- బాధ్యత మరచిన మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ
- ప్రతిపక్ష నేతలకు నోటీసులివ్వడమే కమిషన్ పనా?
- ఆడబిడ్డ మానప్రాణాలకు ఖరీదుకట్టే దుస్థితిలో జగన్‌రెడ్డి
- తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత
అమరావతి, అక్టోబరు 25(చైతన్యరథం): ఆడబిడ్డ లకు అన్నగా అండగా ఉంటానని ఎన్నికల ప్రచారం లో ఊదరగొట్టిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మాటతప్పి మడమతిప్పాడని తెలుగుదేశంపార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు, తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురా లు వంగలపూడి అనిత మండిపడ్డారు. ముఖ్యమంత్రి అయ్యాక మహిళల రక్షణ గాలికొదిలేసి కిరాతకులు, నేరస్థులకు జగన్ అండగా నిలబడుతున్నాడని ధ్వజమెత్తారు. మంగళవారం జరిగిన జూమ్ సమావేశంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలపై రోజుకు సగటున 49నేరాలు జరుగుతున్నాయి. ఆడబిడ్డల రక్షణ విషయంలో జగన్‌రెడ్డి చిత్తశుద్ధి ఏపాటిదో అర్ధం దీనిని బట్టి చేసుకోవచ్చు. రాష్ట్రంలో శాంతిభద్రతలు విఫలం కావడం వల్లే మహిళలకు రక్షణ కరువైంది. ఇంటి నుంచి బయటకు వెళ్లి ఆడపిల్ల భద్రంగా తిరిగి వస్తుందన్న నమ్మకంలేని పరిస్థితులు రాష్ట్రంలో నెల కొన్నాయి. ముఖ్యమంత్రి అసమర్థత, చేతకాని పాలన దీనికి కారణం. సైకో సీఎం అసమర్థత వల్ల రాష్ట్రం పూర్తిగా అధోగతిపాలైంది. అక్కచెల్లెమ్మలకు అండగా ఉంటానని వారిని నమ్మించి అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి, నేడు రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డకు సమా ధానం చెప్పాలి. సైకో సీఎం పాలనలో ఆడబిడ్డలపై 45 వేలకుపైగా నేర ఘటనలు జరిగాయి. లెక్కకు మిక్కిలిగా ఇన్నిదారుణాలు జరిగినా, ఏ ఒక్కదానిపైనా ఏనాడు ముఖ్యమంత్రి స్పందించింది లేదు. ఆడబిడ్డల కు రాష్ట్రంలో రక్షణ లేదని ప్రతిపక్షాలు, మీడియా మొత్తుకుంటున్నా, జగన్ రెడ్డి చెవికి ఎక్కడం లేదు.
ముఖ్యమంత్రి సొంత జిల్లాలోని ఆడబిడ్డలే దుర్మార్గుల దుశ్చర్యలకు బలైపోతున్నారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే కడప జిల్లా బద్వేల్ మండలంలో అనూష చని పోయింది. పోస్ట్ మార్టమ్‌కు సంబంధించి ప్రాథమిక నివేదిక రాకుండానే అనూషది ఆత్మహత్య అని పోలీ సులు ఎలా నిర్ధారిస్తారు? తమ బిడ్డను కోల్పోయిన అనూష తల్లిదండ్రులు, బంధువులు న్యాయం చేయ మని రోడ్డెక్కినా జగన్‌రెడ్డి స్పందించలేదు. అనూష తల్లిదండ్రుల కడుపుకోతకు ఈ ముఖ్యమంత్రి అసమ ర్థత, పోలీసుల చేతగానితనం కారణం కాదా? ఒక్క అక్టోబరు నెలలో కేవలం 20 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై దురాగతాలకు సంబంధించి 17 సంఘట నలు జరిగాయి. ఆయా ఘటనల్లో జగన్‌రెడ్డి గొప్పగా చెప్పే వాలంటీర్ల ప్రమేయం కూడా ఉంది.
జగన్ రెడ్డి సేవలో తరిస్తున్న పోలీసులు
ఈ నెలలోనే ఇన్నిదారుణాలు జరిగినా డీజీపీ ఎం దుకు స్పందించడు? ఆయన కూడా పప్పెట్‌లా మారి తే రాష్ట్రంలోని మహిళల పరిస్థితేమిటి? జగన్‌రెడ్డి, ఆయన వ్యవస్థపై ప్రజలకు నమ్మకం లేదు. జగన్ రెడ్డిపై భక్తితో ఆయన సేవలోతరిస్తూ, పోలీసులు కూడా వారిపై ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకుం టున్నారు. ఆడపిల్ల మానానికి రూ.5 లక్షలు, ప్రాణానికి రూ.10 లక్షలు ఖరీదు కట్టే దుస్థితిలో సీఎం జగన్ రెడ్డి, హోం మంత్రి, మహిళా కమి షన్ చైర్‌పర్సన్ ఉన్నారు. సమయం, సందర్భం లేకుండా ఏదిపడితే అది మాట్లాడే స్థితిలో హోం మంత్రి ఉన్నారు. ఆడబిడ్డలపై జరిగే దారుణాలు, వారి రక్షణపై స్పందించే స్థితిలో జగన్ రెడ్డిలేడు. గంజాయి, ఇతరమాదకద్రవ్యాలపై మాత్రమే ఆయన స్పందిస్తాడు.
బూతుల గురించి ముఖ్యమంత్రి మాట్లాడటమా?
అవనిగడ్డలో బూతుల గురించి ముఖ్యమంత్రి మాట్లాడటం నిజంగా సిగ్గుచేటు. జగన్‌రెడ్డి లాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసి, వినరాని బూతులు విం టున్నందుకు నిజంగా ప్రజలు ఇప్పటికే సిగ్గుపడుతు న్నారు. కేబినెట్‌లో బూతులు మాట్లాడని మంత్రి ఎవరై నా ఉన్నారేమో జగన్‌రెడ్డి చెప్పగలడా? ముఖ్యమంత్రి స్థానంలో ఉండి జగన్‌రెడ్డే, పబ్లిక్ మీటింగ్‌లో నా వెంట్రుక కూడా పీకలేరంటూ పిచ్చెక్కినట్లు మాట్లాడ లేదా? బూతులు మాట్లాడేవారే.. వాటి గురించి మాట్లాడటం ఈ రాష్ట్రంలోనే చూస్తున్నాం. రాష్ట్రంలో ని ఆడబిడ్డల కోసం, రాక్షసులతో పోరాడు తున్న ప్రతి పక్షాలకు మహిళాలోకమంతా మద్దతు ఇవ్వాలని అనిత పిలుపు ఇచ్చారు.