చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

రాష్ట్రానికి మంచిరోజులు వస్తున్నాయి

ఉగాది వేడుకల్లో చంద్రబాబు ఉద్ఘాటన

by చైతన్యరధం
Apr 10, 2024 at 7:03am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
రాష్ట్రానికి మంచిరోజులు వస్తున్నాయి
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • కొత్త ఏడాదిలో ప్రజలకు సాధికారత రావాలి..రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలి
  • బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల క్షేమమే లక్ష్యంగా త్వరలో కూటమి మేనిఫెస్టో
  • నదుల అనుసంధానంతో ప్రతి ఎకరాకూ నీళ్లు…
  • వైసీపీ ప్రభుత్వం కనీసం తాగునీళ్లూ ఇవ్వలేకపోతోంది

అమరావతి(చైతన్యరథం): ఈ కొత్త ఏడాదిలో రాష్ట్ర ప్రజలకు సాధికారత రావాలని…తద్వారా రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆకాక్షించారు. ఒక ఆశయంతో, ఉత్సాహంతో చేసే ప్రతి పనీ నెరవేరాలని, ప్రతి ఒక్కరి కృషికి ఫలితం రావాలన్నారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఉగాది వేడుకల్లో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగువారందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ప్రజలకు సంక్షేమంతో పాటు అభివృద్ధి, శాంతి భద్రతలు ఉండాలన్నారు. సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని మంచికోసం ఖర్చు చేయడం అంతే అవసరం. వైశ్యులు వ్యాపారం చేస్తారు…వ్యాపారంలో వచ్చిన ఆదాయంలో కొంత సంక్షేమానికి ఉపయోగిస్తారు. అదే అలవాటు తెలుగుజాతి మొత్తానికి రావాలి. సంపాదనలో తెలుగువారికి మించిన వారు ఎక్కడా లేరు. సంపాదనతో పాటు సేవాభావం కూడా అవసరం. అలాంటప్పుడే రాజకీయాల్లో ఉన్నత పదవుల్లో ఉంటారని చంద్రబాబు అన్నారు.

ప్రజలకు ఐదేళ్లుగా కారం, చేదు మాత్రమే మిగిలాయి
ఉగాది అనగానే మనకు ఉగాది పచ్చడి గుర్తొస్తుంది. షడ్రుచులతో దీన్ని తయారు చేస్తారు. తీపి, వగరు, చేదు, పులుపు, ఉప్పు, కారం రుచులతో పచ్చడి చేస్తారు. మన జీవితంలో కష్టాలుంటాయి…ఇబ్బందులుంటాయి. వీటన్నింటికీ ముందుగా సిద్ధమవ్వడానికే తెలుగు ఏడాది తొలిరోజున ఉగాది పచ్చడితో ప్రారంభిస్తారు. ఐదేళ్లుగా ప్రజలకు కారం, చేదు మాత్రమే మిగిలాయి. నిద్ర లేస్తే భయం…రోజు ఎలా గడుస్తుందో చెప్పలేం. ఇంటికి భద్రంగా తిరిగి వస్తారన్న గ్యారెంటీ లేదు. మన ఆస్తులు మనకు ఉంటాయో లేదో తెలీదు. మెడపై కత్తిపెట్టి ఇస్తావా…చస్తావా అని బెదిరించేవారు. చరిత్రలో బకాసురుడి పోరు పడలేక నాడు ఊరికొకరు బండెడు అన్నం పంపించేవారు…నేడు రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి. ఎక్కడ చూసినా ప్రజల్లో అశాంతి, అభద్రత నెలకొన్నాయి. జగన్‌ను ప్రజలు దించేయబోతున్నారు. మంచిరోజులు రాబోతున్నాయని చంద్రబాబు చెప్పారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 16-07-2026

చైతన్యరధం ఈ పేపర్ 15-07-2026

చైతన్యరధం ఈ పేపర్ 14-07-2026

మరింత పేదలుగా మారిన ప్రజలు
రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలు తగ్గిపోయి…పేదలు మరింత పేదలుగా మారారు. జగన్‌ రూ.10 లు ఇచ్చి రూ. 100 లాగుతున్నాడు. ఆర్థిక పరిస్థితి ఇంకా దిగజారింది. పేదలు అప్పులపాలయ్యారు. ప్రభుత్వం ఇచ్చే సాయం ఎంతో అవసరం…అయితే విధానాలు సరిగా లేకపోతే అది ఉపయోగపడదు. ఈ ఉగాదితో ప్రజలకు మళ్లీ మంచి రోజులు రాబోతున్నాయి. 2014లో రాష్ట్ర విభజన జరిగింది…హైదరాబాద్‌ తెలంగాణకు వెళ్లింది. పింఛన్లయినా ఇవ్వగలమా అన్న సందిగ్ధంలో ఉన్నాం. అమరావతిని అభివృద్ధి చేసి హైదరాబాద్‌ కంటే మిన్నగా చేయాలని రూపకల్పన చేశాం. పోలవరం నిర్మాణం కూడా వేగవంతం చేశాం. రాష్ట్రానికి రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం….6 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. అభివృద్ధి చేయడమే కాదు..సంపద సృష్టించి ప్రజలకు చేరవేయాలి. ప్రజలకు వంద సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. సంక్షేమాన్ని తీసుకొచ్చి ఆదుకుంది టీడీపీనే అని చంద్రబాబు చెప్పారు.

