అమరావతి (చైతన్యరథం): సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు హై కోర్టులో ఊరట లభించింది. కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్(క్యాట్) ఉత్తర్వులను సస్పెండ్ చేసేం దుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఏబీవీపై సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ఇటీవల క్యాట్ ఉత్తర్వులు లివ్వడం తెలిసిందే. సస్పెన్షన్ ఎత్తివేత ఉత్తర్వులు నిలుపుదల చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. క్యాట్ ఉత్తర్వులను సస్పెండ్ చేసేందుకు నిరాకరిస్తూ ప్రభుత్వ అప్పీల్‌ను కొట్టివేసింది. రక్షణ పరికరాల కొనుగోలు వ్యవ హారంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల తో వైకాపా ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసింది. ఏబీవీ క్యాట్‌ను ఆశ్రయించి గా.. ఆయనపై ఏపీ సర్కారు విధించిన సస్పెన్షన్‌ను సమర్థించింది. అనంతరం ఏబీవీ హైకోర్టుకు ఆశ్రయించారు. దీనిపై ఉన్నత న్యాయస్థానం సస్పెన్షన్‌ను కొట్టివేసింది.
హై కోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది. సర్వీసులో ఉన్న అధి కారిని రెండేళ్లకంటే ఎక్కువ కాలం సస్పెన్షన్‌లో ఉంచొద్దని ఆదేశిస్తూ.. ఏబీ వెంకటేశ్వరరావుపై ఉన్న సస్పెన్షన్‌ను సుప్రీం కోర్టు రద్దు చేసింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలకు అను గుణంగా ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. తర్వాత కొద్ది రోజులకే గతంలో ఏ కారణంతో సస్పెండ్ చేశారో.. తిరిగి అదే కార ణంతో మరోసారి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఒకే కారణంతో ప్రభుత్వం తనను రెండుసార్లు సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఏబీ వెంకటేశ్వరరావు మళ్లీ క్యాట్‌ను ఆశ్రయించా రు. సుదీర్ఘ విచారణ జరిపిన క్యాట్.. ఆయన సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏబీవీకి వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని.. సస్పెన్షన్ కాలానికి జీతభత్యాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభు త్వాన్ని ఆదేశించింది. క్యాట్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఉన్నత న్యాయ స్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. క్యాట్ ఉత్తర్వుల ను సస్పెండ్ చేసేందుకు నిరాకరించింది.
పోస్టింగ్ ఇవ్వమంటూ సీఎస్‌ను కలిసిన ఏబీవీ
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సచివాలయంలో గురువారం సీఎస్ జవహర్‌రెడ్డిని కలిశారు. ఏపీ హైకోర్టు ఆదేశాల ప్రతిని సీఎస్‌కు అందజేశారు. కోర్టు ఉత్తర్వుల మేరకు పోస్టింగ్ ఇచ్చే అంశంపై త్వరితగతిన ఆదేశాలుఇవ్వాలని కోరారు. కోర్టు ఉత్తర్వుల ప్రతిని సీఈవో కార్యాలయంలో కూడా ఏబీవీ అందజేశారు.