భువనమ్మను చూసేందుకు పుంగనూరులో అభిమానులు పోటెత్తారు. నిజం గెల వాలి పర్యటనలో భాగంగా బుధవారం పుంగనూరు వచ్చిన భువనమ్మకు కార్యకర్తలు, అభిమానులు వెల్లువలా తరలివచ్చి సంఫీుబావం తెలిపారు. నియోజకవర్గ ఇన్ఛార్జి చల్లా బాబు, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు జగన్మోహనరాజు ఆధ్వర్యంలో కార్యకర్తలు వేలాదిగా హాజరై భువనమ్మకు ఘన స్వాగతం పలికారు. మహిళలు హారతులు ఇచ్చి స్వాగతించారు. పర్యటన అడుగడుగునా భువనమ్మకు నీరాజనాలు పలుకుతూ పార్టీ శ్రేణులు ముందుకు సాగారు. పుంగనూరు ప్రజలు చిన్న పిల్లలను సైతం తీసుకుని భువనమ్మ కోసం రోడ్ల ప్రక్కన నిలబడి ఎదురు చూశారు. తనకు సంఫీుభావం తెలిపేందుకు వస్తున్న ప్రజలకు అభివాదం చేస్తూ భువనమ్మ ముందుకు సాగారు.