- సిగ్గూ, లజ్జా లేకుండా కియా పరిశ్రమను కూడా మీ ఖాతాలో వేసుకుంటారా?
- ఎవరికో పుట్టిన బిడ్డను మీ బిడ్డగా చెప్పుకోవడానికి సిగ్గనిపించడం లేదా?
- విధ్వంసమే అజెండాగా పాలన సాగిస్తున్న మీరు పారిశ్రామిక ఉద్దారకులా?
- అదే నిజమైతే స్టార్టప్ ర్యాంకింగ్స్‌లో చివరిస్థానంలో ఎందుకు నిలిచారు?
- ఎంఎస్‌ఎంఇలకు ఇచ్చింది 680 కోట్లు.. 2,500 కోట్లు ఇచ్చామని తప్పుడు ప్రచారం
- అమర్ రాజా, జువారీ సిమెంట్స్ లను మూసేయాలని చూడటం ప్రోత్సహకమా?
- టిడిపి హయాంలో 5.13లక్షల ఉద్యోగాలిచ్చారని చెప్పింది వాస్తవం కాదా?
- ఇంకా ఎంతకాలం అబద్దాలు, అవాస్తవాలతో జనాన్ని మభ్యపెడతారు జగన్ రెడ్డీ?
- అసెంబ్లీ సాక్షిగా సీఎం అబద్దాలు`వాస్తవాలు
(చైతన్యరథం ప్రత్యేక ప్రతినిధి – అమరావతి)
ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి అబద్దాలు చెప్పడంలో గోబెల్స్‌ను మించిపోయారు. ప్రజాస్వామ్య దేవాలయం లాంటి అసెంబ్లీలో తాము చేయని దానిని చేసినట్లుగా లెక్కల్లో కలిపేసుకొని తప్పుడు లెక్కలతో మరోమారు రాష్ట్రప్రజానీకాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎడారి జిల్లాగా పేరొందిన అనంతపురంలో చంద్ర బాబునాయుడు కియా, జాకీ వంటి పరిశ్రమలను తెచ్చి కమిషన్ల కోసం ఆయా పరిశ్రమదారులను బెదిరించిన మీరు పరిశ్రమల ఉద్దారకులు చెప్పుకోవడం చూసి ఆ పై లోకంలో ఉన్న గోబెల్స్ సిగ్గుతో తలదించుకుంటున్నారు. మూడున్నరేళ్లలో ఒక్కటంటే ఒక్కటి చెప్పుకోదగ్గ పరిశ్రమను రాష్ట్రానికి తేలేని జగన్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో తెచ్చిన ప్రతిష్టాత్మక పరిశ్రమలను సిగ్గూ, లజ్జా లేకుండా తమవిగా చెప్పుకుంటున్నారు. ఎంఎస్‌ఎస్‌ఇలు, పరిశ్రమలను తాము ఎంత గానో ప్రోత్సహించామని కాకిలెక్కలు చెబుతున్న జగన్ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన స్టార్టప్ ర్యాంకింగ్‌లో ఆంధ్రప్రదేశ్ అథమస్థానంలో ఎందుకు ఉందో కూడా చెబితే బాగుండేది. మీ కారణంగా రాష్ట్రం విడిచి వెళ్లిన ప్రతిష్టాత్మక పరిశ్రమలైన లులూ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఆసియన్ పేపర్ మిల్స్, బిఆర్ షెట్టి, ట్రై టాన్ ఎలక్ట్రిక్ కార్లు, హెచ్ పిసిఎల్, హెచ్‌ఎస్ బిసి, ఐబిఎం, ఫిన్ టెక్ వ్యాలీ వంటి పరిశ్రమలు తమ ప్రతి పాదనలు