- గత ఐదేళ్లలో రాష్ట్రానికి దక్కిన కేంద్ర సాయం కేవలం రూ.38 కోట్లు
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.91 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం హామీ
- నూతన వైద్య కళాశాలల నిర్మాణంలో జగన్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం
- నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలన్నింటినీ పూర్తి చేస్తాం
- మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టీకరణ
విజయవాడ(చైతన్యరథం): ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలో ఆయుష్ సేవల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మున్నెన్నడూ లేనివిధంగా రూ.90 కోట్ల 84 లక్షల మేర నిధులు అందించడానికి సమ్మతి తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ఆయుష్ విభాగానికి సమాచారం అందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ శుక్రవారం వెల్లడిరచారు. సచివాలయంలో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ….2019-24 కాలంలో ఆయుష్ విభాగానికి కేవలం రూ.38 కోట్లు మాత్రమే కేంద్ర నిధులు లభించగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి తమ విజ్ఞప్తి మేరకు కేంద్ర సాయాన్ని భారీగా పెంచడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం అంగీకరించిందని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఈ సంవత్సం జూలై నెలలో కేంద్ర ఆయుష్ శాఖా మంత్రి, ఉన్నతాధికారుల్ని కలిసి గత ఐదేళ్లుగా రాష్ట్రంలో ఆయుష్ కార్యక్రమాలు నిర్లక్ష్యానికి గురైన తీరును వివరించి, వాటి అభివృద్ధికి తగు మేరకు కేంద్ర నిధుల్ని అందించాలని కోరినట్లు మంత్రి తెలిపారు. తమ విజ్ఞప్తిని అంగీకరించినందుకు ఆయన కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు.
రాష్ట్రంలో ఆయుష్ శాఖను బలోపేతం చేసేందుకు, ఆయుష్ వైద్యశాలల్లో మందుల సరఫరాకు, నిర్మాణ దశలో ఆగిపోయిన 50 పడకల ఆయుష్ ఆసుపత్రుల్ని పూర్తి చేసేందుకు, పాడుబడిన ఆయుష్ డిస్పెన్సరీల పునర్నిర్మాణానికి, వివిధ ఆయుష్ పధకాలకు, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆయుష్ కళాశాలలు, ఆసుపత్రులను మెరుగుపర్చేందుకు, ప్రభుత్వ ప్రకృతి వైద్య కళాశాల నిర్మాణానికి, రాష్ట్రంలోని 126 ఆయష్మాన్ ఆరోగ్య మందిరాలను పటిష్టం చేసేందుకు కేంద్ర సాయాన్ని కోరినట్లు మంత్రి సత్యకుమార్ వివరించారు.
రాష్ట్రంలోని 90 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్ని ఎన్ఎబిహెచ్ గుర్తింపు కోసం పంపగా, 89 కేంద్రాలకు మంజూరు లభించినట్లు మంత్రి తెలిపారు. ఇతర రాష్ట్రాలలో ప్రభుత్వ ఆయుష్ కళాశాలలు ఎక్కువ సంఖ్యలో ఉండగా, మన రాష్ట్రంలో కేవలం ఒక్క ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల మాత్రమే ఉన్నందున మరో కళాశాల నిర్మాణానికి కేంద్ర సాయాన్ని కోరగా, సానుకూల స్పందన లభించినట్లు మంత్రి తెలిపారు. ఈ మేరకు ధర్మవరంలో నూతన ఆయుర్వేద కళాశాలను, దాని అనుబంధ 100 పడకల ఆసుపత్రిని నిర్మించేందుకు యోచిస్తున్నామని ఆయన వెల్లడిరచారు.
రాష్ట్రానికి ఆయుర్వేద కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరానికి అదనంగా యూజీ, పీజీ సీట్ల కేటాయింపు కోరగా కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు మంత్రి సత్యకుమార్ వివరించారు. కేంద్రం హామీ మేరకు విశాఖపట్నంలో 50 పడకల ఆయుష్ ఆసుపత్రికి రూ.8.50 కోట్లు, కాకినాడలోని ఆసుపత్రికి రూ.8 కోట్లు, ఆరోగ్య మందిరాలకు రూ.5.75 కోట్లు, ఆయుష్ కళాశాలలకు రూ. 20 కోట్లు కేంద్ర నిధులు లభించనున్నట్లు మంత్రి వివరించారు. సిబ్బంది శిక్షణ కోసం అదనంగా మరో 10 కోట్లు కావాలని కేంద్రాన్ని కోరామన్నారు.
జగన్ రెడ్డి నిర్వాకంపై మంత్రి ధ్వజం
ఐదేళ్ల పాలనలో 17 ప్రభుత్వ వైద్య కళాశాలలను నిర్మిస్తామని నానా ఆర్భాటం చేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వాస్తవంగా వాటి పట్ల పూర్తి నిర్లక్ష్యం వహించారని మంత్రి సత్యకుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. సొంత నియోజకవర్గమైన పులివెందులలో నెలకొల్పాల్సిన వైద్య కళాశాల పట్ల కూడా చిత్తశుద్ధితో పనిచేయకుండా రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకొచ్చిన నెల రోజుల్లోపే జగన్ రెడ్డి అసత్య ఆరోపణలకు దిగజారారని ఆయన మండిపడ్డారు. రూ.8500 కోట్లతో 17 కళాశాలలను నిర్మిస్తామని చెప్పి అధికారంలోనుండి దిగిపోయేనాటికి కేవలం రూ.2125 కోట్ల మేరకే (25 శాతం)పనులు పూర్తి చేసినట్లు చూపి అందులోనూ కేవలం రూ. 1451 కోట్ల మేరకే(16 శాతం) చెల్లింపులు చేసిన జగన్ రెడ్డికి నేడు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదని మంత్రి సత్యకుమార్
ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ రెడ్డి అధికారం నుండి వైదొలగే నాటికి పులివెందుల వైద్య కళాశాల నిర్మాణానికి సంబంధించి 48 శాతం బోధనా సిబ్బంది లోటుతో పాటు 37 శాతం మేరకు ఇతర అనుబంధ బోధనా సిబ్బంది లోటు ఉందని జాతీయ వైద్య మండలి ఎత్తిచూపిందన్నారు. ఈ లోటును నెల రోజుల్లో కూటమి ప్రభుత్వం ఎలా పూర్తి చేయగలుగుతుందని మంత్రి ప్రశ్నించారు. రెండో దశలో నిర్మించాల్సిన మరో 4 కాలేజీల్లో పరిస్థితి ఇంకా దారుణంగా ఉండడంతో ఈ విద్యాసంవత్సరానికి వాటిల్లో ప్రవేశాలు చేపట్టడం కుదరలేదని… ఈ దుస్థితికి కేవలం జగన్ రెడ్డే బాధ్యుడని మంత్రి స్పష్టం చేశారు. వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న 17 ప్రభుత్వ వైద్య కళాశాలలన్నింటినీ తగు విధంగా పూర్తి చేసి విద్యార్థుల ప్రవేశాలు చేసి తీరుతామని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు. మొదటి దశలో చేపట్టిన 5 కళాశాలలు ఇప్పటికే ముందుకు సాగుతున్నాయని, మిగిలిన వాటిని కూడా త్వరితగతిన చేపట్టేందుకు తగు మార్గాలు పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు. పీపీపీ మోడల్, వయబిలిటీ గ్యాప్ ఫండిరగ్ అవకాశాలను మదింపు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ కళాశాలలను మూసి వేయడానికి కుట్ర జరుగుతోందన్న దుష్ప్రచారాన్ని మంత్రి సత్యకుమార్ ఖండిరచారు.