(చైతన్యరథం ప్రత్యేక ప్రతినిధి – అమరావతి): జగన్మోహన్ రెడ్డి అంటే అబద్ధాలు, మోసం, వంచనలకు ప్రతిరూపం. ఎన్నికల సమయంలో వివిధవర్గాలకు ఎడాపెడా హామీలు ఇచ్చి, తీరా అధికారపగ్గాలు చేపట్టాక మొండిచేయి చూపించాడు. తాను 99.5% హామీలు అమలు చేశానని పదేపదే అబద్దాలు వల్లెవేస్తున్న జగన్… వాస్తవంలో అమలుచేసింది మాత్రం కేవలం 15శాతం హామీలు మాత్రమే. 85శాతం హామీలను తుంగలో తొక్కి రాష్ట్రప్రజలను వంచించిన జగన్మోసపురెడ్డి… ఆత్మస్తుతి, పరనిందకు పాల్పడుతున్నాడు. 2014 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో చెప్పినదానికన్నా అదనంగా చేసింది నిజం. అందుకే వాస్తవాలు తెలుసుకున్న జనం నేడు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. గత నాలుగున్నరేళ్లుగా జగన్ రెడ్డి నమ్మకద్రోహం కారణంగా రాష్ట్రం నేడు ఆందోళనాంధ్రప్రదేశ్‌గా మారింది. మాటతప్పుడు – మడమతిప్పుడుకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన మేకవన్నెపులి జగన్ మోసాలను నేటినుంచి ధారా వాహికంగా మీ ముందుకు తెస్తోంది ‘‘చైతన్య రథం’’.
జగన్ చెప్పిందేమిటి… చేసిందేమిటి?
- చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసిన 120 సంక్షేమ పథకాల్ని జగన్‌రెడ్డి రద్దు చేశారు. పరిశ్రమల్ని పొరుగు రాష్ట్రాలకు తరిమేశారు. రాజధానిని విధ్వంసం చేశారు. పోలవరాన్ని రివర్స్ చేయడం ద్వారా నదుల అనుసంధానానికి గండికొట్టి రాష్ట్రాన్ని కరవు రక్కసికి బలిపెట్టారు.
- బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సబ్‌ప్లాన్ నిధులు రూ.1.14 లక్షల కోట్లు దారిమళ్ళించి సామాజిక న్యాయం గొంతు కోశారు.
- 2.30 లక్షల ఉద్యోగాల భర్తీపై మాట తప్పాడు.
- అంగన్‌వాడీలకు తెలంగాణకన్నా రూ.1000 అదనంగా పెంచుతామన్న హామీపై మడమ తిప్పాడు.
- మద్య నిషేధం చేసి ఓటగుతానన్న హామీకి విరుద్ధంగా మద్యం ఆదాయం 15 ఏళ్లు బ్యాంకులకు తాకట్టు పెట్టాడు.
- విద్యుత్ ఛార్జీలు పెంచనన్న హామీకి విరుద్ధంగా రూ.64 వేల కోట్లు విద్యుత్ భారాలు మోపాడు.
- సీపీయస్ రద్దు, రైతు రుణమాఫీ, మద్య నిషేధం, అమరావతి అభివృద్ధి, ఇసుక అక్రమ తరలింపు నివారణ లాంటి అనేక హామీలపై మాటతప్పి మడమ తిప్పారు. అయినా 99.5% హామీలు అమలు చేశానని పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు.
నవరత్నాలు – నవమోసాలు
క్ర.సం జగన్‌రెడ్డి ఇచ్చిన హామీ అమలు స్థితి…
- మద్య నిషేధం చేశాకే ఓట్లు అడుగుతా – అమలు కాలేదు
- ఐదేళ్లలో 25 లక్షల పక్కా ఇళ్లు కట్టిస్తాం – పాక్షికంగా అమలు
- జలయజ్ఞంతో సాగునీటి ప్రాజెక్టులు – పూర్తిగా అమలు కాలేదు
- రైతు భరోసాతో ఏటా రూ.12,500 – పాక్షికంగా అమలు
- అమ్మఒడితో ప్రతి విద్యార్ధికి రూ.15వేలు – పాక్షికంగా అమలు
- ఆరోగ్యశ్రీతో ఉచిత వైద్యం – పాక్షికంగా అమలు
- ఆసరాతో డ్వాక్రా రుణాలన్నీ – మాఫీ చేస్తాం పాక్షికంగా అమలు
- పెన్షన్ రూ.3వేలకు పెంచుకుంటూ పోతా – పాక్షికంగా అమలు
- ప్రతి విద్యార్థికి ఫీజు రీయింబర్స్ మెంట్ – పాక్షికంగా అమలు