- జగన్ పాలనలో వ్యవసాయం సర్వనాశనం
- టీడీపీ`జనసేన శ్రేణుల్లో చిచ్చు పెడుతున్న జగన్‌రెడ్డి
- తాడేపల్లిగూడెం ఉమ్మడి సభలో వక్తలు
తాడేపల్లిగూడెం, చైతన్యరథం: రానున్న ఎన్నికల కురుక్షేత్రంలో 151 మంది అభినవ కౌరవులకు ఓటమి తప్పదని టీడీపీ`జనసేన తొలి ఉమ్మడి బహిరంగ సభ లో పాల్గొన్న వక్తలు పేర్కొన్నారు. జగన్ పరిపానలో రైతులకు అన్నీ కష్టాలేనని, వ్యవసాయాన్ని అధోగతి పాలు చేశారని విమర్శించారు. దేశంలోనే రైతుల ఆత్మ హత్యల్లో ఏపీ మూడోస్థానంలో ఉండడం సిగ్గుచేటన్నా రు. ఈ సభలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ భారీగా జనం తరలివచ్చిన ఈ సభ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందన్నారు. సిద్ధమా అని రోడ్డెక్కిన వాడిని ఓడిరచడానికి మొదలు పెట్టిన యుద్ధంలో తొలి అడుగు ఈ సభ అని పేర్కొన్నారు. టీడీపీ శ్రామికుల చెమటబిందువు నుంచి పుట్టిన పార్టీ అన్నారు. జనంలో పుట్టిన జనసేన, టీడీపీ పొత్తు ఈ రాష్ట్రంలో చరిత్ర సృష్టించబోతోందన్నారు. కార్మికుల నుంచి పారిశ్రామిక వేత్తలవరకు అందరూ కోరుకున్న పొత్తు ఇది అని, రైతు లు కోరుకున్న పొత్తు ఇది అని, రెండు పార్టీలు సమన్వ యంతో పనిచేస్తే 160క ిపైగా సీట్లు వస్తాయన్నారు.
రైతులను నట్టేట ముంచిన జగన్
బాలకృష్ణ
టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ అన్న ఎన్టీ ఆర్ బడుగుబలహీన వర్గాలకు చేదోడు వాదోడుగా నిలిచారని, ఆయన ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని, చంద్రబాబు కూడా అదే క్రమశిక్షణ కొనసా గించారన్నారు. జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో రైతు అనే వాడికి ఉనికి లేకుండా చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడిగుడ్డు మీద ఈకలు పీకే బ్యాచ్ ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని,ఏంచేశారో చర్చిద్దాం రమ్మంటేరారని, కానీ ఏదో ప్రగల్భాలు పలుకు తుంటారని ఎద్దేవా చేశారు.టీడీపీకి ఉన్న బలం.. పార్టీ కార్యకర్తలేనన్నారు. వైసీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని ధ్వజమెత్తారు. రాష్ట్ర్రంలో కులాలు, మతాల పేరుతో చిచ్చుపెడు తున్నారని ధ్వజమెత్తారు.
పొత్తు చారిత్రక అవసరం: కొణతాల
జనసేన సీనియర్ నేత కొణతాల రామకృష్ణ మాట్లా డుతూ రాష్ట్రంలో దోపిడీ పాలన జరుగుతోందన్నారు. టీడీపీ-జనసేన పొత్తు చారిత్రక అవసరంగా పేర్కొన్నా రు. కురుక్షేత్ర యుద్ధంలో చంద్రబాబు, పవన్ విజయ ఢంకా మోగిస్తారన్నారు. రాష్ట్ర భవిష్యత్తు గురించి అం దరూ కలిసి పనిచేయాలన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం పొత్తు ఎంతో అవసరమన్నారు. ప్రజలు కోరుకుంటున్న పొత్తు విజయవంతంగా ముందుకు వెళ్తుందని ఆశాభా వాన్ని వ్యక్తంచేశారు. రాష్ట్రానికి పూర్వ వైభవం టీడీపీ-జనసేన వల్లే సాధ్యమౌతుందన్నారు.
మన జెండా ఎగరాలి: కొల్లు
మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన జెండా ఎగరాలన్నారు.సిద్ధం అంటున్నజగన్‌కు యుద్ధం అంటే ఏమిటో చూపాలన్నారు. మాయ మాటలు చెప్పి జగన్ అధికారంలోకి వచ్చారని, మళ్లీమోసం చేసేందు కు ప్రజలవద్దకు జగన్ వస్తున్నారని,జాగ్రత్తగా ఉండాల ని అన్నారు.టీడీపీ-జనసేన శ్రేణుల్లో చిచ్చుపెట్టేందుకు జగన్‌రెడ్డి శతవిధాలా యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.
విజయం మనదే: షరీఫ్
శాసనమండలి మాజీ ఛైర్మన్, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎంఏ షరీఫ్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి భారీ మెజారిటీతో అధికారం లోకి రాబోతోంద న్నారు. టీడీపీ-జనసేన ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడుపుతుందన్నారు. టీడీపీ హయాంలో పేదలకు పలురకాల సంక్షేమ పథకాలు అందాయన్నారు. వైసీపీ వచ్చాక అభివృద్ధి కుంటుపడిర దన్నారు. రాష్ట్ర ప్రజల బతుకులు రోడ్డునపడ్డాయని, దుష్టపాలన అంతానికి అందరూ సైనికుల్లా పనిచేయాలని కోరారు.
అన్ని వర్గాలనూ మోసం చేశారు: బొమ్మిడి
జనసేన సీనియర్ నేత బొమ్మడి నాయకర్ మాట్లాడుతూ ఐదేళ్లు రాష్ట్ర ప్రజలను జగన్ మోసం చేశారన్నారు. వైసీపీ మరోసారి వస్తే రాష్ట్రప్రజలు పొట్ట చేతి లో పట్టుకుని వలసలు వెళ్లే పరిస్థితి వస్తుంద న్నారు. అన్ని వర్గాలను నాశనం చేసిన ఘనత జగనదేనన్నారు.
దోచింది మొత్తం కక్కిస్తాం: నిమ్మల
టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ధాన్యాగారమని, కానీ ఈ రోజు రాష్ట్రంలో వ్యవసాయం చేసే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ మోహన్‌రెడ్డి రైతు వ్యతిరేక కార్యక్రమాలే ఇందుకు కారణమన్నారు. అక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీని ఎత్తివేశాడని తెలిపా రు. కౌలు రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో ఉంది,రైతుల ఆత్మహత్యల్లో మూడో స్థానంలో ఉందని, దీనిబట్టి రాష్ట్రాన్ని జగన్ ఎలా భ్రష్టుపట్టిం చాడో అర్థమవుతోందన్నారు. జగన్ దోచుకున్న మొత్తాన్ని తెలుగుదేశం ` జనసేన ప్రభుత్వంలో కక్కిస్తామన్నారు.
కృష్ణార్జునుల్లా కలిశారు: రఘురామ
ఎంపీ రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ చంద్ర బాబు,పవన్ కల్యాణ్ కృష్ణార్జునుల్లా కలిశారని, రానున్న ఎన్నికల కురుక్షేత్రంలో అభినవ కౌరవులు 151 మంది ని తుదముట్టిస్తారన్నారు. దుర్మార్గ పాలన అంతం చేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశ నం చేసిన వ్యక్తి చరిత్రపుటల్లో కలిసే సమయం వచ్చిం దన్నారు.మూడు రాజధానులని చెప్పారని,వాటి అడ్రస్సే లేదన్నారు. రాజధాని లేని రాష్ట్రాన్ని డ్రగ్స్‌కు రాజధాని చేశారని ఎద్దేవాచేశారు. కూటమి అభ్యర్థిగా వచ్చే ఎన్ని కల్లో నరసాపురం ఎంపీగా పోటీ చేస్తానన్నారు. జై టీడీపీ, జై జనసేన, జై బీజేపీ అంటూ ప్రసంగం ముగించారు.