చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

అతడే ఓ సైన్యం!

సంచలనాలు సృష్టిస్తోన్న తెలుగు’తేజం

by చైతన్యరధం
Jun 5, 2024 at 6:17am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
అతడే ఓ సైన్యం!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • తాత మహానాయకుడు..
  • తండ్రి దార్శనికుడు..
  • ఇరువురి పేరు నిలిపేలా.. లోకేష్‌
  • సంచలనాలు సృష్టిస్తోన్న తెలుగు’తేజం

అమరావతి (చైతన్యరథం): ఎండా వానా.. చలీ వడగాలీ.. అతని సంకల్పాన్ని నిరోధించలేకపోయాయి. వారమో, నెలో కాదు.. 226 రోజులపాటు 3132 కిలోమీటర్ల యువగళం పాదయాత్ర. అతడే ఓ సైన్యమయ్యాడు. పల్లెపల్లెకూ వెళ్లి పార్టీ శ్రేణుల్లో చైతన్య ఊపిర్లూదాడు. ప్రజల మనిషిగా ఎదిగాడు. అతడే.. మహానాయకుడి మనుమడు. దార్శనికుడి సుపుత్రుడు. యువనేత నారా లోకేష్‌. ఇపుడు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు కర్త, కర్మ, క్రియ అతనే. కార్యకర్తల సంక్షేమమే లక్ష్యంగా ఆ విభాగం బాధ్యతలు తీసుకుని పార్టీలో తన ప్రస్థానాన్ని విస్తరిస్తున్నాడు లోకేష్‌. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా తనదైన శైలిలో పార్టీ బలోపేతానికి కృషి చేశాడు. ఎమ్మెల్సీగా ఎన్నికై, మంత్రి పదవి చేపట్టి మూడుశాఖలను ప్రగతిపథంలో పరుగులు పెట్టించాడు. ప్రత్యక్ష రాజకీయాల్లో మంగళగిరి నియోజకవర్గంనుంచి 2019లో పోటీ చేసి 5 వేలు పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయాడు. తనను ఆదరించలేదని నియోజకవర్గాన్ని వదిలిపోలేదు. ఓడినచోటే గెలవాలనే పట్టుదలతో పడిలేచిన కెరటమయ్యాడు.

మంగళగిరి సెగ్మెంట్‌లో ప్రజలకు చేరువై సొంత నిధులతో 29 సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాడు. ప్రజల హృదయాలనే కాదు… నియోజకవర్గంలోనూ అత్యధిక మెజార్టీతో గెలిచి చరిత్ర సృష్టించారు. ‘సమాజమనే దేవాలయంలో ప్రజలే దేవుళ్లు’ అన్న తాత నినాదం, విజనున్న నాన్న విధానం పుణికిపుచ్చుకున్న నారా లోకేష్‌ `తెలుగుదేశం పార్టీని మరో 30 ఏళ్లపాటు తిరుగులేని ప్రజాశక్తిగా నడిపించగల దమ్ము ధైర్యం ఉన్న నేతగా వేనోళ్ల కీర్తిని అందుకుంటున్నాడు.నారా చంద్రబాబునాయుడు, భువనేశ్వరి దంపతులకు 1983 జనవరి 23న జన్మించాడు లోకేష్‌ నాన్నది నారావారి పల్లె. అమ్మది నిమ్మకూరు. బాల్యమంతా హైదరాబాద్‌లోనే గడిచింది. భారతీయ విద్యాభవన్స్‌ పబ్లిక్‌ స్కూల్‌, విద్యాశ్రమ్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేశారు. హైదరాబాద్‌లోని లిటిల్‌ ఫ్లవర్‌ జూనియర్‌ కాలేజీలో ఇంటర్మీడియెట్‌ పూర్తి చేశారు.
అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో ఎంబీఏ చేశారు. అమెరికాలో కార్నెగీ మెలన్‌ వర్సిటీలో బీఎస్సీ మేనేజ్మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ డిగ్రీ పొందారు. హెరిటేజ్‌ ఫుడ్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా, హెరిటేజ్‌ ఫిన్‌లీజ్‌ లిమిటెడ్‌ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. వరల్డ్‌ బ్యాంకు మద్దతుతో వివిధ దేశాల్లో అమలయ్యే కెపాసిటీ బిల్డింగ్‌ ప్రాజెక్ట్స్‌, ఈ గవర్నెన్స్‌, కనెక్టివిటీ సొల్యూషన్స్‌ అంశాలలో ప్రాజెక్టు మేనేజర్‌గా (2004-2006) పనిచేసిన నారా లోకేష్‌ స్వదేశానికి చేరుకున్నారు.
2013లో పూర్తిస్థాయి రాజకీయరంగ ప్రవేశంచేసి, 2014 టీడీపీ అధికారంలోకి రావడంలో కీలకపాత్ర వహించారు. 2024లో టీడీపీి కూటమి అధికారంలోకి రావడంలో నారా లోకేష్‌ పోషించిన పాత్ర ఎనలేనిది. మంగళగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికై 39ఏళ్లుగా అందని నియోజకవర్గంపై టీడీపీ జెండా ఎగురవేశాడు. టీడీపీ సభ్యత్వాల ద్వారా ప్రమాదబీమా, కార్యకర్తల సంక్షేమనిధి ఏర్పాటు చేసిన నారా లోకేష్‌, ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ద్వారా విద్య- వైద్య సేవలు అందిస్తున్నారు. టీడీపీ నాయకత్వ శిక్షణ శిబిరాల ద్వారా 25 వేలమంది యువనాయకుల్ని తయారు చేసిన కార్యక్రమ రూపకర్త కూడా నారా లోకేషే.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 14-07-2026

చైతన్యరధం ఈ పేపర్ 13-07-2026

సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు

2015లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులై 2018లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2018లో ఐటీ -ఎలక్ట్రానిక్స్‌, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 30ఏళ్ల వయస్సులోనే ముఖ్యమైన 3శాఖల మంత్రిగా నారా లోకేష్‌ చేసిన కృషికి జాతీయ, అంతర్జాతీయ, స్కోచ్‌ అవార్డులు దక్కాయి. ‘ఏ పొలిటికల్‌’ అనే సంస్థ ప్రకటించిన జాబితాలో ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన యువ నాయకుల్లో మొదటి 20 స్థానాల్లో నిలిచిన ఏకైక భారతీయుడు నాటి ఏపీ మంత్రి నారా లోకేష్‌. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో వినూత్న ఆలోచనలు, పాలనలో టెక్నాలజీ వినియోగం, ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించడంపై నారా లోకేష్‌కి సింగపూర్‌ విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ.. ఎస్‌ఆర్‌ నాథన్‌ ఫెలోషిప్‌ ప్రకటించటం విశేషం.
ప్రజల కోసం, రాష్ట్ర ప్రగతి కోసం అహరహం శ్రమిస్తున్న తెలుగుదేశం పార్టీ యువతేజం నారా లోకేష్‌. స్వచ్ఛరాజకీయాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ అనడం అతిశయోక్తి కాదు. అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి కల్పన, విద్య, వైద్య, మౌలిక, పారిశ్రామిక, వ్యవసాయ రంగాలపై స్పష్టమైన విజన్‌తో ఉన్న నారా లోకేష్‌… తాతకుతగ్గ మనవడు, తండ్రినిమించే తనయుడిగా ప్రజల మన్ననలు అందుకుంటున్నాడు.

రాజకీయ పద్మవ్యూహాన్ని ఛేదించిన సవ్యసాచి
స్టాన్‌ ఫోర్డులో చదివిన సాఫ్ట్‌ కుర్రాడు లోకేష్‌ చుట్టూ ఫ్యాక్షన్‌ పద్మవ్యూహం పన్నేద్దాం, అభిమన్యుడిలా చుట్టేద్దాం అనుకుంది జగనాసుర ముఠా. కుట్రలు, కుతంత్రాలు, తప్పుడు కేసులు -దాడులకి ఎదురొడ్డి నిలిచిన నారా లోకేష్‌ అభిమన్యుడు కాదు, అర్జునుడని అర్థం చేసుకోడానికి వైసీపీకి ఎంతోకాలం పట్టలేదు. క్రియాశీల రాజకీయాల్లో లోకేష్‌ ప్రవేశించిన నుంచీ.. అవినీతి ఆరోపణల్లేవు, ఇతరత్రా కేసులు ఏవీ లేవు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 22 తప్పుడు కేసులు బనాయించారు. హత్యకి గురైన విద్యార్థిని కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళితే కేసు, ట్రాక్టర్‌ నడిపాడని ఓ కేసు, కోవిడ్‌ గైడ్‌లైన్స్‌ ఉల్లంఘించాడని మరో కేసు.. స్టూలు ఎక్కి మాట్లాడాడని ఇంకో కేసు.. ఇలా కేసుల మీద కేసులు బనాయించారు. యువగళం పాదయాత్ర ఆరంభం నుంచీ అడ్డుకునేందుకు వైసీపీ సర్కారు చేయని ప్రయత్నంలేదు. భద్రత కుదించారు. ఉన్న పోలీసులు మైకు, స్టూలు లాక్కోవడం, మాట్లాడటానికి వీల్లేదని నోటీసులు ఇవ్వడం, కేసులు బనాయించడం చేశారు. మొదట్లోనే సాగనిస్తే పాదయాత్ర.. సాగనివ్వకుంటే దండయాత్ర అంటూ ప్రకటించిన నారా లోకేష్‌ ముందుకు సాగారు. ఓవైపు తనపై కేసులు, మరోవైపు తండ్రి అక్రమ అరెస్టు, ఇంకోవైపు టీడీపీ నేతలు -కార్యకర్తలపై తప్పుడు కేసులు. బెదిరిపోలేదు లోకేష్‌. న్యాయపోరాటాన్ని నమ్ముకున్నాడు.