విరమించుకొని పారిపోయారో చెబితే బాగు ండేది. అలాగే మీ ఇసుక దోపిడీ కారణంగా రోడ్డున పడ్డ 50లక్షలమంది భవన నిర్మాణ కార్మికులు, కమిషన్ కోసం మీరు గొంతు నులిమి రోడ్డున పడేసిన లక్ష మంది సినిమా కార్మికుల గురించి కూడా చెప్పాల్సింది జగన్ రెడ్డీ? అయితే ఒక్క విషయంలో మాత్రం జగన్ రెడ్డిని మేం అభినందిస్తున్నాం. అబద్ధాలను అచ్చుగుద్దినట్లు నిజాలు ప్రజలను చెప్పడంలో ఆయనను మించిన వారు బహుశా సమకాలీన రాజకీయాల్లో మరెవరూ ఉండరు. అయితే జగన్ రెడ్డి తప్పుడు మాటలకు గత ఎన్నికల్లో మోసపోయిన విజ్జులు, చైతన్యవంతు లైన ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరోమారు మోసపోవడానికి సిద్ధంగా లేరన్న విషయాన్ని ఆయన గుర్తిస్తే మం చిది. పారిశ్రామిక పెట్టుబడులపై అసెంబ్లీలో జగన్ రెడ్డి చెప్పిన అబద్దాలు-అసలు నిజాలను ప్రజల ముందు ఉంచుతున్నాం. ఎవరు ఉద్దారకులో,ఎవరు విధ్వంసకులు తీర్పునివ్వాల్సింది 5కోట్ల మంది ప్రజలే.
పరిశ్రమలు పెట్టుబడులపై ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పిన అబద్దాలు – వాస్తవాలు
అబద్దం`1: ఎంఎస్‌ఎంఈ రంగానికి రూ.2,500 కోట్ల ఇన్సెంటివ్‌లు ఇచ్చాం, చిన్న తరహా పరిశ్రమలను పోత్రహిస్తున్నాం. క్రమం తప్పకుండా ప్రతి ఏటా ఇన్సెంటివ్‌లను విడుదల చేస్తున్నాం. ఎంఎస్ ఎంఇలపై ప్రత్యేక ధ్యాస పెట్టాం. అక్షరాల రూ.2858 కోట్లకు పైగా ఇన్సెటివ్‌లు పారిశ్రామిక రంగానికి మన ప్రభుత్వం ఇస్తే.. ఇందులో ఒక్క ఎంఎస్‌ఎంఈ రంగానికి మాత్రమే రూ.2500 కోట్లు ఇచ్చాం. చంద్రబాబు హయాంలో రూ.2,200 కోట్లు బకాయిలు ఉన్నాయి.
వాస్తవం: అబద్దాలను అందంగా వండి వడ్డించడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి దిట్ట.గత మూడేళ్లలో గత ఏడాది సెప్టెంబర్‌లో ఒకేఒక సారి మాత్రమే అరకొరగా ఇన్సెంటివ్‌లు విడుదలచేశారు. ఎంఎస్ ఎంఇలు,స్పిన్నింగ్ మిల్లులకు సుమారు 2వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉండగా, 1124 కోట్లు ఇస్తున్నట్లు ఫుల్ పేజి ప్రకటనలు ఇచ్చి.. చివరకు రూ.680 కోట్లు ఇచ్చి మిగతా సొమ్ము కరెంటు బిల్లుల్లో జమచేస్తామని చెప్పారు. ఆ సొమ్ము కూడా ఇంతవరకు జమచేయలేదు.
అబద్దం`2: చంద్రబాబునాయుడు ఎంఎస్‌ఎంఇ రంగాన్ని ఖూనీ చేశారు. మేం ప్రోత్సహకాలు ఇచ్చి వారికి దన్నుగా నిలుస్తున్నాం.
వాస్తవం: ఎంఎస్‌ఎంఇలకు చంద్రబాబునాయుడు హయాంలో గతంలో ఎన్నడూ ఇవ్వనివిధంగా ప్రోత్స హకాలు ఇచ్చారు. మొత్తం పరిశ్రమలకు 2014-19 నడుమ రూ.3675 కోట్ల రూపాయలు విడుదల చేస్తే, అందులో ఎంఎస్‌ఎంఇలకు 1,816 కోట్లు విడుదలచేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలో స్పష్టంగా పేర్కొన్నారు. గత పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అసెంబ్లీలో ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో టిడిపిహయాంలో 39,213 ఎంఎస్‌ఎంఇల ద్వారా 4,19,549 ఉద్యోగాలు, 237 భారీ అండ్ మెగా పరిశ్రమలద్వారా 93వేల 802 పరిశ్రమలు వచ్చా యని సెలవిచ్చారు. మీరు అసెంబ్లీ సాక్షిగా టిడిపి ప్రభుత్వంపైన, చంద్రబాబునాయుడుపై విషయం చిమ్ముతున్నారనడానికి ఇంతకంటే ఏం సాక్ష్యం కావాలి?
అబద్దం`3: ‘గడిచిన మూడేళ్లో అభివృద్ధి దిశగా అనేక అడుగులు పడ్డాయి. బల్క్ డ్రగ్స్ కోసం దేశంలో 17 రాష్ట్రాలు పోటీపడ్డాయి. 17 రాష్ట్రాలతో పోటీ పడి బల్క్‌డ్రగ్స్ పార్క్ సాధించాం. బల్క్‌డ్రగ్ పార్క్ వద్దని చంద్రబాబు కేంద్రానికి లేఖలు రాశారు. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుతో 30వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. బల్క్‌డ్రగ్ పార్క్ వల్ల ఎలాంటి పొల్యూషన్ ఉండదు.
వాస్తవం: కాకినాడ తీరంలో బల్క్ డ్రగ్ పార్కువల్ల పర్యావరణం దెబ్బతిని మత్స్యసంపదకు ముప్పువా టిల్లుతుందని, లక్షలాది మత్స్యకారుల జీవనోపాథి దెబ్బతింటుందని మాత్రమే యనమల లేఖరాశారు. దీనివల్ల ల్యాండ్, ఎయిర్, వాటర్ పొల్యూట్ అవుతుంది.ప్రమాదకరం కావడంతో యూరప్, కెనడా, ఆస్ట్రేలియాలు బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీకి అనుమతులు ఇవ్వకూడదని నిర్ణయించారు.
అసలు విషమిటంటే తమ బినామీ అరబిందో సంస్థకు లబ్ధి చేకూర్చేందుకు, కేంద్రం ఇచ్చే వెయ్యి కోట్ల ఇన్సెంటివ్‌లు కొట్టేసేందుకు వేసిన పన్నాగమే ఇది. అన్ని భద్రతా ప్రమాణాలతో గతంలో ఇక్కడ దివీస్ ఫార్మాకు ఇస్తే అనుమతిస్తే ప్రతిపక్షనేత జగ న్‌రెడ్డి హేచరీలకు ముప్పు ఏర్పడుతుందని పాదయాత్రలో గగ్గోలు పెట్టారు. ఫార్మా పరిశ్రమకంటే బల్క్ డ్రగ్ ఎన్నోరెట్లు ప్రమాదకరమైంది.ఇప్పుడు పొల్యూ షన్ ముఖ్యమంత్రికి ఎందుకు గుర్తురావడం లేదు?
అబద్దం`4: కొద్ది రోజుల క్రితమే గ్రానెట్ పరిశ్రమల కు ప్రోత్సాహకాలు ప్రకటించాం. 75శాతం ఉద్యో గాలన్నీ కూడా స్థానికులే ఇవ్వాలని చట్టం చేశాం కాబట్టి..ఆబాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంది. స్కిల్ డెవలప్‌మెంట్ కోసం ప్రత్యేక దృష్టిపెట్టాం.పారదర్శ కంగా పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తున్నాం. మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నాం. అందుకే ప్రభుత్వంపై ఓ కాన్ఫిడెన్స్ పెరిగింది.
