- నరసన్నపేటను నాశనం చేశారు
- వైసీపీ కృష్టదాస్‌పై లోకేష్ నిప్పులు
- సూపర్ సిక్స్‌తోనే మళ్లీ ప్రగతి బాట
- చంద్రబాబు నిప్పు.. వాళ్లు తాకలేరు
- సమయంలేదు మిత్రమా.. కదలండి
- పార్టీ శ్రేణులకు లోకేష్ దిశా నిర్దేశం
నరసన్నపేట (చైతన్యరథం):ఎర్రన్నాయుడు పేరుతో పార్క్ నిర్మిస్తే జేసీబీ తీసుకెళ్లి ధ్వంసం చేసిన అధర్ముడు కృష్ణదాస్ అని యువనేత లోకేష్ మండిపడ్డారు. టీడీపీ కార్యకర్తకు చెందిన వెంకటేశ్వరరావు షాపింగ్ కాంప్లె క్స్‌ను ఏకపక్షంగా తొలగించిన ఘనులంటూ ఎత్తిపొడి చారు. నరసన్నపేట శంఖారావ సభలో నియోజకవర్గ పరిస్థితిపై మాట్లాడుతూ`గతంలో డిప్యూటీ సీఎంగా పనిచేసినా ఆ స్థాయిలో నియోజకవర్గ అభివృద్ధి జరగ లేదని, ఒక్క రోడ్డు వేయలేదు. ఒక్క ఇల్లు కట్టలేదు.
ఒక్క ప్రాజెక్టు పూర్తిచేయని అసమర్థుడు అధర్మాన కృష్ణ దాస్ అని విమర్శించారు.టీడీపీ అధికారంలోకి రాగానే బొంతు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులన్నీ పూరిచేస్తా మని లోకేష్ హామీ ఇచ్చారు. వంశధార ప్రాజెక్టు పను లు, పెండిరగ్‌లో ఉన్న ధారా వంతెన బ్రిడ్జి పనులూ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కామేశ్వరపేట వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కావాలని పెద్దలుకోరారు. ఖచ్చి తంగా పూర్తిచేసే బాధ్యత తీసుకుంటానని, శ్రీముఖ లింగ ఆలయాన్నీ అభివృద్ధి చేసే బాధ్యత వ్యక్తిగతంగా తీసుకుంటానని హామీ ఇచ్చారు. టీడీపీకి కార్యకర్తలే బలం. ఎంతోమంది పార్టీ మారినా కార్యకర్తలే అండగా నిలిచారు.
కార్యకర్తల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ప్రమాదంలో చనిపోయిన కార్యకర్తల కుటుం బాలకు రూ.100కోట్లు ఇచ్చి అండగా నిలిచాం. మన పిల్లలను కూడా చదివిస్తున్న వ్యక్తి చంద్రబాబునాయుడు అని పార్టీ శ్రేణులకు భరోసానిచ్చారు. వైసీపీ అధికారం లోకి వచ్చాక మనపై ఎన్నో కేసులు పెట్టి వేధించారు. నాపైనా 22కేసులు పెట్టారు. ఎస్సీ,ఎస్టీ కేసులు, అటెం ప్ట్ మర్డర్ కేసూపెట్టారు. అయినా శ్రేణులెవరూ తగ్గ లేదు. మడమ తిప్పలేదు. అదీ తెలుగుదేశం ధైర్యం’అని కార్యకర్తలను లోకేష్ ఉత్తేజపర్చారు.పాదయాత్రకు అనే క అడ్డంకులు సృష్టించారని,స్టూల్, మైకులు లాక్కున్నార ని,చీకటి జీవోలు తీసుకువచ్చారని గుర్తు చేసుకున్నారు. ‘నాపై కోడిగుడ్లు వేస్తే మనవాళ్లు ఆమ్లెట్లు వేసి పంపార’ ని లోకేష్ ఛలోక్తిగా అనడంతో పార్టీశ్రేణులు పెద్దపెట్టు న హర్షద్వానాలు చేశారు.