ఢిల్లీలో మకాం వేసి న్యాయకోవిదులతో చర్చలు, మరోవైపు కేంద్రంతో అప్పుడే పొత్తు ఎత్తులు ముగించి వచ్చాడు. తాత ధైర్యం, తండ్రి దార్శనికత, మేనమామ దూకుడు కలగలిసిన నారా లోకేష్‌ జగనాసుర రాజకీయ పద్మవ్యూహాన్ని ఛేదించిన సవ్యసాచి. అభిమన్యుడు అనుకున్న వైసీపీ గ్యాంగుకి అర్జునుడిలా తయారయ్యాడు. టీడీపీ లీడర్లకి ధైర్యం, కేడర్‌కి అండ, పొత్తుల ఎత్తులు, అధికార అహంకారానికి ఎదురొడ్డి పోరాడి అభినవ అర్జునుడిగా రాజకీయ కురుక్షేత్రంలో కూటమిని విజయతీరాలకు చేర్చాడు. తెలుగుదేశం పార్టీని 30 ఏళ్లపాటు నిరంతరంగా నడిపించే రథసారథిóగా నిలిచాడు.

Previous Post

బూతునేతల మూతులు పగిలాయి!

Next Post

మంగళగిరిపై పసుపు జెండా

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 14-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 14-07-2026

కార్యకర్త
@ July 14, 2026
చైతన్యరధం ఈ పేపర్ 13-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 13-07-2026

కార్యకర్త
@ July 13, 2026
సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్

సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు

చైతన్యరధం
@ July 13, 2026
పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారు
ఆంధ్రప్రదేశ్

పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారు

చైతన్యరధం
@ July 13, 2026
ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు
ఆంధ్రప్రదేశ్

ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు

చైతన్యరధం
@ July 13, 2026
చైతన్యరధం ఈ పేపర్ 12-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 12-07-2026

కార్యకర్త
@ July 12, 2026
మళ్లీ కలుద్దాం
ఆంధ్రప్రదేశ్

మళ్లీ కలుద్దాం

చైతన్యరధం
@ July 12, 2026
గొడ్డలి పార్టీతో రాష్ట్రానికి తీవ్ర నష్టం
ఆంధ్రప్రదేశ్

గొడ్డలి పార్టీతో రాష్ట్రానికి తీవ్ర నష్టం

చైతన్యరధం
@ July 12, 2026
Load More

ముఖ్య వార్తలు

ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం

ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం

చైతన్యరధం
@ July 10, 2026
హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీలు పెంపు

హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీలు పెంపు

చైతన్యరధం
@ July 9, 2026
హస్తకళల ప్రోత్సాహమే సంకల్పం

హస్తకళల ప్రోత్సాహమే సంకల్పం

చైతన్యరధం
@ July 8, 2026
మాట నిలుపుకున్న సీఎం చంద్రబాబు

మాట నిలుపుకున్న సీఎం చంద్రబాబు

చైతన్యరధం
@ July 2, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు

సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు

చైతన్యరధం
@ July 13, 2026
పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారు

పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారు

చైతన్యరధం
@ July 13, 2026
ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు

ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు

చైతన్యరధం
@ July 13, 2026
మళ్లీ కలుద్దాం

మళ్లీ కలుద్దాం

చైతన్యరధం
@ July 12, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist