.గోరంట్ల నోరుపారేసుకుంటే జగన్‌రెడ్డి చెవుల్లో సీసం పోసుకున్నాడా?
.రౌడీలను పార్లమెంటుకి పంపిన చరిత్ర జగన్ రెడ్డిది
.టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు
అమరావతి: గతంలో గొప్ప నాయకులు ప్రాతినిథ్యం వహించిన పార్లమెంటు ప్రతిష్ఠ నేడు గోరంట్ల మాధవ్ వంటి వారితో దిగజారుతోందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 75వ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకుంటున్నవేళ ప్రతి భారతీయుడు స్వేచ్ఛగా తిరుగుతున్నందుకు ఆనందపడుతున్న సమయంలో దేశంలోని అత్యున్నత పార్లమెంటుకి వైసీపీ ఓ ఆంబోతును ఎంపీగా పంపించినందుకు బాధపడాల్సి వస్తోందన్నారు. గోరంట్ల మాధవ్ నగ్న వీడియో చూసి తెలుగు ప్రజలే కాకుండా మొత్తం భారతదేశ ప్రజలు అసహ్యించుకుంటున్నట్లు తెలిపారు. మాధవ్ ప్రవర్తన వల్ల దేశం పరువే పోయిందన్నారు. గోరంట్ల మాధవ్ చేసిన పనిని వైసీపీ నాయకులు, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సమర్థించడాన్ని ప్రజలు ఛీదరించుకున్నట్లు పేర్కొన్నారు. ఈ వీడియో విషయమై రాష్ట్రంలో, దేశంలో చర్చించుకుంటున్నా ముఖ్యమంత్రి మాత్రం నోరు మెదపడం లేదన్నారు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రాష్ట్ర ప్రజల సమస్యల్ని ప్రజల ముందు ఉంచుతూ బోసడికే అన్నారని జగన్ రెడ్డికి కోపం వచ్చి, వారి కార్యకర్తలకు బీపీ వచ్చిందని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేశారని గుర్తు చేశారు. నేడు గోరంట్ల మాధవ్ చంద్రబాబు నాయుడు, లోకేష్ గురించి అనరాని మాటలు అంటుంటే జగన్ రెడ్డి చెవులలో సీసం పోసుకున్నాడా? అని ప్రశ్నించారు. రౌడీలను పార్లమెంటుకి పంపిన చరిత్ర జగన్ రెడ్డిది రౌడీలను ఏకం చేసి పార్లమెంటుకి పంపించిన చరిత్ర జగన్ రెడ్డిదన్నారు. సీఐగా గోరంట్ల మీసం మెలేసినప్పుడే ఆ మీసం తీసేసి ఉంటే రాష్ట్ర ప్రజలకు నేడు ఈ గతి పట్టి ఉండేది కాదని చెప్పారు. వైసీపీ ఎమ్మెల్సీ ఒకరు శవాలను డెలివరి చేస్తే, కొడాలి నానీ లాంటివారు పేకాట ఆడుకుంటే తప్పేంటని అడిగాడు, నాలుగు గోడల మధ్య ఎంజాయ్ చేస్తే తప్పేంటని సజ్జల అంటాడు… ఇలా మాట్లాడడం సబబా అని అడిగారు. ఇప్పటి వరకు ఏ మహిళ ఫిర్యాదు చేయలేదని అనంతపురం ఎస్పీ చెప్పి పోలీసుల దిగజారుడుతనాన్ని బయట పెట్టారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడును రాజకీయంగా ఎదుర్కోలేక పనికిరానివారిచే బూతులు తిట్టిస్తారా అని అడిగారు. కొడాలి నాని తిట్టి తిట్టి అలసి ఇంట్లో పడుకున్నాడని ఎద్దేవా చేశారు. వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపుతున్నాము, రిపోర్టు రాగానే గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకుంటామన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు ఎక్కడున్నాడని ప్రశ్నించారు. అనంతపురం ఎస్పీ ఈ కేసును మేం తేల్చలేమని చెప్పిన మాటను పట్టుకొని తనకు క్లీన్ చిట్ వచ్చిందని గోరంట్ల సంబరపడిపోవడం వింతగా ఉందన్నారు. గోరంట్ల మాధవ్ కు శిక్ష పడిన రోజునే రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవం దక్కుతుందని చెప్పారు. గోరంట్ల మాధవ్ పై రాష్ట్ర పోలీసులు చర్యలు తీసుకోవడంలేదని, కేంద్ర పోలీసులైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తల్లీచెల్లిని మోసం చేసినవాడికి రాష్ట్ర మహిళలను మోసం చేయడం ఓ లెక్కా అన్నారు. దేశ పరువు దక్కాలంటే గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకోవాలని పిల్లి మాణిక్యరావు డిమాండ్ చేశారు.