తిరుపతి(చైతన్యరథం): గత ఎన్నికల ముందు 2019లో రాయలసీమ బిడ్డనంటూ వచ్చి ముద్దులు పెట్టారు, అందరం మోసపోయాం.. రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ జగన్.. రాయలసీమలో ఒక్క ప్రాజెక్టు పూర్తిచేయలేదు.. ఆయన అధికారంలోకి వచ్చాక కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతిలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యాన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కలిసి యువనేత రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… తిరుపతి అంటే అమర్ రాజా, అమర్ రాజా అంటే తిరుపతి.. అలాంటి కంపెనీపై జగన్‌రెడ్డి వేధింపులకు పాల్పడ్డారు. దీంతో వారు పక్క రాష్ట్రానికి వెళ్లి తమ ప్లాంట్‌ను ఏర్పాటుచేసుకున్నారు. ఆ ఒక్క నిర్ణయం వల్ల ఇక్కడ 20వేల మంది ఉద్యోగాలు కోల్పోయారని దుయ్యబట్టారు.
సీమకు నీరిస్తే బంగారు పంటలు….
రాయలసీమకు నీళ్లిస్తే బంగారమే పండిస్తారు. ఆనాడు అన్న ఎన్టీఆర్ తెలుగుగంగ ద్వారా నీరు పారించి బంగారం పండిరచారు. 2014 నుంచి ఇప్పటివరకు ప్రధని నరేంద్ర మోదీ నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దుల బండిలాగా ముందుకు తీసుకెళ్లారు. మోదీ ప్రధానిగా ఉన్నప్పుడు నేను పంచాయితీ రాజ్, ఐటీ శాఖ మంత్రిగా చేశా. చంద్రబాబునాయుడు నాయకత్వంలో అనేక పరిశ్రమలు తిరుపతికి తీసుకువచ్చాం. ఆనాడు ఒక లక్ష్యంతో పనిచేశాం. కనీసం 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని ఈ రోజు గర్వంగా చెబుతున్నా. ఇదే తిరుపతి కేంద్రంగా 50వేల మంది ఎలక్ట్రానిక్స్ కంపెనీల్లో పనిచేస్తున్నారు. ఫాక్స్‌కాన్, సెల్‌కాన్, టీసీఎస్, జోహో లాంటి అనేక పరిశ్రమలు తీసుకువచ్చి తిరుపతిలోనే కాదు.. రాయలసీమలో నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగాలు కల్పించామని లోకేష్ చెప్పారు.
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేస్తాం….
వికసిత భారత్ మోదీ లక్ష్యం. వికసిత ఆంధ్రప్రదేశ్ చంద్రబాబునాయుడు, పవనన్న లక్ష్యం. పొత్తు కోసం మొదట త్యాగం చేసింది పవనన్న. ఈ రోజు ప్రజల తరపున పోరాడుతోంది మన పవనన్న. రాష్ట్రాన్ని, రాయలసీమను కాపాడుకునేందుకు ఈ కూటమి ఏర్పడిరది. మీకు అండగా నిలబడతాం. పెండిరగ్ ప్రాజెక్టులు యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తాం. తిరుపతి అవకాశాల గని. మేకిన్ ఇండియాలో తిరుపతి భాగస్వామిగా ఉంది. అప్పట్లో తిరుపతిలో అనేక ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు వచ్చేందుకు సహకరించిన మోదీకి ధన్యవాదాలు. తిరుపతి విమానాశ్రయం పరిసరాల్లో వచ్చిన పరిశ్రమల్లో 50వేల మంది పనిచేస్తున్నారు. తిరుపతిలో యువతకు ఉద్యోగాల కల్పన కోసం మరోసారి మోదీతో కలిసి ప్రయాణించేందుకు ఎదురుచూస్తున్నామని లోకేష్ అన్నారు.
భూకబ్జాల్లో భూమన కుటుంబం….
తిరుపతిలో ఎక్కడ చూసినా భూకబ్జాలు, దందాలే. భూమన కుటుంబానికి డబ్బులు ఇస్తేగాని ఇక్కడ పనిజరగని పరిస్థితి. మటన్ షాప్, చికెన్ షాప్ దగ్గర నుంచి సామాన్యుల వరకు కూడా ఎవరినీ వదిలిపెట్టలేదు. ఇప్పుడు చిన్న తమ్ముడు వచ్చాడు. పొరపాటున చిన్న తమ్ముడికి ఓటేస్తే తిరుమలను కూడా అమ్మేస్తారు. వైకాపా నాయకులు ఓట్లు కొనుగోలు చేసేందుకు వస్తారు. అవి మన డబ్బులే తీసుకోండి. గతంలో ఇసుక ధర రూ.వెయ్యి ఉండేది, ఇప్పుడు రూ.5వేలు చేశారు. గతంలో క్వార్టర్ బాటిల్ ధర రూ.60 ఉండేది. ఇప్పుడు రూ.180 చేశారు. ఆ దోపీడీ సొమ్ముతో వస్తున్నారు. తీసుకోండి.. తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్న ఆరణి శ్రీనివాసులకు గాజుగుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరుతున్నా. ఎంపీ అభ్యర్థిగా కమలం గుర్తుపై పోటీచేస్తున్న వరప్రసాద్ ను గెలిపించాలని కోరుతున్నా. గతంలో ఇదే వీధిలో పాదయాత్ర చేశా. మీరు పడుతున్న కష్టాలు చూశా. నెల రోజుల్లో కూటమి ప్రభుత్వం వస్తుంది. ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటానని యువనేత లోకేష్ చెప్పారు.