తాగునీరు ఇవ్వలేని సీఎం 3 రాజధానులు కడతాడా?
కరువు నివారణకు ఏపీలో అవకాశం ఉంది. నదుల అనుసంధానంతో పాటు డ్రిప్‌ ఇరిగేషన్‌ అందిస్తే ప్రతి ఎకరాకు నీరు అందించవచ్చు. రాష్ట్రంలో భూగర్భ జలాలు ఇంకిపోయాయి…జలాశయాల్లో నీళ్లు లేవు. కర్నూలు జిల్లాలో వారానికి ఒకసారి నీళ్లు వస్తాయి…ప్రమాదకర పరిస్థితులు వచ్చాయి. ప్రజలకు తాగునీరు ఇవ్వలేని ముఖ్యమంత్రి 3 రాజధానులు కడతాడా.? ఐదేళ్లలో మంచి రోజులు కాదు….నరకం ఏంటో ప్రజలు చూశారు. తాగడానికి నీళ్లు లేవు…భూగర్భ జలాలు లేవు. భూగర్భ జలాలు పెంచడానికి ఇంకుడు గుంతలు మనం తవ్వించాం. ప్రకృతిని పెంచడానికి కృషి చేశాం. పట్టిసీమ ద్వారా నీళ్లు ఆదా చేశాం. ఆ నీటిని శ్రీశైలం నుండి హంద్రీనీవా ద్వారా రాయలసీమకు అందించాం. అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం ప్రజలపై మోయలేనతంగా పన్నుల భారం మోపింది. గంజాయి, డ్రగ్స్‌తో రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తోంది. ప్రశ్నించేవారిపై దాడులకు పాల్పడుతోంది. హింసా రాజకీయాలు, ఎర్రచందనం, ఇసుక మాఫియా దెబ్బకు రాష్ట్రం అల్లాడిపోతోంది. ఈ రోజు నుండి 34 రోజుల్లో తెలుగుజాతికి పూర్వవైభవం రావాలి. రాజకీయం లేకుండా పంచాంగం లేదు. పంచాంగం స్ఫూర్తిని ఇస్తుంది…ఆ స్ఫూర్తిని అమలు చేసేది…విశ్లేషించి మంచిని ముందుకు తీసుకెళ్లే శక్తి రాజకీయాల్లో ఉందని చంద్రబాబు అన్నారు.

