చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

జీజీహెచ్‌లు సమూల ప్రక్షాళన

వైద్య శాఖా మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ వెల్లడి

by చైతన్యరధం
Aug 17, 2024 at 6:10am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
జీజీహెచ్‌లు సమూల ప్రక్షాళన
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ప్రజలకు సంతృప్తికర వైద్య సేవలే సర్కారు లక్ష్యం
  • సేవల మెరుగుకు 30 అంశాలతో కార్యాచరణ
  • స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలు అమలు
  • ఎన్టీఆర్‌ వైద్య సేవల్లో అంతరాయం ఉండదు
  • గత పాలకుల అవకవతకలపై లోతైన దర్యాప్తు
  • వైద్య శాఖా మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ వెల్లడి

అమరావతి (అమరావతి): ప్రజలకు సంతృప్తికరస్థాయిలో మెరుగైన వైద్య సేవలందించేలా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల ప్రక్షాళనకు చర్యలు చేపడుతున్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ తెలిపారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రభుత్వ సర్వజన ఆస్పత్రుల పనితీరు మెరుగుకై 30 అంశాల కార్యాచరణ ప్రణాళికను స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రాదిపదికన అమలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లు, జిజిహెచ్‌ల సూపరింటెండెంట్లు మరియు ఇతర ఆసుపత్రుల ప్రతినిధులతో మేథోమదన కార్యక్రమాన్ని నిర్వహించి కార్యాచరణ రూపొందించామన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పారిశుద్య కార్యక్రమాలను మెరుగుపర్చి ఆహ్లదకరమైన వాతావరణాన్ని కల్పించడం, ఓపీ సేవల్లో ఎటువంటి అవాంతరాలు

లేకుండా చూడటం, రోగులకు సహకరించేందుకు హెల్త్‌ డెస్కుల ఏర్పాటు, వైద్యులు, రోగనిర్ధారణ పరికరాలు, యంత్రాల పనితీరును పర్యవేక్షించడం, అవసరమైన వైద్య పరికరాలు సమకూర్చడం, వైద్యాధికారులు, సిబ్బంది కొరత నివారణకై ఖాళీ పోస్టులను భర్తీ చేయడం, సూపర్‌ స్పెషాలిటీ సేవలతోపాటు అధునాతన శస్త్ర చికిత్సలు, అవయవ మార్పిడి చికిత్సలు అన్ని ప్రభుత్వ ఆసుపత్రల్లో అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11 వేల వైద్యాధికారుల సేవలు అవసరం ఉండగా, ప్రస్తుతం 3,100 వైద్యాధికారుల కొరత ఉందని, ఖాళీ పోస్టుల భర్తీకి తగు చర్యలు తీసుకుంటామన్నారు. మూడునుండి ఆరు మాసాల కాలవ్యవధిలో స్వల్పకాలిక ప్రణాళికను, ఏడాది వ్యవధిలో మధ్యకాలిక ప్రణాళికను అమలు చేయడంతో పాటు దీర్ఘకాలిక ప్రణాళిక అమల్లో భాగంగా సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలను అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

సంబంధితవార్తలు

No Content Available

ఆహ్లాదకరంగా ఆస్పత్రి ప్రాంగణాలు
స్వల్పకాలిక ప్రణాళిక అమల్లో భాగంగా ఆసుపత్రుల ప్రాంగణాలను ఆహ్లదకరంగా తీర్చిదిద్దడం, టాయిలెట్ల, బయో-మెడికల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ను పటిష్టంగా నిర్వహించడం, స్ట్రెచర్లు, వీల్‌చైర్లు, మహాప్రస్థానం వాహనాలు అవసరం మేరకు సమకూర్చుకోవడం, మగ నర్సింగ్‌ ఆర్డర్లీ (ఎంఎన్‌ఓ)లు, మహిళా నర్సింగ్‌ ఆర్డర్లీ (ఎఫ్‌ఎన్‌ఓ)లు, ల్యాబ్‌ మరియు ఇతర సాంకేతిక నిపుణుల కొరతను నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సీనియర్లు/ స్పెషలిస్ట్‌ వైద్యులు తప్పనిసరిగా ఓపి విధులకు హాజరయ్యేలా చూడటం, టెస్టుల రిపోర్టు వివరాలు ఎస్‌ఎంఎస్‌. ద్వారా రోగులకు తెలియజేయడం, ఆసుపత్రుల్లో అవినీతిని నియంత్రించేందుకై ‘104’కి కాల్‌ చేసి ఫిర్యాదు చేసేలా ప్రోత్సహించడం మరియు ‘108’ సర్వీస్‌ సిబ్బంది మరియు క్యాజువాలిటీ వైద్యుల బృందం మధ్య సమర్ధవంతమైన సమన్వయం ఉండేలా తగు చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి తెలిపారు.

రోగనిర్థారణ పరికరాలపై దృష్టి
ఏడాది కాలంలో మధ్యకాలిక ప్రణాళిక అమల్లో భాగంగా ఎక్స్‌-రే యంత్రాలు, సిటి స్కాన్లు, ఎంఆర్‌ఐ, వెంటిలేటర్లు, అల్ట్రాసౌండ్‌ సిస్టమ్స్‌వంటి వివిధ రోగనిర్ధారణ పరికరాలు మరియు యంత్రాలు అవసరాల మేరకు సమకూర్చుకోవడం, వివిధ విభాగాల వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది మరియు టెక్నీషియన్లు, ఎంఎన్‌ఓలు/ ఎఫ్‌ఎన్‌ఓలు వంటి కీలక పోస్టులను భర్తీ చేయడం, ఆపరేష్‌ థియేటర్లలో సూక్ష్మజీవుల సంక్రమణ (ఇన్ఫెక్షన్‌)ను నివారించడానికి శీతలీకరణ (ఏసీ) వ్యవస్థను పటిష్టంచేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

అదేవిధంగా దీర్ఘకాలిక ప్రణాళిక అమల్లో భాగంగా అన్ని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రులలో కార్డియాలజీ, కార్డియో థొరాసిక్‌ సర్జరీ, నెఫ్రాలజీ, న్యూరోసర్జరీ, యూరాలజీ, గ్యాస్ట్రో-ఎంటరాలజీ, ఎండోక్రైనాలజీ, క్యాన్సర్‌ కేర్‌ (రేడియేషన్‌ ఆంకాలజీ, రేడియో థెరపీ మరియు సర్జికల్‌ ఆంకాలజీ) సూపర్‌ స్పెషాలిటీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు చేపడుతున్నామన్నారు. గుండె, మూత్రపిండాలు, కాలేయంవంటి అవయవ మార్పిడి సేవలను, వైద్యులకు సమర్థవంతమైన డిజిటల్‌ లైబ్రరీ సేవను అందుబాటులోకి తేవడంతో పాటు, నాణ్యతతో కూడిన ఆధునిక వైద్య సేవలు అందించడానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

ఎన్టీఆర్‌ వైద్య సేవల్లో అంతరాయం ఉండదు
ఎన్టీఆర్‌ వైద్య సేవల్లో ఎటువంటి అంతరాయం ఉండబోదని మీడియా ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లింపునకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత నిస్తున్నదన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి విడతలో రూ.162 కోట్లు, రెండో విడతలో నేడు రూ.200 కోట్లు ఇవ్వడం జరిగిందని, మరో వారం రోజుల్లో రూ.300 కోట్లు ఇస్తున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోషియేషన్‌ దాదాపు 13సార్లు నోటీసుల ఇచ్చినా సరే స్పదించలేదని, కానీ తమ ప్రభుత్వానికి ఒకసారి నోటీసు ఇచ్చిన వెంటనే స్పందిస్తూ ఆయా ప్రతినిధులతో పలుమార్లు చర్చలు జరిపి ఇప్పటి వరకూ దాదాపు రూ.662 కోట్లు చెల్లించేందుకు చర్యలు చేపట్టడమైందన్నారు.

