అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గురువారం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి సోషల్ మీడియాలో ఆసక్తికరంగా స్పందించారు. చంద్రబాబు సీఎం హోదాలో సంతకాలు చేస్తున్న ఫొటోను పంచుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న నాలో సగం, నా ప్రాణం నారా చంద్రబాబునాయుడు అంటూ ఎమోషనల్ గా ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక చంద్రబాబు చేసిన తొలి సంతకం… రాష్ట్ర ప్రగతికి, ప్రజా సంక్షేమానికి సంకేతం అని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. ఇచ్చిన హామీ మేరకు ఐదు ఫైళ్లపై సంతకాలు చేసి మాట నిలబెట్టుకున్నారని తెలిపారు.