వాస్తవం: భారీగా పెంచిన రాయల్టీలు, కక్షసాధింపుతో మూసివేసిన గ్రానైట్ యూనిట్ల కారణంగా ఒక్క ప్రకాశం జిల్లాలోనే 50వేలమంది ఉపాథి కోల్పోయారు. ఇంకా సిగ్గులేకుండా గ్రానైట్ పరిశ్రమను ప్రోత్సహించామని చెబుతారా? గతంలో పరిమాణం ఆధారంగా రాయల్టీ నిర్ణయిస్తే, ప్రస్తుతం వెయిట్ ఆధారంగా రాయల్టీ నిర్ణయించి పరిశ్రమ పై కోలుకోలేని దెబ్బతీశారు. దీనివల్ల దాదాపు 50 శాతానికిపైగా రాయల్టీ చార్జీలు పెరిగాయన్న వాస్తవం.
అబద్దం`5: మా ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి లో మద్దతు ఇస్తోంది. చంద్రబాబు హయాం లో పారిశ్రామికవేత్తలకు ఎందుకు కాన్ఫిడెన ఇవ్వలేకపోయారు. కారణం నాకు ఎంత అంటూ కమీషన్లు తీసుకోవడం వల్లే పారి శ్రామికవేత్తలు రాష్ట్రానికి గతఐదేళ్లు రాలేకపోయారు. మేం పరిశ్రమదారుల్లో నమ్మకాన్ని కలిగిస్తున్నాం.
వాస్తవం: లక్షలాదిమందికి ఉపాథి కల్పించే అమర్ రాజా,జువారీ సిమెంట్స్ వంటి వాటి ని కక్షపూరితంగా రద్దుచేసి కార్మికులను రో డ్డున పడేయాలని చూశారు.మీరు పరిశ్రమ ల ఉద్దారకులా? టిడిపి హయాంలో అనం తపురంలో కియా, జాకీ, చిత్తూరులో అపో లో టైర్స్, ఫాక్స్ కాన్, కార్బన్, డిక్సన్ వంటి పరిశ్రమలను తెచ్చారు. మీరు తెచ్చిన సూట్ కేసు కంపెనీల్లాంటివి కాదు.
` అనంతపురంలో పేజ్ ఇండస్ట్రీస్ పెట్టాలనుకున్న జాకీ బనియన్లు, డ్రాయర్ల పరిశ్రమ కూడా వైసిపి నేతల దందాలకు భయపడి పరారైంది. ఈ కంపె నీకి టిడిపి ప్రభుత్వ హయాంలోనే భూకేటాయిం పులు చేసినా కమిషన్లకోసం వేధించి పారదోలారు.
` ఫార్చూన్ – 500 కంపెనీల్లో ఒకటైన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ విశాఖలో భారీగా పెట్టుబడి పెట్టేందుకు టిడిపి ప్రభుత్వ హయాంలో ఒప్పందం కుదిరింది. ఈ కంపెనీ వస్తే రాష్ట్రంలో పెట్టుబడుల వాతావరణమే మారిపోయేది.
అబద్దం`6: వైసిపి ప్రభుత్వ ప్రోత్సాహకర విధానాల వల్ల మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుటి నుంచి ఈ ఏడాది జూన్ వరకు ఉత్పత్తి ప్రారంభించిన భారీపరిశ్రమలు 99ఉన్నాయి.ఇందులో పెట్టుబడులు రూ.46,280కోట్లు కాగా,వాటి ద్వారా 60,241 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. ఎంఎస్‌ఎంఈలో మరో 35181ఉత్పత్తి ప్రారంభించాయి. వీటిలో రూ.9742 కోట్ల పెట్టుబడుల తో అక్షరాల 2,11,374 మందికి ఉద్యోగ అవకా శాలు వచ్చాయి.
