- రాత్రివేళ దొంగల్లా ఇంట్లో చొరబడిన పోలీసులు
- నోటీసు ఇవ్వకుండానే హడావిడిగా తరలింపు
- నరేంద్రకు ఏం జరిగినా సిఐడిదే బాధ్యతన్న భార్య సౌభాగ్యం
- కుటుంబసభ్యులకు ఫోన్‌లో అధినేత పరామర్శ
- పార్టీ అండగా ఉంటుందన్న చంద్రబాబునాయుడు
గుంటూరు :ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి జేబుసంస్థగా మారిన ఎపి సిఐడి మరో మారు నిబంధనలను తుంగలో తొక్కి బరి తెగించింది. తెలుగుదేశంపార్టీ కేంద్ర కార్యాలయ మీడియా కోఆర్డినేటర్ దారపునేని నరేంద్రబాబును బుధవారం రాత్రి అక్రమంగా అరెస్టుచేసి సిఐడి కార్యాలయానికి తరలించారు. మఫ్టీలో ఉన్న 7గురు సిఐడి పోలీసులు రాత్రి ఏడుగంటల సమయంలో అరండల్ పేట పదోలైన్‌లో నరేంద్ర నివాసముంటున్న అపార్ట్ మెంట్‌పైకి ఒక్కసారిగా దాడిచేశారు. నరేంద్రను ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నారని కుటుంబ సభ్యు లు ప్రశ్నిస్తున్నప్పటికీ లెక్కచేయకుండా పోలీసు వ్యాన్ లో ఎక్కించారు. ఎటువంటి కారణాలు తెలపని ఒక చేతిరాత తోకూడిన తప్పుడునోటీసును ఆయనభార్యకు అందజేశారు. అందులో 120(బి), 505(2), 153(ఎ) సెక్షన్లకింద అరెస్టు చేస్తున్నట్లుగా ఉంది. ఏ నేరం చేశారని ఈ సెక్షన్లన్నీ బనాయిస్తున్నారో సంబంధిత నోటీ సులో పొందుపర్చలేదు. విషయం తెలిసిన వెంటనే నరేంద్ర కుటుంబసభ్యులతో అధినేత చంద్రబాబునాయుడు ఫోన్‌లోమాట్లాడారు. నరేంద్ర అరెస్ట్‌తో ఆందోళనలో ఉన్న కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. నరేంద్రపై పెట్టిన తప్పుడుకేసు కోర్టులో నిలబడదని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నరేంద్ర భార్య సౌభాగ్యం మాట్లాడుతూ.. తన భర్తను పోలీసు లు అక్రమంగా అరెస్ట్ చేశారని అన్నారు. నా భర్తను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని అడిగినా పోలీసులు సమాధానం చెప్పలేదన్నారు. నా భర్తకు ఏం జరిగినా వైసీపీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు.అక్రమకేసులతో తమ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టేప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
సిఐడి కార్యాలయం ఎదుట బైఠాయింపు
దారపునేని నరేంద్ర అక్రమ అరెస్టుకు నిరసనగా పెద్దఎత్తున గుంటూరులోని సిఐడి కార్యాలయం వద్ద కు చేరుకున్న కార్యకర్తలు సిఐడి పోలీసుల వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేస్తూ బైఠాయించారు. నరేంద్ర ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సిఐడి కార్యాలయంవద్దకు చేరుకున్న మాజీమంత్రులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, నక్కా ఆనంద్‌బాబు అక్కడ ఉన్న పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. నరేంద్రను ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలంటూ నిలదీశారు. నరేంద్ర అనారోగ్యంతో ఉన్నారని, తమలో ఇద్దరిని నరేంద్రను చూసివచ్చేందుకు అనుమతించాలని పట్టు బట్టారు. పోలీసులు ఇవేం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ జులుం ప్రదర్శించారు. కార్య కర్తలు తీవ్రంగా ప్రతిఘటించడంతో నక్కా ఆనంద్ బాబుతో సహా ఆందోళనకారులను అదుపులోకి తీసు కొని నగరంపాలెం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రాత్రి 12గంటల ప్రాంతంలో నగరంపాలెం పోలీస్ స్టేషన్ నుండి స్థానిక నాయకులు అందరినీ వదిలేశా రు. నరేంద్రను విచారించి రేపు కోర్టులో హాజరుపరు స్తామని సిఐడి పోలీసులు తెలిపారు.