- దోపిడీలు, లూఠీలతో రాష్ట్రం సర్వనాశనం
- ఇదే జగన్‌రెడ్డి చేసిన అభివృద్ధి వికేంద్రీకరణ
- ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్ ప్లాన్ నిధుల దారిమళ్లింపు
- అమరావతి రైతులను అడ్డుకోవడానికి ఉత్తరాంధ్ర జగన్ జాగీరుకాదు
- టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు
అమరావతి: దోపిడీలు, లూఠీలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, జగన్‌రెడ్డి మూడున్న రేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి వికేంద్రీకరణ ఇదే అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యు లు బొండా ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజధాని పేరుతో విశాఖలో, ఉత్తరాంధ్రలో భూముల స్వాహా చేశారు. జీవోల మీద జీవోలు ఇచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు, బ్రాహ్మణ వర్గాల సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించారు. అమరావతి రైతులను అడ్డుకోవడానికి ఉత్తరాంధ్రప్రాంతం జగన్ రెడ్డి, మంత్రుల జాగీరో, వాళ్ల అబ్బ జాగీరోకాదు. జగన్‌రెడ్డి మంత్రివర్గం మూడున్నరేళ్లపాలనలో అభివృద్ధి వికేంద్రీకరణ అనే మాటకు అర్థమే మార్చే శారు. దోచుకో.. దాచుకో.. పారిపో అనే 3 విధానాలనే 3 రాజధానుల ముసుగులో రాష్ట్రవ్యాప్తంగా అమలుచేస్తున్నారు. 5 ఏళ్లు అహర్నిశలు కష్టపడిన చంద్రబాబు అమరావతిని వడ్డించిన విస్తరిలా తయా రు చేశారు. జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రయ్యాక అది కుక్కలు చింపిన విస్తరి కన్నా దారుణంగా తయారైంది. భూములతోపాటు సర్వంకోల్పోయిన రైతులు కడుపు మంటతో న్యాయం కోసం రోడ్డెక్కితే మంత్రులంతా ఒళ్లుకొవ్వెక్కి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు
రాజధాని పేరుతో విశాఖ కేంద్రంగా రూ.40 వేల కోట్లు స్వాహా
విశాఖను రాజధాని చేస్తామని చెప్పి, అక్కడి ప్రభు త్వ ఆస్తులను తాకట్టుపెట్టి రుణాలు పొందారు. ఎమ్మా ర్వో కార్యాలయం, రైతుబజార్ సహా విద్యాసంస్థలు, ఇతర ప్రభుత్వభవనాలు తాకట్టు పెట్టి తెచ్చిన రూ.40 వేల కోట్ల సొమ్ము ఏమైందో జగన్మోహన్‌రెడ్డి చెప్పాలి. ఒక్క రాజధాని కట్టలేని అసమర్థ జగన్మోహన్‌రెడ్డి మూడు రాజధానులు ఎలా కడతాడో ప్రజలకు చెప్పా లి. 3 రాజధానులపై ఈ ప్రభుత్వానికి ఉన్న సమగ్ర విధానం ఏమిటోచెప్పాలి.
మూడున్నరేళ్ల పాలనలో ఈ ప్రభుత్వం విశాఖలో ఎక్కడైనా ఒక్కతట్ట మట్టి వేసిందా? వికేంద్రీకరణపై ఈ ప్రభుత్వం ఏం చేసిందో, గత ప్రభుత్వంలో ఏం జరిగిందో జగన్మోహన్‌రెడ్డి శ్వేత పత్రం విడుదల చేయగలడా?. ఉత్తరాంధ్ర, విశాఖ ప్రాంతవాసులకు ఈ ప్రభుత్వంపై నమ్మకం ఉందా? అమరావతి రైతుల్ని ఉత్తరాంధ్రలో అడుగుపెట్టనీయరా? అదేమన్నా జగన్మోహన్‌రెడ్డి, వైసీపీ నేతల అబ్బ జాగీరా? రైతుల్ని, మహిళల్ని అడ్డు కుంటే ప్రజలే వైసీపీ నేతల చొక్కాలు పట్టుకొని సమాధానం చెబుతారు. బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, గుడి వాడ అమర్నాథ్ సహా మంత్రులు, వైసీపీ నేతలు ఎవరైనా ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడా లని బొండా ఉమామహేశ్వరరావు తీవ్ర స్వరంతో హెచ్చరించారు.