వాస్తవం: తెలుగుదేశం హయాంలో దాదాపు చివరి దశ నిర్మాణంలో ఉన్న పరిశ్రమలను స్టిక్కర్లు వేసు కోవడానికి అలవాటుపడిన జగన్‌రెడ్డి తమ ఖాతా లో వేసుకున్నారు. ఎటువంటి సిగ్గూ, లజ్జా లేకుం డా 13,500 కోట్లరూపాయల విలువైన కియా పరిశ్రమను కూడా తామే తెచ్చామని చెప్పుకున్నా రు. ఇంతకంటే దారుణమేమైనా ఉంటుందా?
అబద్దం`7: పారిశ్రామిక రంగంపై మన ప్రభుత్వం చూపిన చొరవతో పెట్టుబడులు వెల్లువలా వచ్చాయి. ఏటా సగటున మెరుగైన పెట్టుబడులు సమకూ రాయి.భారీపరిశ్రమల్లో రూ.41,241కోట్లు పెట్టు బడులు వచ్చాయి. చంద్రబాబు హయాంలో ఐదేళ్ల లో రూ.59,960 కోట్లతో పెట్టుబడులు వచ్చాయి. వైసిపి హయోంలో ఏటా 12,700 కోట్లరూపాయ ల భారీపరిశ్రమలు వస్తే, చంద్రబాబు హయాంలో ఏటా సగటున రూ.11,994 కోట్ల పెట్టుబడులు మాత్రమే సమకూరాయి.
వాస్తవం: టిడిపి హయాంలో గౌతమ్‌రెడ్డి అసెంబ్లీలో చెప్పిన 237 భారీ పరిశ్రమలు కాకుండా, 1,70, 036 కోట్ల రూపాయల విలువైన 91 భారీ, మెగా పరిశ్రమలు స్టేట్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డులో అనుమతిపొంది ప్రభుత్వం దిగిపోయేనాటికి వివిధ స్టేజిల్లో ఉన్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రంలో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొనడం జరి గింది. జగన్‌రెడ్డి చెబుతున్న ఏటా 11వేల 900 కోట్లరూపాయల పరిశ్రమలు మాత్రమే టిడిపి హయాంలో వచ్చాయన్న మాట పచ్చి అబద్దం.
అబద్దం`8: రాష్ట్రంలో మూడు పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి జరుగుతోంది.వీటిని సాధ్యమైనంత వేగం గా పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా యువతకు ఉపాధి అవకాశా లు కల్పించేందుకు రెండు స్కిల్ యూనివర్సిటీలు, 30 స్కిల్ పాలిషింగ్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నాం.
వాస్తవం: పారిశ్రామిక కారిడార్లను తెలుగుదేశం హయాంలోనే ప్రారంభించి భూసేకరణ పనులు వేగవంతంచేశారు. రాష్ట్రంలోని మూడు కారిడార్ల లో జగన్‌రెడ్డి వచ్చాక కనీసం 50శాతం భూసేక రణ కూడా పూర్తిచేయలేదు. కర్నూలు జిల్లా ఓర్వ కల్లు ఇండస్ట్రియల్ పార్కులో 10వేల ఎకరాలు అవసరమని కేంద్రం చెబితే తొలుత ఇస్తామని అం గీకరించి, తర్వాత 5వేల ఎకరాలు మాత్రమే ఇస్తా మని, మిగితాది తాము అభివృద్ధి చేసుకుంటామని చెప్పారు. ఇలాగైతే కష్టమని కేంద్రమంత్రి పార్ల మెంటు సాక్షిగా సమాధానమిచ్చారు. ఇదేనా కారి డార్ల అభివృద్ధి అంటే?
