- వెన్నంటి ఉన్న ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు
- త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తా
- క్రీడలకు పూర్వవైభవం తీసుకువస్తా
- శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు
అమరావతి : బాధ్యతలు స్వీకరించిన అనంతరం రవినాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు కు, యువనేత, మంత్రి నారా లోకేష్, తల్లి సమానురాలు భువనమ్మకు పాదాభివందనం. నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. యువగళం టీమ్ సభ్యులు నా ప్రాణంతో సమానం…వాళ్లు లేనిదే నేను లేను. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. చిన్నప్పటి నుంచి చంద్రబాబు నాయకత్వ లక్షణాలు గురించి వింటూ పెరిగాను అని తెలిపారు. మా తాత, తండ్రి, నేను తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాం. తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో విద్యార్థి నాయకుడిగా పార్టీలో మొదలైన నా ప్రస్థానం అంచలంచలుగా పార్టీ అధినాయకుల ప్రోత్సాహంతో ముందుకు కొనసాగాను. నాకు శాప్ చైర్మన్ పదవి వచ్చిన తర్వాత మంత్రి రాంప్రసాద్‌రెడ్డిని కలిస్తే సొంత తమ్ముడిలా నన్ను అక్కున చేర్చుకున్నారు. నన్ను వెనకుండి అన్నివిధాలా ప్రోత్సహిస్తానని హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో దీపక్‌రెడ్డి అనేక రకాలుగా యువగళం టీమ్‌కు పలు సూచనలు, సలహాలు ఇచ్చి ప్రోత్సహించారు. టీఎన్‌ఎస్‌ఎఫ్, తెలుగు యువత జిల్లా, రాష్ట్ర విభాగాలన్నింటికీ నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నాదెండ్ల బ్రహ్మం, మల్లిబాబు, దామచర్ల జనార్ధన్, సత్య, శ్రీరామ్ చినబాబు ఇలా అనేకమంది నా వెనకుండి ముందుకు నడిపించారు. అందరికీ నా కృతజ్ఞతలు. రెండేళ్ల పాటు నా భార్య నా వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంది.
నన్ను ఇబ్బందిపెట్టేందుకు పోలీసులు అనేకసార్లు నా ఇంటికి వచ్చినప్పుడు నా భార్య ధైర్యంతో ఎదుర్కొని నిలబడిరది. నేను ఈరోజు ఈ స్థాయికి రావడానికి నా భార్య ప్రోత్సాహం, సహకారం మరువలేనిది. శాప్ చైర్మన్‌గా రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే పర్యటిస్తాను. శాప్ ఆధ్వర్యంలో ఉన్న ఆటస్థలాలు, ఇతర స్థలాలను పరిశీలిస్తాను. గ్రామాల్లో ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాను. గత పాలనలో క్రీడారంగంలో అనేక దోపిడీలకు పాల్పడ్డారు. అన్నింటినీ వెలికితీసి ప్రజల ముందు నిలబెడతాను. టెక్నాలజీతో క్రీడలను యువతకు దగ్గర చేసేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తాను. క్రీడాకారులకు అవసరమైన ఉత్తమమైన కోచ్‌లను అందించేందుకు చర్యలు చేపడ తాను. ఉమ్మడి రాష్ట్రంలో క్రీడలకు ఉన్న ప్రాధాన్యతను తిరిగి తీసుకొచ్చేందుకు పనిచేస్తాను. శాప్ మొత్తాన్ని ప్రక్షాళన చేస్తాం. శాప్‌లో ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావు లేకుండా చేస్తాను. శాప్ చైర్మన్ పదవి నాకు ఒక్కడికే గౌరవం కాదు…టీఎన్‌ఎస్‌ఎఫ్, తెలుగుయువత విభాగాలకు దక్కిన గౌరవంగా భావిస్తానని తెలిపారు.
రవినాయుడును అభినందించిన వారిలో ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, అయితాబత్తుల ఆనందరావు, ఏలూరు ఎంపీ సునీల్‌కుమార్ యాదవ్, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, టీడీపీ జాతీయ కార్యాలయం మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్ర, తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు, మాజీ మంత్రి పీతల సుజాత, తెలుగు అంగన్‌వాడీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత, తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల్పూరి కళ్యాణి, టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్, టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండి రాకేష్ తదితరులు ఉన్నారు. కార్యక్రమం అనంతరం శాప్ చైర్మన్‌ను కుటుంబసభ్యులు, శాప్ అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువగళం టీమ్ సభ్యులు, అభిమానులు, వివిధ క్రీడా సంఘాల సభ్యులు, యూనియన్ నాయకులు కలిసి శాలువాలు కప్పి పూల బొకేలు, జ్ఞాపికలు అందించి అభినందించారు.