ఈ పథకం క్రింద ఇప్పటి వరకూ దాదాపు రూ.2,100 కోట్లు పెండిరగ్‌ బకాయిలు చెల్లించాల్సి ఉందని, మరో రూ.400 కోట్లు అప్‌ లోడ్‌ చేయాల్సి ఉందన్నారు. మొత్తం మీద రూ.2,500 కోట్లు బకాయిలు ఉన్నాయని, వాటిలో ఇప్పటికే 35 శాతం మేర బకాయిలు చెల్లించడం జరిగిందన్నారు. అసోషియేషన్‌ ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు ప్రతి నెలా వారికి చెల్లింపుపలు చేసే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి తగు చర్యలు తీసుకోనున్నామని మంత్రి తెలిపారు. అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకవతకలపై లోతుగా దర్యాప్తు కొనసాగుతోందనీ, ఎవర్నీ వదిలిపేట్టేదిలేదని మంత్రి స్పష్టం చెప్పారు.

రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎం.టి.కృష్ణబాబు, కమిషనర్‌ సి.హరికిరణ్‌, ఏపీఎంఐడిసి ఎం.డి. మరియు ఎన్టీఆర్‌ వైద్య సేవ సీఈవో డా.జి.లక్ష్మీషా, వైద్య విద్య సంచాలకులు డా.నరసింహం, వైద్య విద్య అదనపు సంచాలకులు రఘునందన్‌ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

Tags: ఎన్టీఆర్‌ వైద్య సేవజీజీహెచ్‌వైద్య శాఖా మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌
Previous Post

భూ రికార్డులు సరిచేస్తాం

Next Post

పేదోడికి పట్టెడన్నం!

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 13-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 13-07-2026

కార్యకర్త
@ July 13, 2026
సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్

సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు

చైతన్యరధం
@ July 13, 2026
పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారు
ఆంధ్రప్రదేశ్

పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారు

చైతన్యరధం
@ July 13, 2026
ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు
ఆంధ్రప్రదేశ్

ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు

చైతన్యరధం
@ July 13, 2026
చైతన్యరధం ఈ పేపర్ 12-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 12-07-2026

కార్యకర్త
@ July 12, 2026
మళ్లీ కలుద్దాం
ఆంధ్రప్రదేశ్

మళ్లీ కలుద్దాం

చైతన్యరధం
@ July 12, 2026
గొడ్డలి పార్టీతో రాష్ట్రానికి తీవ్ర నష్టం
ఆంధ్రప్రదేశ్

గొడ్డలి పార్టీతో రాష్ట్రానికి తీవ్ర నష్టం

చైతన్యరధం
@ July 12, 2026
‘పిల్లలే సంపద’ మాట నిజం చేస్తాం
ఆంధ్రప్రదేశ్

‘పిల్లలే సంపద’ మాట నిజం చేస్తాం

చైతన్యరధం
@ July 12, 2026
Load More

ముఖ్య వార్తలు

ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం

ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం

చైతన్యరధం
@ July 10, 2026
హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీలు పెంపు

హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీలు పెంపు

చైతన్యరధం
@ July 9, 2026
హస్తకళల ప్రోత్సాహమే సంకల్పం

హస్తకళల ప్రోత్సాహమే సంకల్పం

చైతన్యరధం
@ July 8, 2026
మాట నిలుపుకున్న సీఎం చంద్రబాబు

మాట నిలుపుకున్న సీఎం చంద్రబాబు

చైతన్యరధం
@ July 2, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు

సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు

చైతన్యరధం
@ July 13, 2026
పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారు

పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారు

చైతన్యరధం
@ July 13, 2026
ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు

ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు

చైతన్యరధం
@ July 13, 2026
మళ్లీ కలుద్దాం

మళ్లీ కలుద్దాం

చైతన్యరధం
@ July 12, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist