అమరావతి: వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు.. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్ కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో హైదరాబాద్‌లో ఉన్న చిన్న ఇంటిని కూడా అమ్ముకునేందుకు సిద్ధపడ్డారని, అలాంటి కుటుంబం నుంచి వచ్చిన జగన్ రెడ్డి అతి తక్కువ సమయంలో ప్రతి నగరంలో విలాసవంతమైన రాజభవనాలు నిర్మించే స్థితికి ఎలా వచ్చాడో ప్రజలే గ్రహించాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాడు గుమ్మడి సంధ్యారాణి అన్నారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఇడుపులపాయలో పెద్ద రాజభవనం.. పులివెందులలో ఒక రాజభవనం.. బెంగళూరులో అమెరికా శ్వేతసౌధాన్ని తలిపించే భారీ రాజప్రాసాదం.. హైదరాబాద్‌లో మరో రాజభవనం.. తాడేపల్లిలో తాను ఉంటున్న భారీ నివాస సముదాయం ఇవీ జగన్ రెడ్డి నివాసమందిరాలు. వీటిని ఇళ్లు అనడం అంటే వాటి హంగుని… నిర్మాణ కౌశలాన్ని కించపరచడమే అవుతుందని సంధ్యారాణి అన్నారు.
చంద్రబాబు ఆనాడు రాజధానిలో కేవలం రూ.560 కోట్లతో ప్రభుత్వ, ఇతర అవసరాలకోసం అనేక నిర్మాణాలు చేపడితే, నేడు జగన్ రెడ్డి కేవలం తాను, తన భార్య ఉండటం కోసం రూ.400 కోట్లతో రుషికొండపై భారీ భవనం నిర్మించుకుంటున్నాడు. ఇంత తక్కువ సొమ్ముతో భారీ రాజభవనం నిర్మించుకుంటున్న జగన్ రెడ్డి నిజంగా పేదవాడేనని సంధ్యారాణి ఎద్దేవా చేశారు. తాను పేదవాడినని చెబుతున్న జగన్ రెడ్డి నిజంగా సైకోనే. ఎందుకంటే ముఖ్యమంత్రిగా నాలుగున్నరేళ్లు పూర్తిచేసుకున్నా కూడా ఇప్పటికీ ఆయన చెప్పే అబద్ధాలు.. అసత్యాలు వింటే అదే నిజమనిపిస్తోంది. జగన్ రెడ్డిని విశాఖపట్నానికి రమ్మని ఎవరు అడిగారు.. అక్కడి ప్రజలే ఈ సైకో ముఖ్యమంత్రి వస్తే తమ పరిస్థితి ఏమిటా అని భీతిల్లిపోతున్నారు. ఇప్పటికే విజయసాయిరెడ్డి సహా జగన్ రెడ్డి.. అతని పార్టీవాళ్లంతా కలిసి విశాఖ నగరాన్నికబ్జాలకు, సెటిల్మెంట్లకు, దోపిడీలకు కేరాఫ్ గా మార్చారని సంధ్యారాణి విమర్శించారు.
పేదకుటుంబం ఉండటానికి సెంటుస్థలం.. జగన్ దంపతులకు లక్షా 40వేల చదరపు అడుగుల భారీ రాజభవనం..
నలుగురు సభ్యులుండే పేద కుటుంబం నివాసముండటానికి సెంటు స్థలం సరిపోతుందని చెబుతున్న జగన్ రెడ్డి, తాను.. తన భార్య ఉండటానికి మాత్రం లక్షా40వేల చదరపు అడుగుల్లో భారీ భవనం ఎందుకు నిర్మించుకుంటున్నాడు? బాత్రూమ్ నిర్మా ణానికి రూ.25లక్షలు ఎందుకు వెచ్చిస్తున్నాడు. నిజంగా పేదలపై.. అక్కచెల్లెమ్మలపై జగన్ రెడ్డికి అంత ప్రేమే ఉంటే, వారికి ఇళ్ల నిర్మాణానికి ఇంటికి రూ.20లక్షలు ఎందుకు ఇవ్వడు? రాత్రికి రాత్రి ప్రజలసొమ్ము గజదొంగలా దోచేస్తున్న జగన్ రెడ్డి పైకి మాత్రం బీద అరుపులు అరుస్తున్నాడు. జగన్ రెడ్డి పాద ప్రభావం వల్లే నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇలాంటి దౌర్భాగ్యపు పరిస్థితి వచ్చింది. 151 స్థానాలు గెలిచానని విర్రవీగడం తప్ప.. ప్రజలకు మంచిచేయడం.. సుపరిపాలన అందిచడం మాత్రం చేతకాదు. నాలుగున్నరేళ్లపాటు కబుర్లు, కట్టుకథలతో కాలక్షేపం చేసిన జగన్ రెడ్డి.. బటన్ నొక్కుడుతో ప్రజల్ని ఉద్ధరిస్తున్నానని దీర్ఘాలు తీసి మరీ చెబుతున్నాడు. జగన్ రెడ్డి తమకు ఇచ్చిన హమీలు ఏవీ నెరవేర్చకుండా తన సుఖం కోసం అన్నీ చేసుకుంటున్నాడని ప్రజలకు అర్థమైంది. రెండు కిలోమీటర్ల దూరానికే రెండుసార్లు హెలికాప్టర్ వినియోగించినప్పుడే జగన్ రెడ్డి ఎంత పేదవాడో ప్రజలు గ్రహించారు. కరోనా సమయంలో వేలాది ప్రజలు చనిపోయినా ఏనాడూ ఒక్క ఇంటి ముఖం కూడా చూడని జగన్ రెడ్డి.. నేడు పేదలకోసం తాను ఉన్నానని చెప్పడం నిజంగా సిగ్గుచేటని సంధ్యారాణి విమర్శించారు.
కక్షకట్టి చంద్రబాబుని జైలుకు పంపాడు
ఏ తప్పూ చేయని చంద్రబాబుని 40 రోజులుగా జైల్లో పెట్టిన జగన్ రెడ్డి.. తాను మాత్రం ఏ తప్పూ చేయనివాడిలా నీతివాక్యాలు ఉపదేశిస్తున్నాడు. నిజంగా చంద్రబాబు తప్పు చేసుంటే జగన్ రెడ్డి నాలుగున్నరేళ్లు ఆగేవాడు కాదు. ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే ఆయన్ని జైలుకు పంపేవాడు. కేవలం చంద్రబాబు ప్రజల్లోకి వెళ్తూ.. తన అవినీతిని, దోపిడీని, దుర్మార్గాలను ప్రజలకు తెలియచేస్తున్నాడనే ఆయనపై కక్ష కట్టి అన్యాయంగా జైలుకు పంపాడు. జగన్ రెడ్డి ఎన్ని కుట్రలు పన్నినా… కుటిల రాజకీయాలు చేసినా.. ప్రజలు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేసి.. జగన్ రెడ్డిని శాశ్వతంగా రాష్ట్రం నుంచి తరిమికొట్టడం ఖాయమని సంధ్యారాణి హెచ్చరించారు.