అబద్దం`9: స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మనకు 3,97,128 ఉద్యోగాలు ఉన్నాయి. 2014-2019 వరకు చంద్రబాబు హయాంలో 34,108 ఉద్యోగా లు మాత్రమే ఇచ్చారు. మన ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ మూడేళ్ల కాలంలోనే 2,06,638 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. అంటే సగం ఉద్యో గాలు మనమే ఇచ్చాం. ఇవికాక కాంట్రాక్ట్ రంగం లో 37,908, అవుట్ సోర్స్ రంగంలో 3,71,777 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. మొత్తంగా 6,16, 323 మందికి ఉద్యోగాలు ఇచ్చాం.
వాస్తవం: స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తూ గ్రామ సచివాలయాలు, వాలంటర్లతో వైసిపి కార్యకర్తలతో నెట్ వర్క్ ఏర్పాటు చేసుకొన్నారు. గ్రామ సచివాలయాలు, వాలంటీర్లకు కలిపి 3,70,000 ఉద్యోగాలిచ్చినట్లు చూపుతున్నారు. ఇక ఆర్టీసిని విలీ నం చేసిన చూపి అప్పటికే ఉన్న 51వేల ఉద్యో గాలను కొత్తగా ఇచ్చినట్లు చూపుతునారు. ఇక మందుషాపుల్లో కలెక్షన్ల కోసం పెట్టుకున్న జగన్‌రెడ్డి మనుషులను కూడా అవుట్ సోర్సింగ్‌లో చూపుతున్నారు. అవుట్ సోర్సింగ్‌లో 3,71, 777 ఉద్యోగాలిచ్చామని చెబుతున్న జగన్.. కేవలం 91వేల మందిని మాత్రమే ఆప్కాస్ కిందకు చేర్చడం ఏమిటి? దీనినిబట్టే ఆయన చెబుతున్నదంతా అవాస్తమని తేలడం లేదా? దాదాపు రెండున్నర లక్షలమందికి పైగా ఉన్నత ఉద్యోగార్థులుగా తీర్చిదిద్దిన టిడిపి హయాంలో స్కిల్ డెవలప్ మెంట్ వ్యవస్థపై విషం చిమ్మి కొత్తగా తాము స్కిల్ డెవలప్ సెంటర్లు పెట్టా మని చెప్పడం మభ్యపెట్టడమే.
అబద్దం`10: స్వయం ఉపాధి రంగంలో ఏకం గా 55,57,939 మందికి స్వయం ఉపాధి రంగంలో మనం చేయిపట్టుకుని నడిపిస్తున్నాం.
వాస్తవం: జగన్‌రెడ్డి ప్రభుత్వం గతమూడేళ్లుగా చేపట్టిన అవినీతి, విధ్వంసక విధానాల కారణంగా రాష్ట్రంలో ఒక్కభవన నిర్మాణరంగంలోనే 50లక్షలమంది ఉపాథి కోల్పోయారు. ఇవిగా అమరావతిలో పనులు నిలిపివేయడంవల్ల 60వేలమంది కార్మికులు పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లారు.రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డి అధికారం లోకి వచ్చాక 10లక్షల కోట్లరూపాయల విలువైన పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లి కోటిమందికి పైగా ఉపాథి అవకాశాలు కోల్పోయారు.
అబద్దం`11: కోవిడ్ సమయంలో నిర్వహించిన పారిశ్రామికర్వేలో ఏపీ నంబరవన్ స్థానంలో నిలిచింది.
వాస్తవం: 2020-21లో రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి రేటు-3.26గానమోదైతే కోవిద్‌లో కూడామేమే ముందున్నామని సిగ్గులేకుండా చెబుతున్నారు. కరోనా కారణంగా పరిశ్రమలను మూసివేయాల్సివచ్చింది,కనీసం విద్యుత్ చార్జీలైనా మినహాయించండి మహాప్రభో అని కోరితే కనీస కనికరం లేకపోగా.. చివరకు అవితీసుకొచ్చి ప్రోత్సాహకాల్లో కలపడం మీరు పారిశ్రామిక వేత్తలకు చేసిన మహోపకారం జగన్‌రెడ్డీ?