చంద్రబాబుని తప్పుడు కేసు ల్లో ఇరికించి అక్రమంగా అరెస్ట్‌చేసి 53రోజులు జైల్లో పెట్టారు.తొలుత 3వేల కోట్ల అవినీతి అన్నారు. తర్వాత 270కోట్లు అన్నారు. ఇప్పుడు 27కోట్లు అంటున్నారు. రేపు అదీ ఉండదు. ఎందుకంటే చంద్రబాబు ఏనాడూ అవినీతి చేయలేదు. నిప్పులా బతికారు. అవినీతి ఆరో పణలపై జగన్‌రెడ్డికి సవాల్ విసురుతున్నా. బహిరంగ చర్చకు సిద్ధమా?’ అని లోకేష్ సవాల్ చేశారు.
టీడీపీ కేడర్‌ను వేధించిన వారి పేర్లు రెడ్ బుక్‌లో రాసుకున్నానని,చట్టాలను అతిక్రమించి ఎవరైతే ఇబ్బం దులు పెట్టారో వారిపై జ్యుడీషియరీ ఎంక్వైరీవేసి చర్య లు తీసుకుంటామని కార్యకర్తలకు లోకేష్ హామీ ఇచ్చా రు. ‘ఎన్టీఆర్ రాముడు. చంద్రబాబు దేవుడు. లోకేష్ వైకాపా పాలిట చండశాసనుడు. వడ్డీ సహా చెల్లిస్తాం’ అని ఆగ్రహంతో ప్రకటించారు.
చంద్రబాబు సూపర్ సిక్స్ కార్యక్రమాలను కేడర్‌కు ఇచ్చే సూపర్-6 కిట్ల ద్వారా ప్రతి గడపకు తీసు కెళ్లాలని దిశా నిర్దేశం చేశారు. ఎన్నికలకు 60 రోజులే సమయం ఉంది. సూపర్-6 హామీలను ఇంటింటికీ తీసుకెళ్లాలి. ఎవరి బూత్‌లో బాబు ష్యూరిటీ-భవిష్యత్ కు గ్యారంటీ బాగా జరిగిందో నాకు కంప్యూటర్‌లో తెలుస్తుంది. మెరుగైన పనితీరు కనబర్చినవారికి నామి నేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యత ఇస్తా. నా చుట్టూ, పార్టీ ఆఫీసుల చుట్టు కాదు.. ప్రజల్లో తిరగాలని పార్టీ కేడర్‌ను కోరుతున్నా అన్నారు. చంద్రబాబును అక్రమ అరెస్ట్ చేస్తే పవన్ మనకు అండగా నిలబడ్డారు.
పవన్‌ను బోర్డర్‌లో నిలిపేశారు. ఆనాడే సైకోను తరిమి కొట్టాలని పవనన్న పిలుపునిచ్చారు అని గుర్తు చేసుకు న్నారు. హలో ఏపీ-బైబై వైసీపీ అని పవనన్న పిలుపు నిచ్చారని, ఎటువంటి అపోహలకు తావులేకుండా ఇరు పార్టీల కార్యకర్తలు ఉమ్మడి అభ్యర్థుల విజయానికి కృషిచేయాలని లోకేష్ సూచించారు. పార్టీ కార్యకర్తల బాధ్యత నేను తీసుకుంటా. ఏ సమస్య వచ్చినా అండగా ఉంటానని ప్రామిస్ చేశారు.
మత్స్యకారులకు గత టీడీపీ ప్రభుత్వం ఎంతో ఆదుకుంది. సబ్సీడీ ద్వారా అన్ని అందించాం. ఆదరణ ద్వారా ఆదుకున్నాం. రెండు నెలలు ఆగితే.. నిలిచిపోయిన సంక్షేమ కార్యక్రమాలన్నీ మత్స్యకారు లకు అందజేస్తాం. మత్స్యకారుల కోసం ఫిషింగ్ హార్బర్, కోల్డ్ స్టోరేజ్‌లు కడతామని హామీ ఇస్తున్నాని లోకేష్ స్పష్టం చేశారు.