- గ్రూప్ 1 స్కామ్‌లో అన్నీ ఆధారాలు పరిశీలించే కోర్టు పరీక్షలు రద్దు చేసింది
- మేమిచ్చిన ఆధారాలు చూసి గవర్నర్ సైతం ఆశ్చర్యపోయారు
- నా వద్ద ఉన్న ఆధారాలతో వస్తా.. మీడియా సమక్షంలో సవాంగ్ చర్చకు సిద్దమా?
- ఎపీపీఎస్సీపై నమ్మకం కోల్పొయిన యువత
- టీడీపీ అధికారంలోకి రాగానే అక్రమాలపై సీబీఐ విచారణ: కొమ్మారెడ్డి పట్టాభిరాం
అమరావతి,చైతన్యరథం: గ్రూప్ 1 మెయిన్స్ వాల్యూయేషన్ మూడు సార్లు జరిగితే ఒక్కసారే చేశామని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ ఇంకా బుకాయించటం సిగ్గుచేటని, బుకాయింపులు ఆపి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం ద్వజ మెత్తారు. సోమవారం నాడు మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్హహించిన విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడుతూ… గత ఐదేళ్లలో అనేక స్కాంలకు పాల్పడ్డ జగన్ ప్రభుత్వం చివరకు గ్రూప్-1 ఉద్యోగాల్ని సైతం తెగనమ్మకుంది.గ్రూప్ 1 ఉద్యోగాల్లో రూ.150 నుంచి రూ.200 కోట్ల అవినీతి జరిగింది. అక్రమంగా మూడు సార్లు మూల్యాంకనం జరిగిందని అన్నీ ఆధారాలు పరిశీలించే కోర్టు పరీక్షలు రద్దు చేసి 6 నెలల్లో తిరిగి పరీక్ష నిర్వహించి ప్రక్రియ పూర్తి చేయాలని కోర్టు చెప్పింది. మరోవైపు మా పార్టీ అధినేత నారా చంద్ర బాబునాయుడు ఈ స్కాంపై పవర్‌పాయింట్ ప్రజెంటే షన్ ఇచ్చారు. ఈ స్కాం ఎలా జరిగిందో, ఏపీపీఎస్సీ సెక్ర టరీగా సీతారామాంజనేయులు ఎలా అక్రమాలకు పాల్పడ్డారో, సవాంగ్ చైర్మన్ అయ్యాక 3వ సారి ఎలా మూల్యాంకనం చేశారో, తప్పుడు అఫడవిట్లు ఇచ్చి కోర్టులను ఎలా మోసం చేశారో ఇవన్నీ ప్రజల ముందుంచారు.
తప్పు చేసి నిసిగ్గుగా బుకాయిస్తున్న సవాంగ్
కానీ తప్పు చేసి కూడా నిస్సిగ్గుగా గౌతమ్ సవాంగ్ బుకాయించటం సిగ్గుచేటు. కమీషన్‌పై వచ్చిన ఆరోప ణలపై సరైన సమయంలో వివరణ ఇస్తామంటున్నారు. సరైన సమయం ఎప్పుడు సవాంగ్ గారు? మీరు రిటైర్డ్ అయిన తర్వాతా? లేక గవర్నర్ మిమ్మల్ని డిస్మిస్ చేశాకనా? లక్షలాది మంది యువతను రోడ్డున పడేసి ఇంకేం వివరణఇస్తారు? దీనిపై ఎంతోమంది తల్లి తండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి పిల్లల్ని చదివిస్తే మీరు ఉద్యోగాలను డబ్బుకు అమ్ముకుంటా రా? గవర్నర్ సైతం ఈ స్కామ్‌పై ఆశ్చర్యపోయారు. ఎక్కడ తప్పు జరిగినా తప్పుచేసిన వారికి శిక్ష విధిస్తూ న్యాయాన్ని పరిరక్షించాల్సిన రాష్ట్ర డీజీపీగా బాధ్యతా యుతమైన పదవి నిర్వర్తించిన సవాంగ్ తప్పు చేయట మేకాక నిస్సిగ్గుగా అబద్దాలు చెబుతారా? ఒక్క క్షణం కూడా సవాంగ్ కి ఆ పదవిలో కొనసాగే అర్హత లేదు.
అక్రమాలపై పక్కా ఆధారాలు
డిజిటల్ వాల్యూయేషన్ చేసిన తర్వాత సీతా రామాంజనేయులు మరో సారి వాల్యూయేషన్ చేశారని అనేక ఆధారాలున్నాయి. అయినా ఒక సారే వాల్యూ యేషన్ చేశామని సవాంగ్ బుకాయించటం దిగజారు డుతనానికి పరాకాష్ట. గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ వాల్యుయేషన్ ప్రారంభిస్తున్నామని, అందుకు సంబం దించిన కంట్రోల్ బండిల్ స్లిప్స్‌ని మాకు సప్లై చేయండని డేటాటెక్ మెధడెక్స్ కి 2021 నవంబర్ 25న సీతారామాంజనేయులు లేఖ రాయటం వాస్తవం కాదా? వాళ్లు సప్లై చేసిన కంట్రోల్ బండిల్ స్లిప్స్ కి పేమెంట్స్ కి ప్రొసిడిరగ్స్ (29.12.2021) ఇచ్చారు. జవాబు పత్రాలు స్ట్రాంగ్ రూంకి తరలించాలని అందుకుతగిన పోలీసు భద్రతకావాలని నాటి గుంటూ రు ఎస్పీకి 03.12.2021 సీతా రామాంజనేయులు లేఖ రాయటం నిజంకాదా? అసలు మాన్యువల్ వాల్యు యేషన్ జరగకపోతే సీతారామాంజనేయులు ఈ లేఖలు ఎందుకు రాశారు? హాయ్ ల్యాండ్‌లో మాన్యువల్ వాల్యుయేషన్ చేయడానికి వచ్చిన అధికారులకు రూమ్స్‌కి, లంచ్, బ్రేక్ పాస్ట్ వీటంన్నిటీ హాయ్ ల్యాండ్ (ఆవాస) రిసార్ట్‌కి రూ.20 లక్షలు చెల్లించటం నిజం కాదా? ఈ వివరాలు ఏపీపీఎస్సీ అకౌంట్ బుక్స్‌లో ఉం టాయి, వీటిని బయటికి తీయగలరా? స్ట్రాంగ్ రూం వద్ద భధ్రతకు కర్నూలు నుంచి 32 మంది కానిస్టేబుల్లు 05- డిసెంబర్ నుంచి పిబ్రవరి 2022 వరకు పంపిన లిస్ట్ కూడా మా వద్ద ఉంది. వాల్యూ యేషన్ జరగక పోతే అక్కడ కానిస్టుబుళ్లకు డ్యూటీ ఎందుకు వేశారు? వాల్యూయేషన్ జరిగిందో లేదో ఆ కానిస్టేబుళ్లను పిలిచి మాట్లాడుదామా? ఇవే కాకుండా మేం వాల్యుయేషన్ పూర్తిచేశామని దానికి…