అమరావతి: అనంతపురం జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి కమీ షన్ల కోసం కాంట్రాక్టర్లను బెదిరించటం సిగ్గుచేటని టీడీపీ జాతీయ ప్రధాన కార్య దర్శి నారా లోకేష్ విమర్శించారు. ఈ మేర కు శనివారం ఒక ప్రకటన విడుదల చేశా రు. గత ఏడాది మార్చిలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మో హన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పారిశ్రా మికవేత్తలకు, పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉందని చెప్పడం, ఆ తర్వాత కోడిగుడ్డు మంత్రి గుడివాడ అమర్నాథ్ రూ.13.12 లక్షల కోట్లు విలువైన ఒప్పందాలు చేసుకున్నామని చెప్పడంతో ఆశ్చర్యపోయాను. ఇదే విషయాన్ని అబద్ధా లు, అవాస్తవాల ప్రచారంలో గోబెల్స్ ను తలదన్నే విషపుత్రిక సాక్షిలో తాటికాయంత అక్షరాలతో కూడా రాశారు. ఏడాదైనా మంత్రి చెప్పిన కోడిగుడ్లు పొదగలేదు, ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. జె-ట్యాక్స్ బెడద భరించలేక జాకీ, లులూ, జాకీ వంటి ఎన్నో ప్రఖ్యాత పరిశ్రమలు రాష్ట్రాన్ని వదిలి పరారైన విషయం తెలుసుకున్న పారిశ్రామికవేత్తలు ముఖం చాటేశారు.
అనంతపురం జిల్లాలో వేలాది మహిళలకు ఉపాధి కల్పించే అవకాశమున్న జాకీ పరిశ్రమను తరిమేసిన తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి.. తాజాగా కాసుల కోసం ఓ కాంట్రా క్టర్ వద్ద పనిచేసే 11మంది కూలీలను నిర్బంధిస్తే అనంతపురం జిల్లా కలెక్టర్, ఎస్పీకి పశ్చిమ బెంగాల్ ఎంపీ లేఖ రాయడం రాష్ట్రానికే సిగ్గుచేటు. ఇటువంటి ప్రజాప్రతినిధులున్న రాష్ట్రంలో పెట్టు బడులు పెట్టడానికి ఏ పరిశ్రమదారు డైనా ధైర్యం చేస్తాడా? పెట్టుబడులు తేవడం కమీషన్ల కోసం కాంట్రాక్టర్ పీకపై కత్తిపెట్టి బెదిరించినంత ఈజీ కాదు జగన్మోహన్ రెడ్డీ అని లోకేష్ విమర్శించారు.