2047 నాటికి ప్రపంచంలో అగ్రగామిగా భారత్‌
జగన్‌ వచ్చాక రూ.14 లక్షల కోట్ల అప్పులు చేశారు. రూ.1.5 లక్షల కోట్ల మేర కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బకాయి ఉంది. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని టీడీపీ, జనసే, బీజేపీ జట్టుకట్టాయి. ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి కేంద్ర సహకారం అవసరం. పార్టీ ఆవిర్భావం తర్వాత 22 ఏళ్లు అధికారంలో ఉన్నాం…ఎలాంటి వివక్ష లేకుండా పాలించాం. ప్రపంచం నాలెడ్జ్‌ ఎకానమీతో ముందుకు వెళ్తోంది. 2047 నాటికి దేశం ప్రపంచంలోనే నెంబర్‌ 1 అవుతుంది. ప్రస్తుతం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో దేశం 5వ స్థానంలో ఉంది. 2030 నాటికి 3వ స్థానానికి చేరుతుంది..2047 నాటికి మొదటి స్థానానికి వెళ్తుంది. ప్రపంచంలో నెంబర్‌-1 స్థాయిలో తెలుగుజాతి ఉండాలి. తలసరి ఆదాయంలో నెంబర్‌-1గా ఉన్నారు…ఆరోగ్యంలో ఉంటారు. పేదరికం లేని సమాజం రావాలి…ఇది ఎన్టీఆర్‌ ఆశయం.. పేదరికం లేని సమాజాన్ని నేను తప్పకుండా చూస్తాను. ఇవన్నీ చేయాలంటే కేంద్ర సహకారం అవసరం…వచ్చేది కూటమి ప్రభుత్వమే. సమాజంలో సైకో పార్టీకి స్థానం లేకుండా చేయాలని చంద్రబాబు ఉద్ఘాటించారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సంక్షేమమే లక్ష్యంగా త్వరలో కూటమి మేనిఫెస్టో
కూటమి ప్రకటించిన సూపర్‌-6 పథకాల ప్రచారం ఇంటింటికీ వెళ్తే ప్రత్యర్థులకు డిపాజిట్లు రావు. ప్రభుత్వం అంటే సంపద సృష్టించాలి…అభివృద్ధి చేయాలి. త్వరలోనే ఎన్నికల మేనిఫెస్టో తీసుకొస్తాం. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమమే లక్ష్యంగా మేనిఫెస్టో ప్రకటిస్తాం. వృద్ధులు, వితంతువులకు పింఛన్‌ విధానాన్ని దివంగత ఎన్టీఆర్‌ తెచ్చారు. 2014లో రూ.200 ఉన్న పింఛన్‌ను రూ.2,000 వేలు చేసింది టీడీపీ. సీఎం జగన్‌ నోరు తెరిస్తే అబద్ధాలే. కూటమి అధికారంలోకి రాగానే పింఛన్‌ను రూ.4 వేలకు పెంచి 1వ తేదీన ఇళ్లవద్దకే తెచ్చి ఇస్తాం. ఒక నెలలో తీసుకోకపోతే తరువాతి నెలలో అందిస్తాం. వికలాంగులకు రూ.6 వేలు పెన్షన్‌ ఇస్తాం. వాలంటీర్ల జీవితాలతో సీఎం ఆడుకుంటున్నారు. వాలంటీర్లందరూ తమ పార్టీ వాళ్లే ఉన్నారని జగన్‌ అన్నారు. వాలంటీర్లతో జగన్‌ లబ్ధిపొందాలని చూశాడు. పింఛన్లు ప్రభుత్వ ఉద్యోగులతో ఇప్పించాలని ఈసీ నిర్ణయం తీసుకుంటే…జగన్‌ శవ రాజకీయాలు చేశాడు. నిధులు విడుదల చేయకుండా మండుటెంటల్లో వృద్ధులను సచివాలయాల చుట్టూ తిప్పటంతో కొందరు చనిపోయారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

Previous Post

పత్రాలు తగులబెడితే చేసిన పాపాలు పోతాయా?

Next Post

వాలంటీర్ల జీతం రూ. 10 వేలు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 16-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 16-07-2026

కార్యకర్త
@ July 16, 2026
చైతన్యరధం ఈ పేపర్ 15-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 15-07-2026

కార్యకర్త
@ July 15, 2026
చైతన్యరధం ఈ పేపర్ 14-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 14-07-2026

కార్యకర్త
@ July 14, 2026
రికార్డుల గోల్‌మాల్‌లో వైసీపీ నేత!
ఆంధ్రప్రదేశ్

రికార్డుల గోల్‌మాల్‌లో వైసీపీ నేత!

చైతన్యరధం
@ July 14, 2026
ఆంధ్రప్రదేశ్

గోదావరి డెల్టాకు శాశ్వత భద్రత

చైతన్యరధం
@ July 14, 2026
ఆంధ్రప్రదేశ్

ఫాస్ట్ ట్రాక్‌లో పోలవరం పనులు

చైతన్యరధం
@ July 14, 2026
చైతన్యరధం ఈ పేపర్ 13-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 13-07-2026

కార్యకర్త
@ July 13, 2026
సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్

సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు

చైతన్యరధం
@ July 13, 2026
Load More

ముఖ్య వార్తలు

గోదావరి డెల్టాకు శాశ్వత భద్రత

చైతన్యరధం
@ July 14, 2026
ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం

ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం

చైతన్యరధం
@ July 10, 2026
హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీలు పెంపు

హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీలు పెంపు

చైతన్యరధం
@ July 9, 2026
హస్తకళల ప్రోత్సాహమే సంకల్పం

హస్తకళల ప్రోత్సాహమే సంకల్పం

చైతన్యరధం
@ July 8, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

రికార్డుల గోల్‌మాల్‌లో వైసీపీ నేత!

రికార్డుల గోల్‌మాల్‌లో వైసీపీ నేత!

చైతన్యరధం
@ July 14, 2026

గోదావరి డెల్టాకు శాశ్వత భద్రత

చైతన్యరధం
@ July 14, 2026

ఫాస్ట్ ట్రాక్‌లో పోలవరం పనులు

చైతన్యరధం
@ July 14, 2026
సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు

సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు

చైతన్యరధం
@ July 13, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist