్లలకు శాశ్వత ఆస్తి
ఆంధ్రప్రదేశ్

చదువే పిల్లలకు శాశ్వత ఆస్తి

చైతన్యరధం
@ July 25, 2026
చైతన్యరధం ఈ పేపర్ 24-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 24-07-2026

కార్యకర్త
@ July 24, 2026
Load More

ముఖ్య వార్తలు

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

చైతన్యరధం
@ July 24, 2026
భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

చైతన్యరధం
@ July 24, 2026
50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

చైతన్యరధం
@ July 24, 2026
ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

చైతన్యరధం
@ July 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

చైతన్యరధం
@ July 25, 2026

మీకోసం.. నేనున్నా!

చైతన్యరధం
@ July 25, 2026
మహిళలను అవమానిస్తే సహించను

మహిళలను అవమానిస్తే సహించను

చైతన్యరధం
@ July 25, 2026
ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

చైతన్యరధం
@ July 25, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist