- సీఎం సహాయ నిధికి రూ. 58,58,999 విరాళం
- ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఆధ్వర్యంలో అందజేత
విజయవాడ(చైతన్యరథం): విజయవాడలో వరదతో ఇబ్బంది పడుతున్న బాధితులకు అండగా నిలవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన పిలుపునకు తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గ ప్రజలు, ప్రముఖులు, నాయకులు స్పందించారు. వరద బాధితులను ఆదుకునేందుకు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు ఆధ్వర్యంలో తమ వంతు సహకారంగా నియోజకవర్గ నాయకులతో కలిసి 58 లక్షల 58వేల 999 రూపాయలు సేకరించారు. విరాళాలు అందించిన దాతలు అంతా కలిసి ఎమ్మెల్యే వెంకటరాజు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబును మంగళవారం కలసి సీఎం సహాయ నిధికి విరాళం మొత్తం అందజేశారు. విపత్కర పరిస్థితుల్లో మానవత్వం చాటుకుని విరాళాలు అందించిన దాతలను, నాయకులను సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు.