- జె-గ్యాంగ్ ధనదాహంతో ఒకతరం నాశనం
- మంగళగిరి ఎన్నికల ప్రచారంలో యువనేత లోకేష్
మంగళగిరి (చైతన్యరథం): విశాఖతీరంలో 25వేల కిలోల డ్రగ్స్ పట్టు బడ్డాయన్న వార్తతో యావత్ భారతదేశం నివ్వెరపోయిందని, జగన్ అండ్ కో ధన దాహంతో ఒకతరం మొత్తం నాశనమయ్యే పరిస్థితులు నెలకొన్నాయని యువనేత నారా లోకేష్ ఆందోళన వ్యక్తంచేశారు. అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో డ్రగ్స్, గంజాయి ముఠాలపై ఉక్కుపాదం మోపు తామని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారం లో భాగంగా మంగళగిరి నియోజకవర్గం డోలాస్ నగర్ రచ్చబండ సభలో యువనేత లోకేష్ మాట్లాడుతూ… రాష్ట్రంలో ముఖ్య మంత్రి జగన్ నేతృత్వంలోనే డ్రగ్స్, గంజాయి మాఫియాలు చెల ంగిపోతున్నా యన్నారు.
విశాఖ,తూర్పుగోదావరి ఏజన్సీలో ఎమ్మెల్సీ అనంతబాబు నేతృత్వంలోని గంజాయి మాఫియా రాష్ట్రంతోపాటు దేశం లోని ప్రధాన నగరాలకు గంజాయిని సర ఫరా చేస్తోంది. దేశంలో ఎక్కడ గంజాయి పట్టు బడినా దాని మూలాలు ఏపీలోనే ఉండటం ఇందుకు నిదర్శనం. యువగళం పాదయాత్ర సందర్భంగా చంద్రగిరి లో ఓ తల్లి నన్ను కలిసింది, వైసీపీ నాయకులు తన బిడ్డను గంజాయికి బానిసగా మార్చి శారీరకంగా వాడుకున్నారని కన్నీరుము న్నీరైంది. తనబిడ్డను గంజాయి నుంచి బయటకి తేవడానికి సహాయం అందించా లని, లేకపోతే ఆమెను తన చేతులతోనే చంపేస్తానని ఆ తల్లి చెప్పింది, లేకపోతే తన ఇద్దరు బిడ్డలు కూడా గంజాయికి బానిసలుగా మారి తన దక్కరని ఆ తల్లి చెప్పిన మాటలు విని నేను తీవ్ర మనోవేదనకు గురయ్యాను. ఆ తల్లికి వచ్చిన కష్టం రాష్ట్రంలో మరెవరికీ రాకూడదని ఆనాడే నిర్ణయించుకున్నానని లోకేష్ పేర్కొన్నారు.