• ఆత్మకూరు నియోజకవవర్గం గోగులపల్లె గ్రామ రైతులు యువనేత లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.
• మా గ్రామంలో రైతులంతా బోరు బావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నాం.
• గ్రామంలో అత్యధికంగా మిరప పంట పండిస్తున్నాం. మర్చికి ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించడం లేదు.
• పురుగుమందులు, ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.
• వ్యవసాయ ఖర్చులు పెరిగడం, మద్దతు ధర లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నాం.
• ఆరుగాలం పండించిన పంటను దళారులకు తెగనమ్మకోవాల్సి వస్తోంది.
• వైసీపీ ప్రభుత్వంలో డబ్బులు కట్టినా విద్యుత్ కనెక్షన్,సకాలంలో ట్రాన్స్ ఫార్మర్లు ఇవ్వడం లేదు.
• మీరు అధికారంలోకి వచ్చాక సబ్సిడీ ఎరువులు, పురుగుమందులు, డ్రిప్ ఇప్పించాలని కోరుతున్నాం.
నారా లోకేష్ స్పందిస్తూ…
• జగన్మోహన్ రెడ్డి చేతగాని పాలన రైతుల పాలిట శాపంగా మారింది.
• నాలుగేళ్లుగా తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన రైతులు ఆత్మహత్యలకు చేసుకుంటున్నారు.
• దేశం మొత్తమ్మీద ఎపి రైతులు అప్పుల్లో మొదటి స్థానం, రైతు ఆత్మహత్యల్లో 3వస్థానంలో ఉన్నారు.
• రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా దళారులను ప్రోత్సహిస్తున్నారు.
• కల్తీవిత్తనాలు, ఎరువులు, పురుగుమందుల మాఫియాను పెంచి పోషిస్తున్నారు.
• టిడిపి అధికారంలోకి వచ్చాక ఎరువులు, పురుగుమందుల ధరలను అదుపులోకి తెస్తాం.
• కల్తీవిత్తనాల మాఫియాపై ఉక్కుపాదం మోపి, ఎపి సీడ్స్ ద్వారా నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేస్తాం.
• పంట పెట్టుబడులను తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తాం. దళారీ వ్యవస్థకు చరమగీతం పాడతాం.