- వర్చువల్‌గా 7.5 లక్షల మంది హాజరు
- నేతలతో సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్
- మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌పై ప్రస్తావన
- తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీక మహానాడు
- స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపు
అమరావతి(చైతన్యరథం): తొలిరోజు మహానాడు విజయ వంతంగా ముగిసింది. పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు, క్లస్టర్, యూనిట్, బూత్‌స్థాయి ఇన్‌ఛార్జులు పాల్గొ న్నారు. వర్చువల్‌గా మహానాడు విజయవంతంపై హర్షం వ్యక్తం చేశారు. 7.5 లక్షల మంది తొలిరోజు వర్చువల్ మహానాడుకు హాజరుకావటం రికార్డు అని పేర్కొన్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు లోకేష్ చేసిన మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ప్రతిపాదనలపై టెలీకాన్ఫరెన్స్‌లో ప్రస్తావించారు. ఈ సందర్భం గా లోకేష్ ప్రతిపాదనను ఆమోదించాలని నేతలు కోరారు. చంద్రబాబు మాట్లాడుతూ హైబ్రిడ్ విధానంలో మహానాడు నిర్వహించుకుంటున్నాం. 1,875 క్లస్టర్ల నుంచి 7.5 లక్షల మంది వర్చువల్‌గా హాజరయ్యారు. ఇంతమంది కార్యకర్తలు మహానాడులో పాల్గొనటం ఓ చరిత్ర. మహానాడు తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. గొడ్డలి పార్టీ ప్రజా వ్యతిరేఖ వైఖరిని మహానాడు వేదికగా ఎండగట్టారని వివరిం చారు.
తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తల ఐక్యతను చూసు కుని గొడ్డలి పార్టీలో ఆందోళన వ్యక్తం అవుతోందన్నారు. కార్య కర్తలుగా ఉన్న వారు నాయకులుగా ఎదిగేందుకు కృషి చేస్తున్నా రని మహానాడు ప్రసంగాల ద్వారా అర్థం అయింది. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని ఇతరులకు ఆదర్శంగా నిలవా లని పిలుపునిచ్చారు. త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నిక లను సమర్థంగా ఎదుర్కొనేలా ప్రతి కార్యకర్త, నేత సిద్ధం కావాలని సూచించారు. రెండోరోజు మహానాడులో ముఖ్యమైన చర్చలు, తీర్మానాలు జరుగుతాయని వివరించారు. పార్టీ కుటుం బసభ్యులు యాక్టివ్‌గా పాల్గొనాలని తెలిపారు.













