- పోస్టింగ్ ఇవ్వాలన్నా డబ్బులివ్వాల్సిందే
- ఇంట్లో పెళ్లిళ్లు కూడా అవినీతి సొమ్ముతోనే
- సెంటు స్థలం భూముల్లో రూ.50 కోట్లు మింగేశాడు
- టపాసుల కంపెనీల దగ్గరా డబ్బులు వసూలు
- గోవాడ షుగర్ ఫ్యాక్టరీని కాపాడుతాం
- 60 లక్షల మంది టీడీపీ కుటుంబ సభ్యులే నా తోబుట్టువులు
- చోడవరం శంఖారావం సభలో నారా లోకేష్
అమరావతి, చైతన్యరథం: ఏజెన్సీ ప్రాంతానికి ముఖద్వారమైన చోడవరం నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ దోచేస్తున్నారని, దేన్నీ వదలి పెట్టడడం లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. పేరులోనే ధర్మశ్రీ ఉందని, చేసేవన్నీ అధర్మలేనని అన్నారు. ఇంట్లో పెళ్లిళ్లు కూడా అవినీతి సొమ్ముతోనే చేశాడని, మైనింగ్ కంపెనీ వారిని బెదిరించి ఆ కంపెనీని కొన్నాడని తెలిపారు. పోస్టింగ్ వేయాలన్నా ధర్మశ్రీకి డబ్బులు ఇవ్వాల్సిందేనని, సెంటు స్థలాల్లో కూడా కుంభకోణానికి పాల్పడి రూ.50కోట్లు సంపాదించాడని, టపాసులు తయారు చేసేవాళ్ల దగ్గర కూడా డబ్బులు వసూలు చేశాడని విమర్శించారు. సోమవారం చోడవరంలో నిర్వహించిన శంఖారావం సభలో నారా లోకేష్ మాట్లాడుతూ గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ట్రక్కు ఇసుక రూ.1000కి వచ్చేది..కానీ ఇప్పుడు రూ.5000 అయింది. ఇందులో రూ.4000 లు మంత్రి, సీఎంకు కూడా వాటా వెళ్తోందని ఆరోపించారు. చోడవరం నియోజకవర్గంలో టీడీపీ హయంలో 12 వందల కోట్లతో అభివృద్ధి చేశామని, నాడు పరిశ్రమలు తెచ్చి స్థానికులే ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 500 కీ.మీ సీసీ రోడ్లు వేశామని తెలిపారు. అంగన్వాడీ, పంచాయతీ, బీటీరోడ్లు, సాగునీటి ప్రాజెక్టులతోపాటు రైతులకు వంద కోట్ల రూపాయల రుణమాఫీ చేసినట్లు తెలిపారు.
టీడీపీ-జనసేన బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని,ఇచ్చిన హామీలు అమలు చేసే బాద్యత నాదని అన్నారు. ఇక్కడ రోడ్లపై వారం తిరిగితే ఆసుపత్రులకు వెళ్లాల్సిందేనని, రోడ్లన్నీ బాగు చేసే బాధ్యత తనదన్నారు. గ్రోయిన్లు కట్టి రైతులకు సాగునీరు అందిస్తామని చెప్పారు. పవన్ కళ్యాణ్ చెరుకు రైతులకు అదనంగా డబ్బులు ఇస్తామని చెప్పారని, ఆయన ఇచ్చిన హామీ కూడా టీడీపీ ఇచ్చినట్లేనని అన్నారు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీనీ కాపాడతామని, అవసరమైతే రూ.100 కోట్లు కేటాయించి ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. ఉత్తరాంధ్ర జీవనాడి సుజల స్రవంతి పథకం..దానిద్వారా 8లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు నాడు చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేసి పనులు ప్రాంరంభించారని, వాటిని కూడా ఈ ప్రభుత్వం నిలిపేసిందని, అధికారంలోకి రాగానే యుద్ధప్రాతిపదికను పూర్తి చేస్తామని హామీనిచ్చారు. కళ్యాణపులోవ మినీ రిజర్వాయర్ కూడా పూర్తి చేస్తామని, చాకిపల్లి బ్రిడ్జ్ కూడా నిర్మిస్తామని, గొట్టివాడ, వలబొబ్బు బ్రిడ్జిలు కూడా పూర్తి చేస్తామని భరోసానిచ్చారు. టీడీపీ బలం కార్యకర్తలేనని, పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేస్తున్నారని, పసుపు జెండా చూస్తేనే మనకు నూతన ఉత్సాహం వస్తుందని అన్నారు. తనకు అక్కా తమ్ముడు, అన్నా చెల్లి లేరని, 60 లక్షల మంది కుటుంబ సభ్యులే తన తోబుట్టువులని లోకేష్ అన్నారు.
లోకేష్‌కు ఖడ్గం బహుకరణ
చోడవరం శంఖారావం సభలో యువనేత లోకేష్‌కు జనసేన ఇన్చార్జి పివిఎస్‌ఎన్ రాజు ఖడ్గాన్ని బహు కరించారు. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఆయనలోని ధైర్యాన్ని, తెగువను స్పూర్తిగా తీసుకొని అరాచక పాలనను అంతంచేయాలని జనసేన నేత రాజు కోరారు. ప్రజలకు సుభిక్షమైన పాలనను అందించాల్సిందిగా రాజముద్రను కూడా జనసేన నాయకులు బహుకరించారు. రెండునెలల్లో రాబోయే టిడిపి-జనసేన ప్రభుత్వం ప్రజాభీష్టం మేరకు పాలన సాగించాలని రాజు ఆకాంక్షించారు.